వరుణ్ తేజ్ ఎందుకలా?

సాధారణంగా కాంట్రావర్సీలకు దూరంగా వుంటారు హీరో వరుణ్ తేజ్. కోపం వస్తుంటుంది. అగ్రిసివ్ అవుతుంటారు. కానీ పబ్లిక్ ఫ్లాట్ ఫారమ్ మీద, మీడియా ముందు మాత్రం వీలయినంత కంట్రోల్డ్ గా వుంటారు. కానీ అలాంటిది…

సాధారణంగా కాంట్రావర్సీలకు దూరంగా వుంటారు హీరో వరుణ్ తేజ్. కోపం వస్తుంటుంది. అగ్రిసివ్ అవుతుంటారు. కానీ పబ్లిక్ ఫ్లాట్ ఫారమ్ మీద, మీడియా ముందు మాత్రం వీలయినంత కంట్రోల్డ్ గా వుంటారు. కానీ అలాంటిది నిన్నటికి నిన్న విశాఖలో ఓపెన్ డయాస్ మీద కొన్ని మాటలు మాట్లాడారు. వితిన్ నో సెకెండ్… జనం ఆ మాటలను హీరో అల్లు అర్జున్ కు కనెక్ట్ చేసేసుకున్నారు.

తను తన ఫ్యామిలీ గురించి తరచు ఎందుకు మాట్లాడతాను.. అన్న విమర్శ వినిపిస్తూంది.. అంటూ, ఎందుకు తలచుకోకూడదు అనే కాన్పెస్ట్ లో వరుణ్ కొన్ని మాటలు అన్నారు. రెండు మూడు హిట్ లు వచ్చినంత మాత్రాన మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన వెనుక ఎవరు వున్నారు ఇలాంటివి మరిచిపోకూడదు అనే సరికి అందరూ అల్లు అర్జున్ కు కనెక్ట్ చేసేసుకున్నారు.

సరే, ఆ సంగతి అలా వుంచితే మెగా హీరోలు మీడియా ముందుకు వస్తే అందరూ అడిగేది ఆ ఫ్యామిలీలో పెద్దల గురించే బాబాయ్ పవన్, పెద్దాయిన మెగాస్టార్ ప్రస్తావన లేకుండా మీడియా ఇంట్రాక్షన్లు ముగియవు. ఎందుకంటే వారి ప్రస్తావన వుంటేనే విషయం రక్తి కడుతుంది. అలాగే ఫంక్షన్ లకు వచ్చేవారు సైతం పవన్ గురించి ఎక్కడో ఒక దగ్గర లింక్ చేసుకుంటే తప్ప కిక్ రాదు.

అందువల్ల వరుణ్ తేజ్ కూడా తన ఫ్యామిలీ గురించి మాట్లాడడంలో తప్పు లేదు. ఈ విషయాన్ని క్లారిటీగా చెప్పవచ్చు. కానీ వరుణ్ అలా కాకుండా, ఎక్కి వచ్చిన మెట్లను మరిచిపోతే తప్పు కదా అనే కాన్పెస్ట్ లో ఏవో మాటలు అన్నారు. అవి కాస్తా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లోని గ్రూపులను మరింత బయటపెట్టబోతున్నాయి.

11 Replies to “వరుణ్ తేజ్ ఎందుకలా?”

  1. మన ఎదుగుదలకి కారకులను మరచిపోకుడదు అన్నారు వరుణ్ గారు అందులో తమరికి వచ్హిన నొప్పేందో GA, మనకి నచ్హే బ్యాచ్ అంతా ఎదిగాక తల్లి రొమ్ము గుద్దే బాపతే కదా

  2. వీడి సినిమాకి కొంచెమైనా బజ్ రావాలంటే ఆ మాత్రం మాట్లాడాలి కదా.

  3. Assalu idem controversy, fans ki pani leka yedoti anukovadam tappa. Abhimanam undali tappu ledu. Alage mana gurtimpu manaki undali. Chettu Peru cheppi yenni rojulu kaayalu ammukuntam. Inta matladutunnaru pk sir stage meeda megastar gurinchi chala takkuva sarlu matrame matladaru. Ante aayana kuda viswhasam lenivaara? Manasulo unchukuni avasaram ayina chota chepte chalu. Prati chota chepte okati mental ayyundali. Rendu veedi daggara vishayam (talent) lekunda ayina undali. Aa daggara pk sir daggara talent undi kabatte stars ayyaru. Pani Leni mangalodu pilli bochhu goriginattu verri fans gola chestuntaru.

Comments are closed.