ఉత్తరాంధ్ర రాజకీయంలో ఉత్కంఠ

మూడు ఉమ్మడి జిల్లాలలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో చాలాచోట్ల సరైన అభ్యర్ధులు అయితే లేరు అన్న మాట ఉంది.

వైసీపీ అధికారం కోల్పోయాక ఏకంగా అధినాయకత్వమే నిస్సత్తువగా మారిపోయింది. ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. ఇక పార్టీలోని సీనియర్లు పెద్దల పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉంది. పార్టీకి పూర్వ వైభవం సంగతి పక్కన పెడితే తాము ఎక్కడ ఉన్నామన్నది కూడా తెలుసుకునే వాతావరణంలో కూడా చాలామంది లేకుండా పోయారు. అంతటి దారుణమైన ఓటమితో వైసీపీ కునారిల్లింది.

ఉత్తరాంధ్రలో చూస్తే వైసీపీ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఉమ్మడి మూడు జిల్లాలూ టీడీపీకి కంచుకోటలు. టీడీపీ పుట్టిన నాటి నుంచి ఆ పార్టీనే అట్టేబెట్టుకుని ఆదరిస్తున్న ప్రాంతాలుగా ముద్రపడ్డాయి. అటువంటి ఉత్తరాంధ్రలో టీడీపీ రాజకీయ జీవితంలో తొలిసారి పరాభవం 2019లో జరిగింది. అదే సమయంలో వైసీపీని అందలం ఎక్కించి జనాలు కూర్చోబెట్టారు. అయితే అంది వచ్చిన అవకాశాన్ని వైసీపీలో నాయకులు సీనియర్లు ఎంతవరకూ సద్వినియోగం చేసుకున్నారు అన్నది పక్కన పెడితే ఈ రోజు భారీ పరాజయం మాత్రం పార్టీని కృంగతీస్తోంది.

టీడీపీ మళ్లీ పుంజుకుంది. పటిష్టంగా మారింది. కూటమిలోని జనసేనకు కూడా ఉత్తరాంధ్రలో సామాజిక బలం ఉండడంతో టీడీపీకి అన్నింటా కలసివస్తోంది. ఈ క్రమంలో వైసీపీలో నిస్తేజం నిండా ఆవరించింది. నేతలు ఎక్కడికక్కడ చతికిలపడిపోయారు. రేపటి రోజు గురించి బెంగటిల్లుతూ పొద్దుపుచ్చుతున్నారు. వైసీపీలో ఉంటే తమకు తమ వారసులకు మంచి భవిష్యత్తు దక్కుతుందా అన్న సందేహాలలో చాలామంది ఉన్నారు. మళ్లీ ఫ్యాన్‌ జోరు చేస్తుందా లేదా అన్న అనుమానాలు అణువణువునా నాయకులలోనే ఉండడం గమనార్హం.

అనేక దశాబ్దాలుగా రాజకీయాలలో ఉంటూ గెలుపోటములు చవి చూసిన వారు సైతం 2024 ఎన్నికలలో ఓటమిలో మైండ్‌ సెట్‌ మార్చుకుంటున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. వైసీపీలో ఉంటే రాజకీయం ముందుకు సాగదు అన్న నిశ్చయానికి వచ్చిన వారు అంతా నిశ్శబ్దం అయ్యారు. అయితే వారు పార్టీలోనే ఉంటున్నారు కానీ చడీ చప్పుడూ అయితే లేదు. వైసీపీలోనే ఉంటూ ఎదురు చూపులు చూస్తున్నారు. వేరే పార్టీలలోకి వెళ్లిపోవడానికి ఉన్న పార్టీ నుంచే రాజకీయం చేసుకుంటున్నారు అన్నది కూడా ప్రచారంలో ఉన్న మాట. దాంతో పార్టీ అధినాయకత్వానికి కూడా ఈ తీరుతెన్నులు అసలు అర్ధం కావడంలేదు.

పార్టీలో ఉన్నట్లా లేనట్లా అన్నది సైతం బోధపడడంలేదు. పార్టీతో పట్టనట్లుగా ఉంటున్న వారు బయటకు వెళ్తే స్పష్టత వస్తుంది. కానీ అలా చేయడంలేదు, వైసీపీ నేతలుగా ఉంటూనే రాజకీయ రాయబేరాలు చేసుకుంటున్నారని అంటున్నారు. దాంతో వైసీపీలో ఏమి జరుగుతోంది అన్నది హైకమాండ్‌కు కూడా తోచని స్థితిగా ఉంది.

ఉత్తరాంధ్రలో చాలామంది సీనియర్‌ నేతలు, రాజకీయ ప్రముఖులు కూడా ఇపుడు పార్టీ పట్ల అంత ఆసక్తిని చూపించకపోవడం విచిత్రమైన పరిణామంగానే చూడాలని అంటున్నారు. వీరి విషయంలో ఏమి చేయాలన్నది కూడా అధినాయకత్వానికి తెలియని విషయంగా మారుతోంది. పార్టీలో ఉన్న సీనియర్లను పక్కన పెట్టలేక అలాగని కొనసాగించలేక హైకమాండ్‌ సతమతమవుతోంది. దాంతో ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రలోని పార్టీ నాయకులకు కబురు పంపుతోంది.

