తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షుడుగా టీవీ 5 అధినేత బిఆర్ నాయుడు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. వేదపండితుల ఆశీర్వచనాల మధ్వయ ఆలయ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు ఆయనతో ప్రమాణం చేయించారు. మొత్తం 25 మంది పాలక మండలి సభ్యులలో మరికొందరు సభ్యులు కూడా ఆయనతో కలిసి ప్రమాణం చేశారు. మొత్తానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాష్ట్రంలోని నామినేటెడ్ పదవుల్లో అత్యంత కీలకం అయిన టీటీడీ నూతన పాలకమండలి కొలువు తీరింది.
అయితే చంద్రబాబునాయుడు ప్రభుత్వం యొక్క పరువు ప్రతిష్ఠలు బిఆర్ నాయుడు మీద కూడా కీలకంగా ఆధారపడి ఉన్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే తిరుమల మీద అందరి కళ్లూ ఉంటాయి. దేశవ్యాప్తంగా కూడా తిరుమల వ్యవహారాలు అందరికీ ఆసక్తికరంగా ఉంటాయి.
తిరుమలలో ఏ చిన్న పొరబాటు, తప్పు జరిగినా దేశమంతా నిందిస్తుంది. అలాగే తిరుమల దేవస్థానాల పరిపాలన వ్యవహారాలు అంతా సవ్యంగా ఉంటే అంతే స్థాయిలో దేశమంతా ప్రశంసిస్తుంది. కాబట్టి.. తిరుమల వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు సంబంధించిన వ్యవహారం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేవలం అది మాత్రమే కాదు.. జగన్ పరిపాలన కాలంలో టీటీడీ భ్రష్టుపట్టిపోయిందని, పరిపాలన గాడి తప్పిందని తెలుగుదేశం నాయకులు అనేక ఆరోపణలు చేశారు. వాటన్నింటినీ నిరూపించడం కూడా ఇప్పుడు బిఆర్ నాయుడు బాధ్యత అని పలువురు భావిస్తున్నారు.
ప్రధానంగా తిరుమలేశుని లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి జంతువుల కొవ్వుతో కల్తీ అవుతున్నదనే ఆరోపణలు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. ఆ వివాదం దేశాన్ని ఎలా కుదిపేసిందో అందరికీ తెలుసు. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయో కూడా స్పష్టంగా ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలియదు. కానీ దేశమంతా అట్టుడికిపోయింది. ఇతర దేశాల్లో ఉండే హిందువులు కూడా దీని గురించే మాట్లాడారు.
ఇప్పుడు బిఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ గా బాబు ప్రభుత్వం చేసిన ఆ ఆరోపణలను నిరూపించే బాధ్యత తీసుకోవాలని పార్టీ కోరుకుంటున్నది. కొన్నాళ్లు విచారణ నడిపించి.. ఆ తర్వాత ‘అవును నెయ్యి కల్తీ జరిగింది. జగన్ ప్రభుత్వ కాలంలో ఇలాంటి ద్రోహాలు జరిగాయి..’ అనే ప్రకటనతో ఆయన ప్రెస్ మీట్ పెట్టాలని పార్టీ వారు కోరుకుంటున్నారు.
తిరుమల ఆలయానికి జగన్ సర్కారు ద్రోహం చేసిందని ఎంతగా ప్రచారం చేస్తే అంతగా తమకు రాజకీయ మైలేజీ ఉంటుందనేది తెలుగుదేశం ఆలోచన. అందుకు మీడియా సంస్థకు స్వయంగా అధిపతి కూడా అయిన బిఆర్ నాయుడు తమకు తోడ్పాటు అందించాలని వారు కోరుకుంటున్నారు. మరి ఈ ఆశలను ఆయన ఏమేరకు నెరవేరుస్తారోచూడాలి.
అందరు మన సకల శాఖా మంత్రిలా ఉంటారా..అన్నిట్లో వేలు పెట్టడానికి? కోర్ట్ పర్వేక్షణ లో సిట్ దర్యాప్తు చేస్తుంటే టీటీడీ చైర్మన్ ఎలా ప్రకటన చేస్తాడు
Call boy jobs available 9989793850
vc available 9380537747
vc estanu 9380537747