పుష్ప-2.. లేడీ గెటప్ కాదు, సఫారీ సూట్

పుష్ప-2 సినిమాకు ఓ లుక్, ఫీల్, హైప్ తీసుకొచ్చిన మొట్టమొదటి అంశం అల్లు అర్జున్ ను లేడీ గెటప్ లో చూపించడం. ఈ మేకోవర్ కోసం తను ఎంత కష్టపడ్డాడో ఆల్రెడీ బయటపెట్టాడు బన్నీ.…

పుష్ప-2 సినిమాకు ఓ లుక్, ఫీల్, హైప్ తీసుకొచ్చిన మొట్టమొదటి అంశం అల్లు అర్జున్ ను లేడీ గెటప్ లో చూపించడం. ఈ మేకోవర్ కోసం తను ఎంత కష్టపడ్డాడో ఆల్రెడీ బయటపెట్టాడు బన్నీ. అసలు ఈ గెటప్ ఎలా పుట్టుకొచ్చింది.. దీనికంటే ముందు ఏం ట్రై చేశారు.. ఇప్పుడా వివరాలు వెల్లడించాడు.

“పుష్ప-2లో మహిళా గెటప్ పూర్తిగా సుకుమార్ ఐడియా. ఈ గెటప్ వెనక ఓ కథ ఉంది. పార్ట్-2 కోసం పుష్ప ను ముందుగా ఓ రిచ్ లుక్ లో, సఫారీ సూట్ లో ఫిక్స్ చేశాం. ఫొటోషూట్ కూడా పూర్తయింది. ఇక లుక్ రిలీజ్ చేయడమే ఆలస్యం. సరిగ్గా రిలీజ్ చేద్దామనుకున్న టైమ్ లో సుకుమార్ వద్దన్నాడు. తనకు నచ్చలేదన్నాడు, ఇంకా ఏదో కావాలన్నాడు. ప్రేక్షకులకు ఏదైనా షాక్ ఇద్దామన్నాడు. అప్పుడే ఆయనకు లేడీ గెటప్ గుర్తొచ్చింది. అది విని నేను షాక్ అయ్యాను.”

అలా లేడీ గెటప్ వెనక జరిగిన స్టోరీని బయటపెట్టాడు బన్నీ. ఆ తర్వాత ఆ గెటప్ కోసం చాలా కష్టపడ్డామని.. ఒక దశలో ఇక లేడీ గెటప్ వర్కవుట్ కాదేమో అనే అనుమానం కూడా వచ్చిందన్నాడు.

“సినిమాలో లేడీ గెటప్ ఎలా ఉంటుందనే విషయాన్ని సుకుమార్ నాకు వివరించాడు. అక్కడ్నుంచి లేడీ గెటప్ పై వర్కవుట్ చేశాం. 2-3 ఫొటోషూట్స్ చేశాం. ప్రతిసారి ఫెయిల్ అయ్యాం. తృప్తి లేదు. మా మీద మాకే డౌటొచ్చింది. మూడోసారి ఫొటోషూట్ చేసినప్పుడు మాత్రం అనుకున్నది సాధించాం. ఆ లుక్ చూసిన తర్వాత సుకుమార్ ఆలోచన స్థాయి ఏంటో నాకు అర్థమైంది.”

నా 20 ఏళ్ల సినీ జీవితంలో లేడీ గెటప్ కోసం కష్టపడినట్టు మరే సీన్ కోసం కష్టపడలేదని వెల్లడించాడు అల్లు అర్జున్. ఆ గెటప్ గురించి ఎక్కువగా చెప్పనని, స్క్రీన్ పై ఆడియన్స్ ఆ ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేసిన తర్వాత మాట్లాడతానని అన్నాడు.

7 Replies to “పుష్ప-2.. లేడీ గెటప్ కాదు, సఫారీ సూట్”

Comments are closed.