హోంబోలే-ప్రభాస్.. వేరే దర్శకుడు?

చెప్పిన లైన్ లేదా కథ నచ్చలేదా అన్నది క్లారిటీ లేదు కానీ, మొత్తానికి ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ సినిమా ఉండదు అని తెలుస్తోంది.

బాహుబలి ప్రభాస్‌తో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు అంటూ ప్రకటించింది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే. ఈ ప్రాజెక్టుల వివరాలు పూర్తిగా వెల్లడించలేదు. ఏ దర్శకులు, ఏ ప్రాజెక్టులు అన్నది తెలియదు. అయితే అందులో ఒకటి ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ అని వార్తలు బయటకు వచ్చాయి. ప్రశాంత్ వర్మతో ప్రభాస్ సినిమా ఉంటుందని తెగ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గాసిప్ మరోటి వినిపిస్తోంది.

హోంబలేతో సమస్యనా? ప్రభాస్‌తోనా? చెప్పిన లైన్ లేదా కథ నచ్చలేదా అన్నది క్లారిటీ లేదు కానీ, మొత్తానికి ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ సినిమా ఉండదు అని తెలుస్తోంది. ఈ మేరకు ఇరు వైపులా క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. మరి సమస్య ఎక్కడుందో? ప్రభాస్‌కు అయితే జస్ట్ ఒకసారి కలిసారంతే ప్రశాంత్ వర్మ. సినిమా చేద్దాం అనుకున్నారంతే అని తెలుస్తోంది. అందువల్ల కథ నచ్చలేదు అనే పాయింట్ ఉత్పన్నం కాదు.

హోంబలేతో టెర్మ్‌లు సెట్ కాలేదా? లేక మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవల ప్రశాంత్ వర్మ మీద చాలా గాసిప్‌లు, వార్తలు వస్తున్నాయి. మైత్రీ ప్రాజెక్ట్ కూడా ముందు వేరే హీరోతో అనుకుని క్యాన్సిల్ అయింది. తర్వాత మరో హీరోతో చేస్తున్నారు. మొన్న కథ ఇచ్చిన గౌతమీ నందన వాసుదేవ దారుణంగా ఫెయిల్ అయింది.

6 Replies to “హోంబోలే-ప్రభాస్.. వేరే దర్శకుడు?”

  1. ఒక్క హనుమాన్ చూపించి ఈయన్ని మరీ ఎక్కువ ఊహించుకుంటున్నారు మీరు

Comments are closed.