బాబు పాల‌న‌కు చెడ్డ‌పేరు.. మూడు కార‌ణాలు!

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌హిరంగంగా ఒక నిష్టూర‌మైన నిజాన్ని బ‌య‌ట పెట్టారు. ప్ర‌జ‌లు త‌మ‌ను తిడ్తున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిజానికి ఉప ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న నాయ‌కుడెవ‌రూ ఇలా నిజాల్ని బ‌హిరంగంగా…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌హిరంగంగా ఒక నిష్టూర‌మైన నిజాన్ని బ‌య‌ట పెట్టారు. ప్ర‌జ‌లు త‌మ‌ను తిడ్తున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిజానికి ఉప ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న నాయ‌కుడెవ‌రూ ఇలా నిజాల్ని బ‌హిరంగంగా మాట్లాడ‌రు. త‌న మ‌న‌సులో పాల‌న‌పై అసంతృప్తి, తీవ్ర వ్య‌తిరేక‌త వుంటే, అంత‌ర్గ‌తంగా వెల్ల‌డించాలి. ఆ ప‌ని చేయ‌కుండా, బ‌హిరంగ స‌భ‌లో బ‌య‌ట పెట్ట‌డంతో స‌హ‌జంగానే టీడీపీ నేత‌లు తీవ్ర అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

చంద్ర‌బాబు స‌ర్కార్‌పై జ‌నంలో నాలుగు నెల‌ల‌కే వ్య‌తిరేక‌త రావ‌డానికి ప్ర‌ధానంగా మూడు కార‌ణాలున్నాయి.

ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబునాయుడు బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత ఐఏఎస్‌, ఐపీఎస్ త‌దిత‌ర ఉన్న‌తాధికారుల‌తో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఆ సమావేశంలో బాబు మాట్లాడుతూ త‌మ‌ది పొలిటిక‌ల్ గ‌వ‌ర్నెన్స్ అని ప్ర‌క‌టించారు. అలాగే ఇటీవ‌ల టీడీపీ నాయ‌కుల స‌మావేశంలో కూడా చంద్ర‌బాబు అదే మాట అన్నారు.

పొలిటిక‌ల్ గ‌వ‌ర్నెన్స్ అన‌డంతో అధికార యంత్రాంగం డ‌మ్మీగా మారింది. టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఇష్టానుసారం ప్ర‌వ‌ర్తించ‌డానికి చంద్ర‌బాబు కామెంట్స్ లైసెన్స్ ఇచ్చిన‌ట్టైంది. చ‌ట్ట ప్ర‌కారం పాల‌న సాగించ‌డం అధికార యంత్రాంగానికి క‌త్తిమీద సాముగా మారింది. అధికార యంత్రాంగాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా, కేవ‌లం దోపిడీ ప్రాతిపదిక‌గా ద‌బాయింపు పాల‌న సాగుతోంద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డింది. ఇందుకు త‌గ్గ‌ట్టుగానే అరాచ‌క శ‌క్తులు రెచ్చిపోతుండ‌డం, వాళ్ల‌కు ప్ర‌భుత్వ పెద్ద‌లు వంత పాడుతుండ‌డంతో మంచి పేరు ఎలా వ‌స్తుంద‌ని ఆశిస్తారు?

ఇక రెండో విష‌యానికి వ‌ద్దాం. లోకేశ్ రెడ్‌బుక్‌. కూట‌మి స‌ర్కార్‌కు భారీ డ్యామేజీ క‌లిగించే వాటిలో రెడ్‌బుక్ ముందు వ‌రుస‌లో వుంటోంది. కూట‌మికి అప‌రిమిత‌మైన అధికారం ద‌క్కిన త‌ర్వాత‌, చ‌క్క‌ని పాల‌న అందించ‌డంపై శ్ర‌ద్ధ పెట్టి వుండాల్సింది. కానీ అలా జ‌ర‌గ‌డం లేదే! ఎంత‌సేపూ క‌క్ష‌పూరిత పాల‌న‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నార‌నే భావ‌న బ‌లిప‌డింది. ఇందుకు త‌గ్గ‌ట్టుగానే ప్ర‌తిప‌క్ష నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై కేసులు, భౌతిక‌దాడులు, వేధింపులు నిత్య‌కృత్య‌మ‌య్యాయి. అధికారుల్ని కూడా వ‌దిలిపెట్ట‌డం లేదు.

రెడ్‌బుక్ రాజ్యాంగ‌మంటూ ఎన్ని విమ‌ర్శ‌లొచ్చినా లోకేశ్ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. రెడ్‌బుక్‌లో మూడో చాప్ట‌ర్ రిలీజ్ అయ్యింద‌ని ఆయ‌న అమెరికాలో ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న‌లో మంచి గురించి చ‌ర్చ జ‌ర‌గాల్సింది పోయి, రెడ్‌బుక్‌, వేధింపులు, కేసుల‌పైనే జ‌నం ఎక్కువ‌గా మాట్లాడుకుంటున్నారు.

