కనీ వినీ ఎరుగని ప్రీమియర్ రేట్లు. బయ్యర్లకు అమ్మకాల రేట్లు అదే రేంజ్ లో. మొత్తం మీద భారీ అంచనాలతో విడుదలైంది. తొలి రోజు ఆశించిన మేరకు కాకున్నా, అద్భుతమైన నెంబర్లు కనబర్చింది. తెలుగు సినిమా కనుక హిందీ నాట సృష్టిస్తున్న కలెక్షన్ల ప్రభంజనాన్ని పక్కన పెట్టి, ఇక్కడ సంగతి చూస్తే మొదటి రోజు ప్రీమియర్లతో కలిసి మంచి నెంబర్లే నమోదు చేసింది. కానీ మర్నాటి నుంచి ఏపీ, సీడెడ్ ల్లో కాస్త నిరాశ కలిగించింది. నైజాంలో హైదరాబాద్ మినహా మిగిలిన ఏరియాల్లో అదే పరిస్థితి వుంది. శని, ఆది వారాలు అన్ని చోట్లా అద్భుతాలు చూపించలేదు కానీ కాస్త పుంజుకుంది. ఆదివారం నాడు మార్నింగ్ షో లు కూడా బాగుండడం విశేషం.
ఇప్పుడు అసలు సిసలు టెస్ట్ మొదలవబోతోంది. రేట్లు తగ్గించడం. థియేటర్లు తగ్గించడం, వీక్ డేస్ కావడం వల్ల మండే నుంచి ఎలా పెర్ ఫార్మ్ చేయబోతోంది అన్నది పాయింట్. ఇప్పటి వరకు కొన్న రేట్లలో కొన్ని చోట్ల 40 శాతం, కొన్ని చోట్ల అంతకన్నా తక్కువ రికవరీ వచ్చింది బయ్యర్లకు. జిఎస్టీలు నిర్మాత నుంచి వస్తాయి కనుక, కనీసం మరో యాభై శాతం రికవరీ రావాల్సి వుంది.
మండే నాడు కూడా కనీసం యాభై శాతం ఆక్యుపెన్సీ ఓవరాల్ గా వస్తే ఫరవాలేదు. బహుశా ఈవారం కూడా రెంట్ల మీదే సినిమా ఆడతారు. వచ్చే వారం నుంచి థియేటర్ రెవెన్యూ షేరింగ్ కు మారే అవకాశం వుంది. అందువల్ల మరీ పెద్ద నెంబర్లు కనిపిస్తాయా? అన్నది చూడాలి. మండే నుంచి ప్రారంభమయ్యే వీక్ డేస్ కనుక నాట్ బాడ్ అనే పద్దతిలో పెర్ ఫార్మ్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లు గట్టెక్కుతారు. లేదా అంటే పుష్ప వన్ కు ఇచ్చినట్లుగానే కాస్త వెనక్కు ఇవ్వాల్సి వుంటుంది.
నార్త్ స్టేట్స్ లో బాగా పెర్ ఫార్మ్ చేస్తోంది కనుక నిర్మాతలు ఫుల్ హ్యపీగా వున్నారు.
nuvvu entha ethina pushpa flop movie
బోయపాటి సినిమాల్లో ఏసిడ్ కి ఛాన్స్ లేదు.. ఓన్లీ బ్ల డ్
Neeku Chala bada Ga undi Ga
9019471199 vc estanu
Pushpa 2 movie blockbuster hit bookmyshow lo 1st day 3 lakh tickets sale ayyai advance booking tickets in india
Ede movie sukumar garu first anukunna vidanda tisunte it would been good but Etulaki poyi aatulu kalchukunnadu Arjun. he changed the script and everything.