మీ డప్పు మీరు కొట్టండి.. రాగాలను సవరిస్తా

చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గ సహచరులకు ఒక సరికొత్త టాస్క్ ఇచ్చారు. ఎవరి డప్పు వారే కొట్టుకోవాలి.. ఎవరి భజన వారే చేసుకోవాలి.

చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గ సహచరులకు ఒక సరికొత్త టాస్క్ ఇచ్చారు. ఎవరి డప్పు వారే కొట్టుకోవాలి.. ఎవరి భజన వారే చేసుకోవాలి. ఈనెల 12వ తేదీ నాటికి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో.. ఈ కాలంలో మీమీ మంత్రిత్వ శాఖల పరిధిలో సాధించిన పురోగతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఎవరికి వారు తమ తమ సొంత ప్రోగ్రెస్ రిపోర్టులను రాసుకున్న తరువాత.. చంద్రబాబునాయుడు అందరి రిపోర్టుల్ని పరిశీలించి.. అవసరమైన సూచనలు చేస్తారట. అంటే ఏమిటన్న మాట.. ఎవరి డప్పు వారు కొట్టుకుంటూ ఉండాలి.. ఎవరి డప్పుల మోత అయినా కర్ణకఠోరంగా మోగుతున్నట్లయితే.. ఆ రాగాలను సవరించి శ్రావ్యతను జోడించడానికి చంద్రబాబునాయుడు హెల్ప్ చేస్తారన్నమాట.

చంద్రబాబునాయుడు తన కేబినెట్లోని మంత్రుల్లో ఒక గుబులు నింపారు. ఆరునెలల మీ పనితీరు గురించి మీరే నివేదికలు రాసుకుని ఇవ్వండి- అని అడుగుతున్నారంటేనే.. ఆయన అప్పుడే తమను జడ్జ్ చేయడం ప్రారంభిస్తున్నారనే గుబులు వారిలో కలుగుతోంది. తేడా వస్తే, ఆయన చెప్పినట్లుగా తమ పనితీరును మెరుగుపరచుకోవడానికి సలహాలిస్తారో.. లేదా తమను హిట్ లిస్టులోకి చేరుస్తారో అని పలువురు కంగారుపడుతున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎవరి డప్పు వారిని కొట్టుకోమని చెప్పినంత మాత్రాన.. రాసుకున్న రిపోర్టులను పూర్తిగా నమ్మేసే రకం కాదని.. మంత్రుల ఆరునెలల పనితీరు మీద ఆయన ఆల్రెడీ తన సొంత నిఘావర్గాలు, ఇంటెలిజెన్స్ వర్గాలతో నివేదికలు తెప్పించుకుని ఉంటారని.. తాము కొట్టుకునే సొంత డప్పులు ఆ నివేదికలతో మ్యాచ్ అయితే పర్లేదు గానీ.. మ్యాచ్ కాకపోతే.. మెత్తమెత్తగా తలంటు ఉంటుందని కొందరు మంత్రులే అనుకుంటున్నారు.

ఇంకొందరు మంత్రుల్లో ఇంకో సందేహం ఉంది. నిర్దిష్టంగా ఇప్పటిదాకా వారు తమ శాఖల్లో చెప్పుకోదగ్గంతటి ఘనకార్యాలు చేయడానికి అవకాశమే లేదు. మరి తాము ఏం రాసుకోవాలి? అందరూ ఏదో కొంత ఘనతలను రాసుకుని, తాము పేలవంగా రాసుకుంటే.. అది తమ రాజకీయ జీవితం మీద ప్రభావం చూపిస్తుందా? అని భయపడుతున్నారు.

ఫరెగ్జాంపుల్.. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. భార్య కారణంగా చిన్న వివాదం రేగి, చంద్రబాబు మందలింపులు కూడా భరించారు. అయితే ఈ ఆరునెలల పదవీకాలంలో ఆయన వేర్వేరు వేదికలు, వేర్వేరు సందర్భాలు కలిపి.. కనీసం ఓ యాభై సార్లయినా.. ‘‘అతి త్వరలోనే మహిళలకు ఉచిత బస్సుప్రయాణం కల్పిస్తున్నాం’’ అని చెప్పి ఉంటారు. కానీ ఇప్పటిదాకా ఆ హామీ కార్యరూపంలోకి రాలేదు. కనీసం ఎప్పటికి వస్తుందో కూడా తెలియదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండో రోజే ఉచిత బస్సు ప్రయాణం పెట్టేసినా.. ఏపీలో ప్రభుత్వానికి వీలు చిక్కడం లేదు. మరి ఇలాంటి మంత్రులు తమ డప్పు తాము ఎలా కొట్టుకోగలరు? అనేది అందరి సందేహం.

19 Replies to “మీ డప్పు మీరు కొట్టండి.. రాగాలను సవరిస్తా”

  1. మొదట self appraisal ఇచ్చుకొవాలి. ఇది అన్ని కార్పొరెట్ కంపనెలలొ జరిగెదె!

    దీని డప్పు అనరు! ఎవరి ఎవరు ఎమిసారొ, చెసాము అనుకుంతున్నరొ ఆ ఆ విషయాలు తెలియచెస్తారు!

    .

    ఇక డప్పు అంటె…

    నాకు శాలువా కప్పాలి!

    నాకు దండ వెయాలి!!

    నాకు ఆవార్డ్ ఇవ్వాలి !!!

    1. తూచ్… మీ కామెంట్ చదవకముందే నేను తెలుగులో కామెంట్ పెట్టాను. Ofcourse ముందు మీరే కామెంట్ పెట్టారు అనుకోండి

  2. Costly politics with huge publicity in own media all ministers are happy with public money 🤣🤣🤣🤣🤣🤣😁😁😁😁😁😁😁🚲🚲🚲🚲🚲🚲

    1. What were you doing when 500 crores of advertisments given to Sakshi. What were you doing when 10000 crores were spent on purchasing Sakshi through Volunteers

  3. అయ్యా ga గారూ… దీనిని సెల్ఫ్ అప్రైసల్ అనుకోండి. తరువాత cbn గారు ఇచ్చేది manahers feedback అనుకోండి. ఎక్కడైనా జరిగేది ఇదే

    1. అసలువాడు ఆఫిస్ కి వెళ్ళకుండానే ఇంట్లోనే ఆఫీసు, అసెంబ్లీ రూమ్ సెట్టింగ్ వేసుకున్నాడు ఆన్న విషయం నీ నీకు తెలిసి కూడా దాచి పెట్టావ్ ఆన్న సంగతి ప్రజలకి తెలిసి పోయింది.

  4. నువ్వేమో పోర్టు మింగేసినా రాయకపోతివి..

    .

    నువ్వు న్యూట్రల్ మీడియా కదా, మర్చిపోయాము..

  5. తల్లీ చెల్లి మళ్లీ వాటాలకోసం ఏడ్చి రోడ్ మెడకొచ్చి పెంట పెంట చేస్తే కానీ రాయడు అక్కుపక్షి..

Comments are closed.