సంక్రాంతి సినిమాల నిర్మాతల కోసం..!

తమ సినిమాలతో రికార్డులు కొల్లగొట్టడం కంటే, ‘థియేటర్ ఎకో సిస్టమ్’ ను కాపాడుకోవడం ఇప్పుడు అత్యవసరం.

ఇండస్ట్రీలో చాలామంది ఇప్పుడు పుష్ప-2 ను కేస్ స్టడీగా చూస్తున్నారు. ఈ సినిమాకు వస్తున్న వసూళ్లు, విమర్శల్ని బేరీజు వేసుకుంటున్నారు. టికెట్ రేటు వెయ్యి రూపాయలు చేసినా ఏం పర్వాలేదు అనే భరోసాను పుష్ప-2 కల్పించింది.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ అలా చేయడం వల్ల తలెత్తుతున్న ప్రతికూలతలపై చాలామంది ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దలతో ‘చర్చలు’ జరిపి వెయ్యి రూపాయల టికెట్ రేటు సాధించుకోవచ్చు. అట్నుంచి సమస్య లేదని తేలిపోయింది. ఎటొచ్చి మార్కెట్లో పరిస్థితులను అర్థం చేసుకోవడం ఇప్పుడు కీలకంగా మారింది.

పుష్ప-2 సినిమాకు అమాంతం రేట్లు పెంచేశారు. దీని వల్ల భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ డబ్బులు పెట్టలేని సాధారణ ప్రేక్షకులు, ఫ్యామిలీస్ సినిమాకు దూరమయ్యారు. అదే టైమ్ లో పైరసీ విజృంభించింది. ఇప్పటివరకు ఏ పెద్ద సినిమాకు జరగని స్థాయిలో పైరసీ జరిగింది.

ప్రీమియర్స్ ముగిసి, విడుదల రోజు మార్నింగ్ షోలు పడే టైమ్ కే ఇంటర్నెట్ మొత్తం పుష్ప-2 పైరసీతో నిండిపోయింది. మంచి క్వాలిటీ ప్రింట్స్ బయటకొచ్చేశాయి. టికెట్ రేట్లు భారీగా పెంచడం వల్లనే పైరసీ ఈ స్థాయిలో జరిగిందనే వాదనలు కూడా ఉన్నాయి.

ఈ సంగతి అటుంచితే, భారీ టికెట్ రేట్ల వల్ల, రిలీజైన 2-3 రోజులకే థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోతోంది. ఇది ఎగ్జిబిటర్లకు ఇబ్బందికరం. 2 రోజులు హౌజ్ ఫుల్స్ తో నడిచే కంటే, యావరేజ్ ఆక్యుపెన్సీతో 2 వారాలు నడిస్తేనే వాళ్లకు బెనిఫిట్. థియేట్రికల్ సిస్టమ్ కు కూడా ఇది చాలా మంచిది. భారీ రేట్లు ఈ వ్యవస్థను దెబ్బతీస్తాయి.

అటుఇటుగా ఓ నెల రోజుల్లో సంక్రాంతి సినిమాల సందడి మొదలుకాబోతోంది. ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి పెద్ద సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ సినిమాల నిర్మాతలంతా ఈ అంశాలపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మంచిది.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనతో నైజాంలో బెనిఫిట్ షోలు దాదాపు రద్దయినట్టే. అవి రద్దయినా, భారీ టికెట్ రేట్లు తెచ్చుకోవడం పెద్ద సమస్య కాదు. ఇలాంటి తలంపుతో ఉన్న ప్రొడ్యూసర్లంతా ఇప్పుడు మరోసారి ఆలోచించడం బెటర్. ఎందుకంటే, తమ సినిమాలతో రికార్డులు కొల్లగొట్టడం కంటే, ‘థియేటర్ ఎకో సిస్టమ్’ ను కాపాడుకోవడం ఇప్పుడు అత్యవసరం.

22 Replies to “సంక్రాంతి సినిమాల నిర్మాతల కోసం..!”

  1. రోజుకో బంగారు గుడ్డు పెట్టే బాతు ను అత్యాశతో పొట్ట కోసి చూసారు.

    ఒక్క గుడ్డు వచ్చింది.

    కానీ బాతు చచ్చింది.

  2. వేయి పెట్టినా, పది వేలు పెట్టినా దేశంలో ఎక్కువగా ఉన్న సోంబేరి జనం ఎలాగూ తొలి రోజే సినిమాస్ కి తగలడుతున్నారు. మరి అలాంటిది వారికి అవసరమైన బస్సు, రైలు టికెట్ లను కూడా రెట్టింపు చేసినా దానికైనా కట్టే స్థోమత ఉంది. అలాగే రైతుల వద్ద కొనుగోలు చేసి ఇప్పటికే అధిక ధరలకు ధాన్యాలు, కూరగాయలు అమ్మే వర్తకులు కూడా ఆ నిత్యావసరాలను 50% ఎందుకు పెంచకూడదు అనుకుంటారు.

    ఈ casex study ఏదో అన్ని రంగాల్లో వారు పరిశీలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయా రంగాల్లో వస్తువులు, సేవలు తక్కువ ధరకే రావడం మూలంగానే కదా ఒంxటికి కొxవ్వు పట్టిన జనాలు theatersx కి ఎగబడుతున్నారు.

  3. పాపం తన నటనా పటిమకు 300 కోట్లు కూడా తక్కువే అని భావించే కథానాయకుడి కుంటుంబానికి పాలు, కూరగాయలు అమ్మేవారు కూడా తమ ధరలను ప్రత్యేకించి ఓ 100 రెట్లు పెంచి అమ్మితే బాగుంటుంది.

    తనకు ఒక్క సినిమాస్ కె 300 కోట్లు ఒళ్ళో పడినా కనీసం 10 కోట్లు పెట్టి తమ్ముడిని herox గా పెట్టి cinemax తీయలేని దౌర్భాగ్యం.

  4. First this kind of rule becz of rajamouli he started this trend to ask for more price .early it wa not there.and one more this why govt already doubles tickets prices after the corona as only movie theatres loss .no common people lost in corona only movie people lost .agan why giving permissiont to increase .why govt not asking about water bottle rates in theatre.why can’t we take outside bottles.why not asking about eating items prices.

Comments are closed.