వైసీపీ ఆందోళ‌న‌ల్లో స్వ‌ల్ప మార్పు

ఇటీవ‌ల వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై దిశానిర్దేశం చేశారు. మూడు ద‌శ‌ల్లో వివిధ స‌మ‌స్య‌ల‌పై నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 11న రైతాంగ స‌మ‌స్య‌ల‌పై…

ఇటీవ‌ల వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై దిశానిర్దేశం చేశారు. మూడు ద‌శ‌ల్లో వివిధ స‌మ‌స్య‌ల‌పై నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 11న రైతాంగ స‌మ‌స్య‌ల‌పై రాష్ట్ర వ్యాప్తంగా క‌లెక్ట‌ర్ల‌కు విన‌తిప‌త్రాలు ఇవ్వాల‌ని జ‌గ‌న్ ఆదేశించారు.

ఇందుకు సంబంధించి స్వ‌ల్ప మార్పు చేసిన‌ట్టు వైసీపీ అధిష్టానం పేర్కొంది. ఈ నెల 11కు బ‌దులు 13న రాష్ట్ర వ్యాప్తంగా క‌లెక్ట‌ర్ల‌కు విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించాల‌ని జ‌గ‌న్ సూచ‌న‌ల‌ మేర‌కు నిర్ణ‌యించిన‌ట్టు పార్టీ పెద్ద‌లు తెలిపారు. ఐదు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో వున్నందున ఈ మార్పు చేసిన‌ట్టు పార్టీ పేర్కొంది.

రానున్న రోజుల్లో నెమ్మ‌దిగా ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ఆందోళ‌న‌ల‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని జ‌గ‌న్ అనుకుంటున్నారు. అయితే అధికారంలోకి వ‌చ్చి ఆరేడు నెల‌లు మాత్ర‌మే కావ‌డంతో, ప్ర‌భుత్వం కుదురుకోడానికి కొంత స‌మ‌యం ఇవ్వాల‌ని ప్ర‌తిప‌క్ష వైసీపీ భావించింది.

అయితే చాలా త్వ‌ర‌గా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త తెచ్చుకున్న‌ట్టు వైసీపీ అంచ‌నా వేస్తోంది. అయితే ఒక్క‌సారిగా ధ‌ర్నాలు చేయ‌కుండా, అధికారుల‌కు విన‌తిప‌త్రాల‌తో మొద‌లు పెట్టాల‌ని నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం.

18 Replies to “వైసీపీ ఆందోళ‌న‌ల్లో స్వ‌ల్ప మార్పు”

  1. లెవెనోడు 11 వ తేదీ కాకుండా 13 అన్నాడా, దానికీ ఒక ఆర్టికల్ బొక్కా..

    .

    ఏదో నాలుగు సొల్లు కబుర్లు చెప్పిందానికి దిశానిర్దేశం చేశాడంట..

  2. దెనికయ్యా మీ అందొళనలు…

    మీ అన్న అదాని తొ చెసుకున్న ఒప్పందలా గురించా…లెక

    కాకినాడ పొర్ట్ కొట్టెసినందుకా?

  3. జగన్ రెడ్డి కి 13 వ తేదీన కోర్ట్ కి అటెండ్ అవమని ఆదేశాలు వచ్చి ఉండొచ్చు..

    అది ఎగ్గొట్టడానికి.. ఈ కార్యక్రమం మార్చుకున్నాడు ..

    ..

    మన జగన్ రెడ్డి రాజకీయాలే అంత..

    వాడికి అధికారం కేవలం కేసుల నుండి కాపాడుకోడానికి.. ఇంకో పది రెట్లు సంపాదించుకోడానికి.. ప్రజల డబ్బు తో ఇంకో పది పాలస్ లు కట్టుకుని కులకడానికి..

    ..

    అందుకే కుర్చీ దిగగానే.. గోతులు తవ్వడం మొదలెట్టాడు..

    ఇప్పుడు అర్జెంటు గా కుర్చీ ఎక్కెయ్యాలని గెంతుతున్నాడు..

Comments are closed.