ఎట్టకేలకు అల్లు అర్జున్ జైలు నుండి విడుదల అయ్యారు. నిన్న మధ్యాహ్నం అరెస్టై, బెయిల్ మంజూరైనప్పటికీ సరైన పత్రాలు చంచల్ గూడ జైలు అధికారులకు అందకపోవడంతో, నిన్న రాత్రంతా జైల్లో గడిపిన అల్లు అర్జున్ ఇవాళ విడుదలయ్యారు. అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వస్తున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు జైలు వద్దకు వచ్చినా.. ఆయన జైలు వెనుక గేటు నుండి ఇంటికి వెళ్లిపోయారు.
నిన్న రాత్రి బెయిల్ మంజూరైనా పలు కారణాల వల్ల జైలు నుండి విడుదల ఆలస్యమైంది. జైలు అధికారులు అల్లు అర్జున్‌ను అండర్ ట్రయల్ ఖైదీగా ఖైదీ నంబర్ 7697గా నమోదు చేశారు. రాత్రి 10 గంటల వరకు జైలు రిసెప్షన్‌లో ఉంచిన అధికారులు ఆపై మంజీరా బ్యారక్‌లోని క్లాస్-1 రూమ్‌కు తరలించారు. అక్కడ అల్లు అర్జున్‌తో పాటు మరి ఇద్దరు విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నారని తెలుస్తోంది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మొత్తం 18 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను ఏ11గా చేర్చగా, థియేటర్ ఓనర్‌ను ఏ1గా, మరో భాగస్వామి సందీప్‌ను ఏ3గా, మేనేజర్ నాగరాజును ఏ9గా చేర్చారు. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతుండగా, అల్లు అర్జున్ విడుదల కావడంతో అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తింది.
last term of revanth as cm. chala darunam anna idi
సరే ఇక రేవంత్ మిగులు, రేవతి పాపం లేదుగా.
అదృష్టం కలిసి వచ్చినా, కష్టం తో వచ్చినా, దాని వెనక దురదృష్టం ఎప్పుడూ పొంచి ఉంటుంది, అది మన నడవడిక, ఒదిగి ఉండడం, అతి గా స్పందించడం, వీటి మీద ఆధార పడి ఉంటుంది. అది తెలుసుకునే ఒక చిరంజీవి, ఒక రజినీకాంత్, ఒక అమితాబ్, దశాబ్దాలుగా ఆ హోదా కి వన్నె తెచ్చారు. ఈ తరం నటులు కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటే కుటిల రాజకీయాలకి నలిగి పోకుండా ఉంటారు.
ఇదో పెద్ద డ్రామా అని నాకు అనిపిస్తుంది . అల్లు అర్జున్ భాగ bad అయినాడు కాబట్టి అతనికి సింపతీ రావటానికి పెద్దవాళ్ళు ఆడిన డ్రామా గా ఉంది తప్ప ఇందులో ఏమాత్రం నిజం లేదు . లేక పోతే నిన్నFIR ఫైల్ చెయ్యడం ఏంటి remand నిన్నే ఇవ్వడం ఏంటి bail కూడా నిన్నే ఇవ్వడం ఏంటి . ఇక్కడ ప్రజలే ఎర్రిపప్పలు తప్ప పెద్దవ్వల్లు ఆడిన chess game ఇది
మూవీ రన్ ఆల్మోస్ట్ క్లోజ్ అవుతున్న టైంలో .. మరొక వంద కోట్లు కలెక్షన్లు ఈజీ గా వచ్చే అవకాశముంది… ఇండియా మొత్తం.. మీడియా, సోషల్ మీడియా ఛానెల్స్ లో ఇదే న్యూస్ .. మంచి స్ట్రాటజీ నే ..
Desodharakudi vidudala.. emotional ayyadanta papam. Veelave pranalu..andarivi kadu
ఎంతో సమంజసం, ఎంతో సమ్మతం. పోలీసుల మాట విని థియేటర్ కి వెళ్ళకుండా, వెళ్లినా జనాలను ఉత్తేజపరచకుండా ఉండి ఉంటే, law and order fail అయ్యుండేది కాదు, ఒక మనిషి ప్రాణం పోయుండేది కాదు, ఒక చిన్నారి కోమలో ఉండేదీ కాదు