ప్ర‌భుత్వానికి న‌ష్టం క‌లిగించేవారిలో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. ఇంకా తాను ప్ర‌తిప‌క్ష నాయ‌కుడినే అనుకుంటూ నోరు పారేసుకుంటుంటారు. మాన‌వ హ‌క్కుల్ని కాపాడుకునేందుకు ప్రాణాలు సైతం అర్పించ‌డానికి సిద్ధ‌ప‌డేందుకు సిద్ధ‌మ‌ని చెప్పే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, అదే నోట ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే కాళ్లు చేతులు విర‌గ్గొట్టి మూల‌న ప‌డేస్తా అన్నారు. చిన్నారులు, మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ప్ర‌భుత్వానికి తీవ్ర‌మైన చెడ్డ‌పేరు తీసుకొస్తున్నాయ‌ని తెలిసి, హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌కు వార్నింగ్ ఇచ్చారు. జ‌నం తిడ్తున్నార‌ని , కాస్త ప‌ట్టించుకోవాల‌ని డీజీపీ, ఇంటెలిజెన్స్ శాఖ‌కు మొర‌పెట్టుకోవ‌డం ఆయ‌న‌కే చెల్లింది.

ఉప ముఖ్య‌మంత్రిగా ఉంటూ, కాళ్లు చేతులు విర‌గ్గొడుతా, తోలు తీస్తా, తాట తీస్తాన‌ని చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ, హోంశాఖ మంత్రిని నిల‌దీస్తే ప్ర‌యోజ‌నం ఏంటి? జ‌నం తిడ్తున్నార‌నే ప‌వ‌న్ కామెంట్స్ చంద్ర‌బాబు స‌ర్కార్‌కు భారీ డ్యామేజీ క‌లిగించాయి.

శాంతిభ‌ద్ర‌త‌లు క‌ట్టు త‌ప్ప‌డానికి ఈ ముగ్గురే కార‌ణ‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. వంగ‌ల‌పూడి అనితకు హోంశాఖ ప‌ద‌వి త‌ప్ప‌, ప‌వ‌ర్స్ మాత్రం బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ వ‌ద్దే. అంతెందుకు, నిన్న‌టి ప‌వ‌న్ ప్ర‌సంగంలో ఒక‌వేళ తాను అనుకుంటే అనిత నుంచి హోంశాఖ‌ను తీసుకుంటాన‌ని చెప్పారు. దీన్నిబ‌ట్టి అర్థ‌మ‌య్యేది ఏంటి… ప‌వ‌న్ ద‌య‌పై అనిత హోంశాఖ ప‌ద‌విలో కొన‌సాగుతున్నార‌ని.

ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో చంద్ర‌బాబును ప‌వ‌న్ బ్లాక్ మెయిల్ చేస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. చేసేదంతా చేస్తూ, ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌డంతో ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో కూట‌మి నేత‌లున్నార‌ని ప‌వ‌న్ కామెంట్స్ చెబుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లకు విఘాతం క‌లిగించ‌డంతో పాటు ఇత‌ర అంశాల్లో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక భావ‌న ఏర్ప‌డ‌డానికి అంద‌రి కంటే అధికారం వెలగ‌బెడుతున్న వాళ్ల‌కే బాగా తెలుసు.

16 Replies to “బాబు పాల‌న‌కు చెడ్డ‌పేరు.. మూడు కార‌ణాలు!”

  1. గనుల శాఖ చె-డ్డి తప్ప అందరూ కులాసాగా బయటతిరుగుతున్నారు.. అందుకే చెడ్డ పేరు

    .

    మిల్లెట్ చె-డ్డి ని, rose చె-డ్డి నీ, @#’కొడాలి @#’కుక్కని, @#’వల్లభనేని చెక్కని లోపల వేస్తే మంచి పేరు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కూటమి ప్రభుత్వానికి

  2. గనుల శాఖ చె-డ్డి తప్ప అందరూ కులాసాగా బయటతిరుగుతున్నారు.. అందుకే చెడ్డ పేరు

    .

    @#’మిల్లెట్ చె-డ్డి ని, rose చె-డ్డి నీ, @#’కొడాలి @#’కుక్కని, @#’వల్లభనేని చెక్కని లోపల వేస్తే మంచి పేరు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కూటమి ప్రభుత్వానికి

  3. గనుల-శాఖ #చె-డ్డి తప్ప అందరూ కులాసాగా బయటతిరుగుతున్నారు.. అందుకే చెడ్డ పేరు

    .

    @#’మిల్లెట్ #చె-డ్డి ని, rose చె-డ్డి నీ, @#’కొడాలి @#’కుక్కని, @#’వల్లభనేని%# చెక్కని లోపల వేస్తే మంచి పేరు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కూటమి ప్రభుత్వానికి

  4. గనుల-శాఖ #చె-డ్డి@# తప్ప అందరూ కులాసాగా బయటతిరుగుతున్నారు.. అందుకే చెడ్డ పేరు

    .

