బన్నీ పుష్ప 2 కి ముందు.. తరువాత

పుష్ప 2 సినిమా గురించి సినిమానే మాట్లాడాలి. సినిమానే ప్రమోట్ చేసుకోవాలి. అది సినిమా కంటెంట్ చూసుకుంటుంది.

పుష్ప 2 సినిమా విడుదల మరి కొన్ని గంటల్లోకి వచ్చేసింది. సినిమా ఎలా వుంటుంది.. సూపర్ హిట్ నా.. బ్లాక్ బస్టర్ నా అన్నది ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన పాయింట్ కాదు. ఈ లాస్ట్ మినిట్ లో ఇక ఆ డిస్కషన్లు అనవసరం. కానీ ఈ సినిమా తరువాత బన్నీ ఏంటీ? అన్నది పాయింట్. ఎందుకుంటే బన్నీ లోకల్ కాదు. నేషనల్ అనే జర్నీ ఈ సినిమా మీదే ఆధారపడి వుంది.

పుష్ప వన్ తో పాన్ ఇండియా హీరో అనిపించుకున్నారు. నిజానికి ఆ పాన్ ఇండియా ఇమేజ్ ను ముందుకు తీసుకెళ్లాల్సింది మరో మంచి పాన్ ఇండియా సినిమా. కానీ బన్నీ తన మేనేజ్ మెంట్ స్కిల్స్ తో, తన తెలివి తేటలతో పుష్ప2 విడుదల వేళకే తన ఇమేజ్ ను అమాంతం పెంచుకున్నారు. పుష్ప 2 ప్రమోషన్ కన్నా తన సెల్ఫ్ ప్రమోషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు.

బన్నీ ఏం చదివారు అన్నది పక్కన పెడితే మంచి మేనేజ్ మెంట్ స్కిల్స్ వున్నాయి. బన్నీ నుంచి మిగిలిన హీరోలు నేర్చుకోవాల్సినవి వున్నాయి. ఓ సినిమాకు పబ్లిసిటీ ఎలా ప్లాన్ చేయాలి. వేదిక ఎలా వుండాలి. ఆ ఫంక్షన్ కు ఎవరు రావాలి? ఎవరు రాకూడదు. ఎవరు మాట్లాడాలి. ఎవరు మాట్లాడకూడదు ఇలా అన్నీ బన్నీ కనుసన్నలలోనే డిసైడ్ అవుతాయి. ఏ షో ను ఎలా వాడుకోవాలి. సెల్ఫ్ ప్రమోషన్ ఎలా చేసుకోవాలి అన్నది బన్నీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు.

బాలకృష్ణ లాంటి సీనియర్ మోస్ట్ హీరో, ఒక లెగసీ వున్న హీరో చేసే అన్ స్టాపబుల్ షో ను తనకు కావాల్సినట్లు బన్నీ ఎలా మార్చుకున్నారో ఆ ఎపిసోడ్ చూస్తే అర్థం అవుతుంది. పుష్ప 2 ప్రమోషన్ ఈవెంట్లు అన్నీ చూస్తే, సినిమా ప్రమోషన్ ఎంత జరిగిందో బన్నీ ప్రమోషన్ ఎంత జరిగిందో అర్థం అవుతుంది. ఆ ఎపిసోడ్ మొత్తం బన్నీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్ల తెలిసిపోతుంది.

చెన్నయ్, కోచ్చి, ఇలా ఎక్కడ జరిగినా బన్నీ స్పీచ్ మొత్తం తన చుట్టే తిరిగింది. సినిమా కోసం కాదు. ఆఖరికి చివరి ప్రమోషన్ ఈవెంట్ లో కూడా తెలివిగా సినిమా టెక్నీషియన్స్ గురించి చెబుతూనే తన గురించి చెప్పుకుంటూ వచ్చారు.

వెయ్యి కోట్ల మార్కెట్ అంటూ సుమ చేత ఊదర కొట్టించారు.

జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో అని తెగ వాయించారు.

ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా గురించి సినిమానే మాట్లాడాలి. సినిమానే ప్రమోట్ చేసుకోవాలి. అది సినిమా కంటెంట్ చూసుకుంటుంది.

ఇక తరువాత సంగతి ఏమిటి?

బన్నీ ఎలాంటి సినిమా చేయాలి అన్నది ఇప్పటికే డిసైడ్ అయింది. త్రివిక్రమ్ తో సినిమా. హిస్టారికల్ ఫాంటసీ సినిమా అని వినిపిస్తోంది.

కానీ అది కాదు విషయం. పుష్ప సినిమాకు టోటల్ టర్నోవర్ లో 23.5 శాతం తన రెమ్యూనిరేషన్ కింద బన్నీ తీసుకున్నారు అని టాక్ వుంది. అంటే 235 కోట్లు.

పుష్ప 2 కనుక బ్లాక్ బస్టర్ అయితే బన్నీ ఈ పర్సంటేజ్ ను 30 శాతానికో, అంతకన్నా ఎక్కువకో పెంచేసినా ఆశ్చర్యం లేదు. అప్పుడు సినిమా బడ్జెట్ పెరుగుతుంది. మార్కెటింగ్ పెరుగుతుంది. ఆ పైన ప్రీమియర్లు అంటూ ఇంకా రేట్లు పెరగడం వుంటుంది.

పైగా పుష్ప 2 నిర్మాణం, షూటింగ్ తదితర విషయాల్లోనే బన్నీ చాలా కరాఖండీగా వ్యవహరించారని టాక్ వుంది. ఈ లెక్కన ఆ గ్రిప్ ఇంకా ఇంకా పెరుగుతుంది.

ఇకపై బన్నీ పుష్ప 2 కి ముందు.. తరువాత అన్నట్లు వుంటారేమో?

28 Replies to “బన్నీ పుష్ప 2 కి ముందు.. తరువాత”

  1. పుష్ప 2 కి తరువాత .. ఏమవుతుంది .. జనాల డబ్బు .. నిర్మాతలు ..డిస్ట్రిబ్యూటర్స్ చెబులోకి పోతుంది .. అంతేకదా ..సినిమా ఎంటర్టైన్మెంట్ స్థాయి దాటేసి .. దోచేసే స్థాయి కి వెళ్ళింది ..

  2. ఇదేం ఏడుపు GA….allu babu ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి బైటికి వచ్చేశాడు GA…. మన పార్టీ కి బాగా use అవుతాడు next elections లో….వీలైతే హైజాక్ కూడా చేసేస్తాడు ఈ management skills తో…😂😂… so ఇలా ఏడవకుండా, వాడుకోండి GA…..

  3. పైడ్ PR , ఏ ఫంక్షన్ కి వెళ్లినా బాబా మాదిరి స్లో మోషన్ లో నడక, చాలా ఆర్టిఫిషల్ నవ్వు, సోషల్ మీడియా మొత్తం బాట్స్ తో ఇతర హీరోలను చులకన చేస్తూ వ్యక్తిగతంగా దూషిస్తూ పోస్ట్లు పెట్టడం, వాస్తవం చెప్పాలి అంటే బన్నీ గారి మీద అభిమానం ఎప్పుడో పోయింది

  4. Is there a fact checking mechanism for Inflated box office advance booking numbers. There should be transparency to public about the accurate BO numbers. When someone says they have 100cr in advance bookings, can someone file a public petition to ask reveal accurate numbers to public ?

Comments are closed.