కేబినెట్ నుంచి తీసివేతలపై అప్పుడే కసరత్తులు!

చంద్రబాబునాయుడు కేబినెట్ కూర్పు చేసినప్పుడు పలువురు ఆశ్చర్యపోయారు. చాలామంది సీనియర్లకు అందులో చోటు దక్కలేదు. అన్నీ కొత్త మొహాలే. పైగా వయసులో కూడా చిన్నవారికి మంత్రి పదవులు లభించాయి. ఈ వైఖరిపై రకరకాల వ్యాఖ్యలు…

చంద్రబాబునాయుడు కేబినెట్ కూర్పు చేసినప్పుడు పలువురు ఆశ్చర్యపోయారు. చాలామంది సీనియర్లకు అందులో చోటు దక్కలేదు. అన్నీ కొత్త మొహాలే. పైగా వయసులో కూడా చిన్నవారికి మంత్రి పదవులు లభించాయి. ఈ వైఖరిపై రకరకాల వ్యాఖ్యలు వచ్చాయి. సీనియర్లకు చోటు ఇవ్వకపోవడంపై కొందరు పెదవి విరిస్తే.. మరికొందరు యువరక్తాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ శెభాష్ అన్నారు.

ఏది ఏమైనా మంత్రి వర్గ కూర్పులో లోకేష్ ముద్ర కనిపిస్తున్నదని, లోకేష్ టీమ్ గా నిలవగల వారికే అవకాశాలు దక్కుతున్నాయని అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ సరిగ్గా అయిదు నెలలు కూడా గడవక ముందే.. వారిలో అసమర్థత, అత్యాశ బయటకు వస్తున్నాయి. కేబినెట్లోని కొందరిని తొలగించి వేరే వారితో భర్తీ చేయడం గురించి ప్రభుత్వాధినేత చంద్రబాబునాయుడు కసరత్తు చేయలవలసిన స్థాయిలో వారి వైఫల్యాలు దొరికిపోతున్నాయి.

కీలకమైన హోంశాఖను వంగలపూడి అనిత చేతుల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు. ఏదో మహిళ చేతిలో శాంతి భద్రతలు పెట్టినట్టుగా కనిపిస్తే చాలు.. ఆ శాఖ వ్యవహారాలన్నీ తెర వెనుకనుంచి తామే నడిపించుకోవచ్చునని ఆయన భావించి ఉండొచ్చు. కానీ అనిత సారథ్యంలో పోలీసు శాఖ ఎందుకూ కొరగాకుండాపోతున్నదని, కనీసం తమ పార్టీ వారిని కూడా లెక్కచేయకుండా తయారవుతున్నదని వారు ఇప్పుడు భయపడుతున్నారు. ఆమె కనీసం పోలీసులు కదలిక తీసుకురాలేకపోతున్నదని అనుకుంటున్నారు. అనిత చేతగానితనాన్ని పవన్ కల్యాణ్ బహిరంగంగానే ఎండగట్టిన సంగతి తెలిసిందే. ఆమెను కొనసాగిస్తే పరువు పోతుందని భయపడుతున్నారు.

మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ విషయంలో నేరుగా చంద్రబాబునాయుడే ఫైర్ అయ్యారు. తీరు మార్చుకోకపోతే కష్టం అని హెచ్చరించారు. సుభాష్ వల్ల నష్టం జరుగుతుందని కూడా చంద్రబాబు భయపడినట్టు తెలుస్తోంది. మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. ఆయన భార్య ఏకంగా పోలీసుల మీదనే సాగించిన దాదాగిరీ చూసి చంద్రబాబునాయుడే నివ్వెరపోవడం విశేషం. ఈరకంగా పలువురు మంత్రులు ఆ స్థాయికి తాము తగము అని నిరూపించుకుంటున్న పరిస్థితి కల్పిస్తోంది.

కేబినెట్ నుంచి ఎవరెవరిని తీసివేయాలనే కసరత్తును చంద్రబాబు ప్రారంభించాల్సి వస్తోంది. అయితే ఇంత తొందరగా కేబినెట్లో మార్పులు చేస్తే.. అది అంతిమంగా చంద్రబాబునాయుడు చేతగానితనం కిందకు వస్తుంది. అందుకే ఆయన సంకోచిస్తున్నారని సమాచారం. కానీ వీలైనంత త్వరగా వీరికి చెక్ పెట్టవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

11 Replies to “కేబినెట్ నుంచి తీసివేతలపై అప్పుడే కసరత్తులు!”

  1. గత ప్రభుత్వం లో ఇద్దరు హోమ్ మంత్రుల్ని మహిళలని పెట్టు తెరవెనుక సఖల శాఖా మంత్రి ద్వారా పనులు చేయించింది మనం కాదా?

  2. వీళ్ళందరినీ తీసేసి మన వైసీపీ మంత్రులని ఆదర్శంగా తీసుకోవాలి అమ్మ లక్క లు తిట్టడం లో పీఎచ్డీ చేసిన కొడాలి లాంటి వాడిని సబ్జెక్ట్ తెలీకుండా బుల్లెట్ దింపుతా లాంటి సినిమా డైలాగ్ లు చెప్పే అనిల్ అన్న లాంటి వాడిని అరగంట వస్తావా అనే అంబోతు రాంబాబు ని గంట కి పని చెప్పే అవంతి లాంటి వాళ్ళని పెట్టాలి అని ఈ ఆర్టికల్ రాసిన కవి భావం

  3. GA..nuvvu CBN Palana gurinchi emi raasina, adi neeke boomerang avutundi. Endukantey, alantivanni, mee Jagan palana lo already jariginavey. Ex. Ippudu raasinadi. Mahilani home minister ga peditey, yetavenukanundi annee nadipinchachochubani CBN anukunnademo ani raasav. Mari Jagan kooda alaanukuney..iddaru mahilalni home ministers ni chesaada. So, better you think twice when you write something shit here.

  4. పొలీసుల మీద పెత్తనం చెస్తెనె మంత్రి పదవి పొతె, ఇక లొగడ YCP లొ జగన్ అందరీ తెసెసి ఉండాలి!!

  5. పొలీసుల మీద పెత్తనం చెస్తెనె మంత్రి పదవి పొతె, ఇక లొగడ YCP లొ జగన్ అందరీ తెసెసి ఉండాలి!!

  6. పొలీసుల మీద పెత్తనం చెస్తెనె మంత్రి పదవి పొతె, ఇక లొగడ Y.-.C.-.P లొ జగన్ అందరీ తెసెసి ఉండాలి!!

Comments are closed.