    @#’మిల్లెట్ #చె-డ్డి%# ని, @#rose @#చె-డ్డి నీ, @#’కొడాలి @#’కుక్కని, @#’వల్లభనేని%# చెక్కని లోపల వేస్తే మంచి పేరు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కూటమి ప్రభుత్వానికి

  5. ఒరె జగన్ ముక్యమంత్రిగా ఉన్నప్పుడు అయన ఇష్టారాజ్యం గా ప్రవర్తించాడు. అయన ఎదొ దివంశ శంబూతుడిగా రెచ్చిపొయాడు. ఇక Y.-.C.-.P కార్యకర్తలు రెచ్చిపొయారు.

    .

    ఇప్పుడు చిన్న చిన్న వాటికె మొరిగె నువ్వు, జగన్ ఉన్నపుడు ఇలా రాసావా? RRR ని MP అని కూడా చూడకుండా పొలీసు 3rd డిగ్రీ ప్రయొగిస్తె… చితకబాదారా మరి జగన్ తొ పెట్తుకుంటె ఇలానె ఉంటుంది అని వగలు పొయావు!

    1. ఆ గడ్డేదో జగన్ రెడ్డి కే పెట్టి ఉంటె.. ఇప్పుడిలా ప్రతిపక్ష హోదా కోసం అడుక్కునే దరిద్రపు స్థితి తప్పేది కదా..

  6. ఆర్సెలర్ లక్షా అరవై వేల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రం లో పెడుతుంటే.. ఆ వార్త కానీసం ఒక ఆర్టికల్ లో కూడా రాయలేదు..

    ఎంత కడుపు మంటో .. క్లియర్ గా తెలుస్తోంది..

    ఒకే వార్త ని పది రకాలుగా విడగొట్టి.. 20 ఆర్టికల్స్ రాస్తుంటాడు.. ఇంత భారీ పెట్టుబడి గురించి ఒక్క ముక్క కూడా లేదు..

    నిన్న ఇజయమ్మ రాసినట్టు ఒక ఫేక్ లెటర్ వైసీపీ సోషల్ మీడియా లో వదిలారు.. అందుకు ఆవిడ అది ఫేక్ లెటర్ అని స్టేట్మెంట్ ఇచ్చారు..

    ఆ వార్త లేనే లేదు..

    ఇంట్లో మనుషుల మీద కూడా ఫేక్ వార్తలు వండుతున్నారు.. ఇది చెడ్డ పేరు కాదా.. మనకు కనపడదా..?

  7. రెడ్ బుక్ అండర్లో హోమ్ శాఖ ఉంతుందని భావించాం. కానీ చాణక్య రాజకీయం చక్రం తిప్పిన విషయం మర్చిపోకూడదు..బాబు గారి ముందు చూపు చాలా మందికి తెలుసు..

  8. 2024- CBN -CM, PK- DCM. 2029- CBN-PM, PK-CM, Lokesh- DCM, 2034 – CBN – Rashtrapati, PK- Central Home minister, Lokesh- CM. ఇది పక్కా, రాసి పెట్టుకోండి తమ్ముళ్ళూ

  9. కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి ,ఇస్తున్న పథకాలు ,వేస్తున్న రోడ్లు ,

    వస్తున్న పెట్టుబడులు ఇవేవి గ్రౌండ్లో వినిపించడం /కనిపించడం లేదు .. అలాగని వై చీపి చేస్తున్న నాయిస్ పట్ల ప్రజలకు ఆసక్తీ కూడా లేదు . కూటమి ఎమ్మెల్యేలు వారే చేస్తున్న అభివృద్ధి ని కనీసం వారి వారి నియోజకవర్గంలో ప్రచారం చేసుకోకుండా అలసత్వం వహిస్తున్నారు 2019 ఓటమి నుంచి ఏం పాఠం నేర్చుకున్నారో కూడా అర్థం కావడం లేదు .

    ప్రభుత్వం చేసేది ప్రజలు గమనిస్తున్నారు ..కానీ ప్రత్యర్థి చెప్పే అబద్దాలకు ప్రజలు కనెక్ట్ అయ్యే సందర్భం రావచ్చు .. GA గాడి రాసిన 3 కారణాలు అక్షరాలా నిజాము కాదు …

    1. ఇప్పటి వరకు ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకం లేదు. ఉన్నదీ అల్లా కార్యకర్తల అసంతృప్తి మాత్రమే .

    2. అసలు ఇక్కడ రెడ్ బుక్ అమలు కాలేదనే కదా సామాన్య జనాలు నుంచి కార్యకర్త వరకు ఉన్న కడుపు మంట .

    3. శాంతిభద్రతల విషయంలో ఇప్పటికి జనాలు 2024 కి ముందు బేరీజు వేసుకొని చాలా ప్రశాంతంగా ఉన్నారు . గ్రౌండ్లెవెల్ ఎవ్వరు మాట్లాడుకోవడం కూడా లేదు . పుష్కలంగా ఇసుక దొరకడం వల్ల ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటూ హ్యాపీ గా ఉన్నారు .

Comments are closed.