ఒక్క పాటకు రెండు కోట్లు!

పుష్ప 2 సినిమాలో ఒక్క పాటకు డ్యాన్స్ చేసినందుకు హీరోయిన్ శ్రీలీలకు వచ్చిన పారితోషికం రెండు కోట్లు అని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

భలే మంచి చౌకబేరము.. కాదు కాదు.. భలే మంచి లాభసాటి బేరము. పుష్ప 2 సినిమాలో ఒక్క పాటకు డ్యాన్స్ చేసినందుకు హీరోయిన్ శ్రీలీలకు వచ్చిన పారితోషికం రెండు కోట్లు అని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఇది ఆమె ఓ సినిమాకు తీసుకునే పారితోషికంతో సమానం. సినిమా చేయాలి అంటే కనీసం 60 రోజులు కాల్ షీట్లు ఇవ్వాలి. పాట అయితే మహా అయితే మూడు నుంచి అయిదు రోజులు. అందువల్ల కిస్సిక్ సాంగ్ శ్రీలీలకు లాభసాటి బేరమే.

ప్రస్తుతం శ్రీలీల మూడు నాలుగు రోజులు అడ్జస్ట్ చేయలేనంత బిజీగా అయితే లేదు. చేతిలో రెండు మూడు సినిమాలు వున్నాయి. ఒకటి ఆల్ మోస్ట్ పూర్తి కావచ్చింది. రెండు చేయాల్సి వుంది. ఇలాంటి టైమ్ లో రెండు కోట్ల రెమ్యూనిరేషన్ తో పాటకు డ్యాన్స్ చేసే చాన్స్ వచ్చింది అంటే మరో సినిమా చేసినట్లే కదా.

పుష్ప 2 సాంగ్ కు ముందుగా శ్రద్ద కపూర్ ను అనుకున్నారు. కానీ ఆమె నుంచి అలవికాని రేట్ కొటేషన్ రావడంతో బేరాలు కొంత వరకు జరిగి ఆగిపోయాయి. శ్రద్దకు ఇస్తామన్న దాంట్లో దాదాపు సగానికే శ్రీలీలతో వర్క్ పూర్తి చేసుకున్నారు నిర్మాతలు.

8 Replies to “ఒక్క పాటకు రెండు కోట్లు!”

  1. “పుష్ప1″ లో ” ఓ అంటావా maawa, ఊ ఊ అంటావా mawaa” అని బూతు ఐటెం పాట, పుష్ప2 లో బహుశా “దెంగుతవ mawa, దెంగలేను అంటావా mawa” ani పెడతారు ఏమో

Comments are closed.