కొత్త భ‌యాన్ని సృష్టిస్తున్న‌ రెవెన్యూ స‌ద‌స్సులు

అస‌లే కూట‌మి నాయ‌కులు ఆవురావుర‌మ‌ని ఉన్నారు. ఆదాయ మార్గాల్ని వెతుక్కుంటున్నారు.

ప్ర‌భుత్వం దృష్టికి అత్య‌ధికంగా రెవెన్యూ స‌మ‌స్య‌లు వెళ్లాయి. ఇంకా వెళ్తాయి కూడా. ముఖ్యంగా భూస‌మ‌స్య‌ల సృష్టికి అధికారులే కార‌ణం. వాటి ప‌రిష్కారానికి భారీ మొత్తంలో ముట్ట‌చెబితే త‌ప్ప ప‌నులు కావ‌డం లేదు. తాజాగా కూట‌మి స‌ర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ స‌ద‌స్సుల నిర్వ‌హ‌ణ‌కు శ్రీ‌కారం చుట్టింది. ప్ర‌భుత్వ ఉద్దేశం మంచిదే.

అధికారుల్ని నేరుగా ప్ర‌జ‌ల ద‌గ్గ‌రికే పంపి, వాళ్ల స‌మ‌స్య‌ల్ని తెలుసుకుని ప‌రిష్క‌రించాల‌నేది పాల‌కుల ఉద్దేశం. అయితే దీన్ని స్వార్థ‌ప‌రులు, అవ‌కాశ‌వాదులైన కూట‌మి నాయ‌కులు అధికారుల‌తో కుమ్మ‌క్కై సొమ్ము చేసుకుంటారేమో అని బాధితులు భ‌య‌ప‌డుతున్నారు. త‌మ స‌మ‌స్య‌ల్ని అధికారుల దృష్టికి ప్ర‌జ‌లు తీసుకెళుతున్నారు.

అయితే అమాయ‌కులైన ప్ర‌జ‌ల ఆస్తి త‌గాదాల్ని ప‌రిష్క‌రించే నెపంతో బాధితుల వివ‌రాల్ని తెలుసుకుని అస‌లుకే ఎస‌రు పెడ‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. రెవెన్యూ స‌ద‌స్సుల్లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం సంగ‌తి ప‌క్క‌న పెడితే, అన్నీ తెలుసుకుని రాజ‌కీయ నాయ‌కులు త‌మ చుట్టూ తిప్పుకుంటార‌నే భ‌యం సామాన్యుల్లో మొద‌లైంది.

అస‌లే కూట‌మి నాయ‌కులు ఆవురావుర‌మ‌ని ఉన్నారు. ఆదాయ మార్గాల్ని వెతుక్కుంటున్నారు. రెవెన్యూ స‌ద‌స్సుల పేరుతో ముఖ్యంగా భూస‌మ‌స‌ల్యి అధికారుల ద్వారా నేరుగా ఇంటికే తెప్పించుకుని, మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా బాధితుల‌తో బేరం కుదుర్చుకోడానికి మార్గం సులువు అవుతోంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ప్ర‌భుత్వం స‌దాశ‌యంతో ఆలోచిస్తే, కిందిస్థాయిలో మ‌రోలా జ‌రుగుతోంద‌న్న‌ది వాస్త‌వం. ఇక్క‌డ‌, అక్క‌డ అని కాకుండా, ప్ర‌తిచోట కూట‌మి నాయ‌కులు రెవెన్యూ స‌ద‌స్సుల్లో వ‌చ్చే స‌మ‌స్య‌ల్ని త‌మ ఆదాయాల్ని పెంచుకోడానికి వాడుకుంటున్నార‌నేది ప‌చ్చి నిజం.

6 Replies to “కొత్త భ‌యాన్ని సృష్టిస్తున్న‌ రెవెన్యూ స‌ద‌స్సులు”

    1. అంత దమ్ము ఉంటే లాస్ట్ 5 ఇయర్స్ మీరే ఉన్నారు అండ్ ఇప్పుడు కూడా మీరు ఉన్నారు టచ్ చేయండి

Comments are closed.