య‌న‌మ‌లపై టీడీపీ సోష‌ల్ మీడియా ట్రోలింగ్‌!

అభిమానంతో ఆద‌రిస్తే, ఇప్పుడు చంద్ర‌బాబునాయుడినే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి దిగ‌జారావా? అంటూ విరుచుకుప‌డుతున్నారు.

మాజీ స్పీక‌ర్‌, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడిని ఆ పార్టీ సోష‌ల్ మీడియా టార్గెట్ చేసింది. కాకినాడ పోర్టుకు సంబంధించి కేవీరావు చౌద‌రికి వ్య‌తిరేకంగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడికి య‌న‌మల లేఖ రాశారు. దీన్ని టీడీపీ, ఆ పార్టీ మీడియా జీర్ణించుకోలేక‌పోతోంది. ఇక టీడీపీ సోష‌ల్ మీడియా ఓ రేంజ్‌లో ఆయ‌న్ను ట్రోలింగ్ చేస్తోంది.

అభిమానంతో ఆద‌రిస్తే, ఇప్పుడు చంద్ర‌బాబునాయుడినే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి దిగ‌జారావా? అంటూ విరుచుకుప‌డుతున్నారు. య‌న‌మ‌ల బెదిరింపుల‌కు చంద్ర‌బాబు భ‌య‌ప‌డ‌రంటూ వారు పోస్టులు పెడుతున్నారు. అలాగే టీడీపీ అనుకూల యూట్యూబ‌ర్స్ రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. ప్ర‌ధానంగా సీఎంకు రాసిన లేఖ‌లో కేవీరావు, అలాగే దివీస్ అధినేత ముర‌ళీకి సంబంధించి చౌద‌రి అని ప్ర‌త్యేకంగా చేర్చ‌డాన్ని త‌ప్పు ప‌డుతున్నారు.

రాజ‌కీయంగా ఆద‌రించిన క‌మ్మ వాళ్ల‌నే టార్గెట్ చేయ‌డం ఏంటంటూ య‌న‌మ‌ల‌ను నిల‌దీస్తున్నారు. ద‌శాబ్దాలుగా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో గెల‌వ‌క‌పోయినా, ఎమ్మెల్సీ ప‌ద‌వితో పాటు కీల‌క ఆర్థిక మంత్రిత్వ‌శాఖ ఇవ్వ‌డ‌మే నేర‌మా? అంటూ ఆయ‌న్ను నిల‌దీస్తున్నారు. ఇదేనా టీడీపీ ప‌ట్ల విశ్వాసం అని ప్ర‌శ్నిస్తూ య‌న‌మ‌ల‌ను తీవ్ర‌స్థాయిలో టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఎక్క‌డో అమెరికాలో వుండే కేవీరావును తీసుకొచ్చి, వైసీపీ ముఖ్య నాయ‌కుల‌పై ఫిర్యాదులు చేయించి వాళ్ల‌ను జైలుకు పంప‌డానికి ప్ర‌భుత్వం తిప్ప‌లు ప‌డుతుంటే, అలాంటి వ్య‌క్తిని కేవ‌లం క‌మ్మ సామాజిక వ‌ర్గం కావ‌డంతో టార్గెట్ చేయ‌డం వెనుక య‌న‌మ‌ల ఉద్దేశం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. కాకినాడ పోర్టు, సెజ్‌లో కేవీరావు చౌద‌రి అన్యాయం చేసి వుంటే సీఎం చంద్ర‌బాబుకు నేరుగా చెప్పొచ్చు క‌దా? అలాగే లేఖ‌ను ప్ర‌త్య‌ర్థుల‌కు ఇవ్వ‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు.

బీసీల‌కు, మ‌త్స్య‌కారులకు అన్యాయం జ‌రిగింద‌ని మంత్రి ప‌ద‌వి రాన‌ప్పుడే గుర్తు వ‌చ్చిందా? అని కూడా య‌న‌మ‌ల‌ను నిల‌దీస్తున్నారు. కేవ‌లం మంత్రి ప‌ద‌వి రాలేద‌ని, అలాగే రాజ్య‌స‌భ‌కు పంప‌లేద‌నే అక్క‌సు త‌ప్ప‌, లేఖ రాయ‌డం వెనుక నిజాయ‌తీ లేద‌ని అంద‌రికీ తెలుసంటూ య‌న‌మ‌ల‌ను సొంత సోష‌ల్ మీడియా ట్రోల్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

6 Replies to “య‌న‌మ‌లపై టీడీపీ సోష‌ల్ మీడియా ట్రోలింగ్‌!”

  1. Ea greatandhra Redyy gari ki, veyla kotla valuw chesyey kakinda Porta lo around 48% share ni Rs. 12 crores ki kotteysindi kanapadaleyda?

    Kootami prabutwam Ycheap galla meada cases ki tippalu padutundi ani rastunnadu. avunuley Jagan reyddi appti Supreme court cheif justice garu aarthika ugrwadi ga abhivaninchindi eppudina ea munda media lo rasada? rayadu enduku Jagan sanak nakey media kada edi.

  2. పార్టీలో త్యాగం చెయ్యాలి అంటే ముందుగా సిద్దం అవ్వాల్సింది కమ్మవాళ్లే.. ప్రతిపక్షంలో పోరాడేది.. వేధింపులకు గురయ్యేది నిరంతరం విమర్శల పాలయ్యేది కమ్మవాళ్లే.. అది ఆనవాయితీ. కానీ, యనకమాల ఉండే కొందరు నాయకులు మాత్రం పోరాటంలో ముందుకు రారు.. పదవుల్లో అగ్రతాంబూలం అందుకుంటారు. మళ్లీ పార్టీలో ఉండి కమ్మవాళ్ల మీద ఏడుస్తారు.. ఈ కులంలో పుట్టడం మా ఖర్మ అని అనుకోవాలా?ఎలక్షన్లలో నేరుగా నుంచుంటే డిపాజిట్ కూడా తెచ్చుకోలేని వాడికి ఇంతకాలం పెద్ద పెద్ద పోసిషన్స్ ఇచ్చి బాబు గారు చాలా తప్పు చేశారు. ఇకనైనా వాడిని దూరం పెట్టాలి

  3. ఈయన కన్నా ఘనుడు చిక్కాల వైసీపీ అధికారం లో వున్నపుడు కన్నబాబు తో అంట కాగి టీడీపీ వాళ్ళను చాల ఇబ్బందులకు గురిచేసేడు

Comments are closed.