లేని డ్రగ్స్ పై పరస్పరం బురద చల్లుకున్నారు!

విశాఖపట్నం పోర్టుకు ఓ షిప్ వచ్చింది. అందులోని ఓ కంటెయినర్ నిండా డ్రగ్స్ ఉన్నాయంటూ నానా రాద్ధాంతం జరిగింది.

విశాఖపట్నం పోర్టుకు ఓ షిప్ వచ్చింది. అందులోని ఓ కంటెయినర్ నిండా డ్రగ్స్ ఉన్నాయంటూ నానా రాద్ధాంతం జరిగింది. ఆ షిప్ బ్రెజిల్ నుంచి వచ్చిందని, బ్రెజిల్ అధ్యక్షుడితో విజయసాయిరెడ్డికి సంబంధాలున్నాయి గనుక ఆయనే స్వయంగా ఈ పాతిక వేల టన్నుల డ్రగ్స్ ను ఎన్నికల్లో ఓటర్లకు పంచిపెట్టడం కోసం తెప్పించారని తెలుగుదేశం పార్టీ నాయకులు నానా కూతలు కూశారు.

తీరా ఆ మాటలన్నీ కల్లమాటలే అని ఇప్పుడు తేలిపోయింది. ఆ కంటెయినర్ లో డ్రగ్స్ ఆనవాళ్లు కూడా లేవని, ఉన్నదంతా కేవలం రొయ్యల సాగులో ఉపయోగించే డ్రై ఈస్ట్ మాత్రమేనని సీబీఐ నిర్ధరించేసింది. మరి సరిగ్గా ఎన్నికల సీజనుకు ముందుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ దిగజారేలాగా.. తెలుగుదేశం అండ్ కో విపరీతంగా, విచ్చలవిడిగా చేసిన తప్పుడు ప్రచారం మాటలేమిటి?

నిజం చెప్పాలంటే.. కంటెయినర్ లో వచ్చినవి డ్రగ్స్ కాదు అనే సంగతి.. అప్పట్లోనే కొన్ని వారాల వ్యవధిలో అందరికీ అర్థమైపోయింది. అధికారికంగా ఎవ్వరూ వెల్లడించలేదు గానీ.. వచ్చినవి డ్రాగ్స్ కాదు అని తేలింది. కానీ.. తెలుగుదేశం పార్టీ చాలా కన్వీనియెంట్ గా ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో చక్కగా వాడుకుంది. ఒకవేళ అప్పటికి వాళ్ల ఆరోపణలు నిజమే అనుకున్నప్పటికీ.. వచ్చిన టోటల్ కంటెయినర్ సరుకు 25 వేల టన్నులు. అందులోని ఇతర పదార్థంతో డ్రగ్స్ కలిపి పంపారు.. ఆ డ్రగ్స్ ను ఇక్కడ వేరు చేసుకోవాలని అనుకుంటే.. అది చాలా పరిమితంగానే ఉండే అవకాశం ఉంది.

కానీ ఇలాంటి లాజిక్కుల జోలికి కూడా వెళ్లకుండా.. తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా వైసీపీ నేతల మీద బురద చల్లడం ప్రారంభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజానికి వాస్తవాలు తెలుసుకోకుండా కంగారు పడింది. వాళ్లు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే.. అందులో ఉన్నవి డ్రగ్స్ కాదనే సంగతి వారికి అర్థమై ఉండేది. ప్రభుత్వంలో ఉన్నది వారే గనుక.. కొంచెం ఒత్తిడి చేసి అప్పట్లోనే అధికారిక ప్రకటన చేయించి ఉంటే సేఫ్ జోన్ లో ఉండేవాళ్లు. అవన్నీ పట్టించుకోకుండా.. తిరిగి తెలుగుదేశం మీద బురద చల్లడం ప్రారంభించారు.

బిజెపి రాష్ట్ర సారథి పురందేశ్వరికి ముడిపెట్టి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నాలు బెడిసి కొట్టాయి గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబు సిద్ధహస్తుడు కాబట్టి.. ఆయనదే పైచేయి అయింది.

కంటెయినర్ లో లేని డ్రగ్స్ గురించి.. తెలుగుదేశం, వైసీపీ పరస్పరం బురద చల్లుకున్నాయి. చివరికి వైసీపీని బద్నాం చేయడంలో టీడీపీ సక్సెస్ అయింది. రాజకీయంగా వికృతక్రీడలు ఎలా ఉంటాయో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది.

23 Replies to “లేని డ్రగ్స్ పై పరస్పరం బురద చల్లుకున్నారు!”

  1. పింక్ డైమండ్ అప్పుడే జనాలకి అర్ధం అయ్యింది లే….రాజకీయ వికృత క్రీడలు

  2. వాళ్ళ పేరు చివర చౌదరి అని తగిలించి వాళ్ళు పురందేశ్వరి గారి బంధువులని సాక్షిలో వచ్చిన ఆర్టికల్స్ చదివి మాట్లాడండి కంటైనర్లు లో డ్రగ్స్ ఉండి ఉంటే వాళ్ళ పేరు చివర వేరే టాగ్ ఉంటది

Comments are closed.