ఇక చాలు అంటున్న అయ్యన్న!

తెలుగుదేశం పార్టీ పుట్టాక అందులో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి చేరిన తొలి సీనియర్ నాయకుడు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆయన పాతికేళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయిపోయారు. అన్న గారి నుంచి టికెట్…

తెలుగుదేశం పార్టీ పుట్టాక అందులో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి చేరిన తొలి సీనియర్ నాయకుడు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆయన పాతికేళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయిపోయారు. అన్న గారి నుంచి టికెట్ ని అలా అందుకున్న యువకుడు అదే అన్న గారి ప్రభుత్వంలో మంత్రిగా చిన్న వయసులోనే చేపట్టారు.

ఇప్పటికి పదిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏడు సార్లు గెలిచారు. ఆరు సార్లు మంత్రిగా పలు కీలక శాఖలను చూసారు. ఒకసారి ఎంపీగా కూడా అనకాపల్లి నుంచి నెగ్గారు. ఉన్నది ఉన్నట్లుగా బోల్డ్ గా మాట్లాడడం అయ్యన్నకు బలం. అదే ఆయనకు కొన్ని సార్లు ఇబ్బందిగా మారింది.

టీడీపీలో తాను చంద్రబాబు కంటే సీనియర్ అని గట్టిగా ప్రకటించడం అయ్యన్నకే చెల్లు అని అంటారు. అయ్యన్నపాత్రుడు ఏడు పదుల వయసుకు చేరువలో ఉన్నారు. అందుకే ఆయన లేటెస్ట్ గా ఒక సంచలన ప్రకటన చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు.

తనకు వయసు పెరుగుతోందని తన రాజకీయం ఇక చాలు అని అయ్యన్న చెప్పేశారు. తాను చేసినంత సేవ ఈ అయిదేళ్ళలో చేసి రాజకీయాల నుంచి సెలవు తీసుకుంటాను అని అయ్యన్న చెప్పేశారు. అధికారం ఎపుడూ ఎవరికీ శాశ్వతం కాదని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. చేసిన మంచి పనులే శాశ్వతం అని ఆయన అంటున్నారు.

అయ్యన్నపాత్రుడు ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో నర్శీపట్నం నుంచి పదవసారి ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీ చేసి భారీ మెజారిటీని దక్కించుకున్నారు. మంత్రి పదవి వస్తుందని ఆశించారు అని ప్రచారంలో ఉంది. ఆ పదవిలోనే తన రాజకీయ విరమణ చేయాలని అనుకున్నారు. స్పీకర్ పదవి అనుకోకుండా ఆయనను వరించింది.

దాంతో తన నోరు కట్టేసినట్లు అయిందని కూడా అయ్యన్న అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇపుడు ఆయన తన రాజకీయ జీవితానికే స్వస్తి అంటున్నారు. బహుశా ఆయన కుమారుడు విజయ్ కి రూట్ క్లియర్ చేయడానికి అయ్యన్న చూస్తున్నారు అని అంటున్నారు. అయ్యన్న రాజకీయ విరమణ నిర్ణయం ప్రకటించడంతో టీడీపీ ఒక సీనియర్ నేతనుని కోల్పోయినట్లే అంటున్నారు

11 Replies to “ఇక చాలు అంటున్న అయ్యన్న!”

  1. నీ తలకాయి ..

    అయ్యన్న 2024 ఎన్నికలకు ముందే తప్పుకుని విజయ్ కి సీట్ ఇవ్వాలని .. పైగా లోకేష్ టీం లో విజయ్ మేజర్ పార్ట్ గా పని చేస్తుండటం వల్ల .. ఆ మార్పు ఈజీ అనిపించింది..

    కానీ కొన్ని సమీకరణాలు (నేను చెప్పదలచుకోలేదు ) అయ్యన్న ని మాత్రమే పోటీ చేసే విధం గా చేశాయి..

    2029 కి టీడీపీ ఆల్రెడీ రెడీ గా ఉంది.. సుమారు 70% యువ రక్తం..

    జగన్ రెడ్డి కి మాత్రం.. బొత్స, ధర్మాన, విజయసాయి, అంబటి, భూమన… ఎవర్రా మీరంతా… అని జనాల రియాక్షన్..

  2. జగన్ బావ వాడెవడో ఉన్నాడు కదా రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు వాడికి ఇది చుపించామాకు ఇంకో గుండె పోటు వచ్చిన రాగలదు మన అన్న కుటుంబం లో

  3. సిమారు. 70 వేల కోట్ల తో స్టీల్ ఫ్యాక్టరీ ఫైనల్ అయ్యింది వైజాగ్ లో . దాని మీద కనీసం వార్త కూడా లేదు అయ్యి ఖర్మ

Comments are closed.