ప్ర‌జాపోరాటానికి త‌లొగ్గిన రేవంత్ స‌ర్కార్‌

ప్ర‌జా పోరాటానికి రేవంత్‌రెడ్డి స‌ర్కార్ త‌లొగ్గింది. వికారాబాద్ జిల్లా ల‌గ‌చ‌ర్ల భూసేక‌ర‌ణ నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకోవ‌డం విశేషం. ఫార్మా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు కోసం ఆగ‌స్టు 1న రేవంత్‌రెడ్డి స‌ర్కార్ భూసేక‌ర‌ణ నోటిఫికేష‌న్ ఇచ్చిన…

ప్ర‌జా పోరాటానికి రేవంత్‌రెడ్డి స‌ర్కార్ త‌లొగ్గింది. వికారాబాద్ జిల్లా ల‌గ‌చ‌ర్ల భూసేక‌ర‌ణ నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకోవ‌డం విశేషం. ఫార్మా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు కోసం ఆగ‌స్టు 1న రేవంత్‌రెడ్డి స‌ర్కార్ భూసేక‌ర‌ణ నోటిఫికేష‌న్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా దుద్యాల మండ‌లం ల‌గ‌చ‌ర్ల గ్రామంలో నిర్వ‌హించిన ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ గ్రామ స‌భ ర‌సాభాస అయ్యింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ప్ర‌తీక్‌జైన్‌తో పాటు ప‌లువురు అధికారుల‌పై గ్రామ‌స్తులు దాడి చేయ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. ఈ కేసులో ప‌లువురు గ్రామ‌స్తుల్ని జైలుకు పంపారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయ‌కుడు ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డిని అరెస్ట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రికొంద‌రు ప‌రారీలో ఉన్నారు. దాడి వెనుక బీఆర్ఎస్ వుంద‌ని కాంగ్రెస్ నాయ‌కులు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

కేవ‌లం త‌న అల్లుడు, అన్న‌ద‌మ్ముల కోసమే రేవంత్‌రెడ్డి బ‌లవంతంగా భూసేక‌ర‌ణ చేస్తున్నారంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. సీఎం రేవంత్ స్వ‌ప్ర‌యోజ‌నాల కోస‌మే ఆదివాసుల భూముల్ని లాక్కుంటున్నార‌నే విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది. ఈ ఘ‌ట‌న‌ను అడ్డం పెట్టుకుని ప్ర‌త్య‌ర్థులు రాజ‌కీయంగా ల‌బ్ధి పొంద‌కూడ‌ద‌నే వ్యూహంలో భాగంగా తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

6 Replies to “ప్ర‌జాపోరాటానికి త‌లొగ్గిన రేవంత్ స‌ర్కార్‌”

  1. మా అన్న పట్టిన కుందెలుకి మూడె కాళ్ళు! ఎ ప్రజపొరాటానికొ, ప్రజాభిప్రాయానికొ తల ఒగ్గడు! అందుకె చివరికి 11 ఇచ్చారు!!

Comments are closed.