పార్టీలో ఉంటే పదవులు ఇస్తామని మళ్లీ చురుకుగా పనిచేయాలని కోరుతోంది. అలాంటి అవకాశం ఉన్నవారంతా అధినాయకత్వం ప్రతిపాదనలకు ప్రతిస్పందిస్తారని హైకమాండ్‌ ఆలోచనగా ఉంది. ఒకవేళ అలా పార్టీ సూచనలను పట్టించుకోకపోతే వేరే ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలని కూడా వైసీపీ హైకమాండ్‌ సీరియస్‌గానే యోచిస్తోందని అంటున్నారు.

ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విషయంలోనూ పార్టీ ఇదే ప్రతిపాదన పెట్టింది. పార్టీ ఇన్‌చార్జి పదవి ఇస్తామని తెలియచేసింది. దానిని తీసుకోవడానికి ఆసక్తి లేకపోతే సమర్ధులైన నాయకులను సూచించమని కూడా కోరిందని ప్రచారం సాగుతోంది. దానికి ధర్మాన ప్రసాదరావు నుంచి ఇంకా స్పందన రాలేదని అంటున్నారు. ఇదే తీరున జిల్లాలో చాలామంది నాయకులు ఉన్నారు.

మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ప్రాతినిధ్యం వహించిన ఆముదాలవలసలో కొత్త ఇన్‌చార్జిని వైసీపీ నియమించింది. చింతాడ రవికుమార్‌ను అక్కడ పార్టీ నియమించి బాధ్యతలు చూసుకోమని కోరింది. దాంతో తమ్మినేని పార్టీలో ఉంటారా లేక వేరే ఆలోచనలు చేస్తారా అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది.

పాలకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి రాజకీయాల పట్ల విముఖంగా ఉన్నారని అంటున్నారు. అక్కడ పార్టీ వేరే వారిని చూసుకోవాల్సి ఉంది. విజయనగరం జిల్లాలో చూసుకుంటే మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి కూడా అంత చురుకుగా లేరు అన్న వార్తలు వస్తున్నాయి. ఆయన తన రాజకీయ వారసురాలి భవితవ్యం గురించి ఆలోచిస్తున్నారని అంటున్నారు.

సాలూరు నుంచి వరసగా నాలుగు సార్లు గెలిచిన మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర కూడా నిరాసక్తతగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకుంటే ఎలమంచిలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు పెద్దగా సందడి చేయడంలేదు. ఆయన కాంగ్రెస్‌ టీడీపీ- వైసీపీ ఇలా పార్టీలు మారి వచ్చిన వారే. దాంతో వైసీపీ హైకమాండ్‌ ఇక్కడ కూడా వేచి చూసే ధోరణిలోనే ఉంది.

ఇలా మూడు ఉమ్మడి జిల్లాలలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో చాలాచోట్ల సరైన అభ్యర్ధులు అయితే లేరు అన్న మాట ఉంది. అలాగని సీనియర్లను కాదంటే పార్టీలో వర్గపోరు మొదలవుతుందని ఆలోచిస్తున్నారు. అందువల్ల సీనియర్లు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా పార్టీ కూడా తమదైన నిర్ణయాలు ప్రకటించాలని చూస్తోంది. దీంతో వైసీపీలో అంతటా వేచి చూసే ధోరణి కనిపిస్తోంది. ఆరు నెలల కాలం ముగిసింది. వైసీపీ ప్రజా సమస్యల మీద పోరాటాలకు పిలుపు ఇస్తున్న వేళ ఉత్తరాంధ్రలో పార్టీని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు సూచిస్తున్నారు.

10 Replies to “ఉత్తరాంధ్ర రాజకీయంలో ఉత్కంఠ”

  1. దేవుడి లాంటి మావోడ్ని చూసి ఓట్లు పడతాయి కానీ పూజారులు లాంటి నాయకులతో పనేముంది.. అంతా మావోడే.. ఎవ్వరూ అవసరం లేదు.. ఉంటే ఉండండి పోతే పోండి.. పోతే ఇంకా మంచిది..

    Just 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు మావోడి అతి మంచితనం and నిజాయితీ చూసి EVM’ లే ఓట్లు గుద్ది కుర్చీ లో కూకోబెట్టి అవార్డు ఇస్తాయ్.. అవునా కాదా “గ్రేట్ గ్యాసు”??

    WAIT & See..

  2. మావోడు 5 ఏళ్ళు అలా కళ్ళు మూసుకుంటే ఇలా అధికారం వస్తుందనుకుంటే

    నువ్వు

    ఏందయ్యా గ్యాసు.. లీడర్లు & క్యాడర్ లు పోతారాంటూ భయపెడుతున్నావ్??

  3. ఇంఛార్జి లు ఎవ్వరు?సీనియర్ల కదా అని 2029లో ప్రజలు చూడరు రా జాకో.

    ఇచ్చిన హామీలు బొల్లోడు నెరవేర్చడ లేదా?విపరీతంగా పెరిగిన కాయగూరలు రేట్లు,అవినీతి పాలన ..వీటికి ఓటు రూపంలో చూపిస్తారు జనాలు.

    ధర్మాన ప్రసాదరావు అంత సీనియర్ అయితే గొండు శంకర్ అనే సర్పంచ్ చేతిలో ఓడిపోవడం ఏంటి?

Comments are closed.