విద్యార్థినిపై అత్యాచారం…!

తిరుప‌తి జిల్లా వ‌డ‌మాల‌పేట‌లో మూడున్న‌రేళ్ల బాలిక‌పై హ‌త్యాచారాన్ని మ‌రిచిపోక‌నే, మ‌రో దారుణం అదే జిల్లాలో చోటు చేసుకుంది. తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తున్న అత్యాచార ఘ‌ట‌న వివ‌రాలు…బాధిత విద్యార్థిని తండ్రి చెప్పిన మేర‌కు ఇలా ఉన్నాయి.…

తిరుప‌తి జిల్లా వ‌డ‌మాల‌పేట‌లో మూడున్న‌రేళ్ల బాలిక‌పై హ‌త్యాచారాన్ని మ‌రిచిపోక‌నే, మ‌రో దారుణం అదే జిల్లాలో చోటు చేసుకుంది. తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తున్న అత్యాచార ఘ‌ట‌న వివ‌రాలు…బాధిత విద్యార్థిని తండ్రి చెప్పిన మేర‌కు ఇలా ఉన్నాయి.

తిరుప‌తి జిల్లా య‌ర్రావారిపాలెం మండ‌లం య‌ల్ల‌మంద గ్రామంలోని కొత్త ద‌ళిత‌వాడ‌కు చెందిన బాధిత బాలిక‌ ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. సోమ‌వారం సాయంత్రం య‌ల్ల‌మంద జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్ నుంచి ఇంటికి వెళ్ల‌డానికి బ‌య‌ల్దేరింది. మెయిన్ రోడ్డు నుంచి అర‌కిలోమీట‌ర్ దూరంలో ఉన్న మెట‌ల్‌రోడ్డు మ‌లుపు తిర‌గ్గానే ఇద్ద‌రు యువ‌కులు ప‌ల్స‌ర్ బైక్‌పై వ‌చ్చి అమ్మాయిని అడ్డుకున్నారు.

ఆ ఇద్ద‌రిలో ఒక‌డు కాలుతో బాలిక క‌డుపు మీద త‌న్నాడు. బాలిక కింద‌ప‌డ‌గానే మ‌త్తు మందు క‌లిపిన నీళ్లు బ‌ల‌వంతంగా తాగించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే తాగ‌డానికి విద్యార్థిని నిరాక‌రించింది. దీంతో మ‌రోసారి విద్యార్థిని కాళ్ల‌తో త‌న్ని, క‌త్తితో దాడి చేశారు. అనంత‌రం మ‌త్తు మందు నీళ్లు తాగించారు. అప‌స్మార‌క స్థితిలో ఉన్న విద్యార్థిని రోడ్డుకు కొంచెం దూరంలో ఉన్న ముళ్ల పొద‌ల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

త‌న కుమార్తె ఎంత సేప‌టికీ ఇంటికి రాక‌పోవ‌డంతో తండ్రి వెతుక్కుంటూ వ‌చ్చాడు. రోడ్డు ప‌క్క‌న ముళ్ల పొద‌ల్లోంచి బాలిక ఆర్త‌నాదాలు విని, అక్క‌డికి వెళ్లాడు. ముళ్ల పొద‌ల్లో నిస్స‌హాయ స్థితిలో క‌న్నీళ్ల ప‌ర్యంత‌మ‌వుతున్న కూతురిని చూసిన తండ్రి నిలువునా కూలిపోయినంత ప‌నైంది. వెంట‌నే తేరుకుని కుమార్తెను ఆటోలో పీలేరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ ప్రాథ‌మిక చికిత్స జ‌రుగుతుండగానే పోలీసులు వెళ్లారు. అమ్మాయి తండ్రి పోలీసుల‌తో మాట్లాడుతూ త‌న కుమార్తెపై ఇద్ద‌రు వ్య‌క్తులు అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్టు ఫిర్యాదు చేశాడు.

అయితే ఆస్ప‌త్రి బ‌య‌ట ఉన్న మీడియా ప్ర‌తినిధుల్ని పోలీసులు లోప‌లికి అనుమ‌తించ‌లేదు. బాధితురాలి తండ్రిని కూడా మీడియాతో మాట్లాడ‌కుండా అడ్డుకున్నారు. అనంత‌రం బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం తిరుప‌తి మెట‌ర్నిటీ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే… విద్యార్థిని త‌న‌ను అత్యాచారం చేశార‌ని చెబుతోంది. అలాగే విద్యార్థిని తండ్రి కూడా ఇదే మాట చెబుతున్నాడు. కానీ పోలీసులు మాత్రం అత్యాచారం జ‌రిగింద‌ని నిర్ధార‌ణ కాలేద‌ని చెబుతున్నారు. ఈ విష‌యం ఎవ‌రైనా మాట్లాడితే కేసు పెడ‌తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇదిలా వుండ‌గా ప్ర‌తిరోజూ ఆ ఊరి నుంచి ఇద్ద‌రు అబ్బాయిలు, బాధితురాలు హైస్కూల్‌కు వెళ్లేవాళ్లు. నిన్న మాత్రం అబ్బాయిలు స్కూల్‌కు వెళ్ల‌లేదు. అమ్మాయి ఒక్క‌టే వెళ్లింది.

6 Replies to “విద్యార్థినిపై అత్యాచారం…!”

  1. ఛాన్స్ దొరికింది కదా అని paytm కు క్కలు ఎక్కువ మొరుగుతున్నాయ్ .. కూటమి చాలా బలంగా ఒక లక్ష్యం తో ఉంది.. అక్కడ జరిగింది ఇంత ఐతే కు క్కలు GA అంత చేస్తున్నాయ్..

Comments are closed.