కేవ‌లం సార్వ‌త్రిక ఎన్నిక‌లే వైసీపీ టార్గెట్‌!

అధికారంలో లేని వైసీపీకి ఎన్నిక‌లంటే విర‌క్తితో వుంది. కేవలం సార్వ‌త్రిక ఎన్నిక‌లు త‌ప్ప‌, మిగిలిన ఏ ఎన్నిక‌ల‌నైనా ఎదుర్కొనే ప‌రిస్థితిలో లేదు.

అధికారంలో లేని వైసీపీకి ఎన్నిక‌లంటే విర‌క్తితో వుంది. కేవలం సార్వ‌త్రిక ఎన్నిక‌లు త‌ప్ప‌, మిగిలిన ఏ ఎన్నిక‌ల‌నైనా ఎదుర్కొనే ప‌రిస్థితిలో లేదు. ఇదేమ‌ని ప్ర‌శ్నిస్తే… కూట‌మి త‌న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంద‌నే వాద‌న‌ను తెర‌పైకి తెస్లోంది. ఇందులో నిజం లేక‌పోలేదు. అయితే త‌న బాధ్య‌త‌ను వైసీపీ విస్మ‌రిస్తోంద‌న్న‌దే ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

అధికారంలో ఉన్న వాళ్లెవ‌రైనా నియంతృత్వ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ప్ర‌జాస్వామ్య విలువ‌ల్ని కాపాడాల‌నే ఆశ‌యం మ‌న పాల‌కుల‌కు వుంటే, ఇవాళ మ‌న వ్య‌వ‌స్థ ఎందుకిలా వుంటుంది? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. అంతెందుకు, తాము ఐదేళ్లు అధికారంలో ఉన్న‌ప్పుడు ఏ విలువ‌ల‌తో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించారో, ఎలాంటి ఫ‌లితాలు సాధించారో జ‌గ‌న్‌కు తెలియ‌ని అమాయ‌కుడు అనుకోవాలా? లేక ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిలా ఏదో ఒక విమ‌ర్శ చేయాలి కాబ‌ట్టి చేస్తున్నాడ‌ని భావించాలా?

కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత కోస్తాలో ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ చేతులెత్తేసింది. తాజాగా సాగునీటి సంఘాల ఎన్నిక‌లు. చివ‌రికి పులివెందుల‌లో కూడా అన్నీ టీడీపీకే ద‌క్కేలా ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించారు. వైసీపీ తీరు చూస్తుంటే, భ‌విష్య‌త్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా ఇదే ర‌కంగా వ్య‌వ‌హ‌రించేట్టు వుంది.

జ‌మిలి పుణ్య‌మా అని ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే చూసుకుందాం లేదా 2029లో కూట‌మితో అమీతుమీ తేల్చుకుందాం అనే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ ఐదేళ్లలో ఏ ఎన్నిక‌ల్లో తాము పోటీ చేసి త‌ట్టుకోలేమ‌నే నిర్ణ‌యానికి వైసీపీ నేత‌లు వ‌చ్చారు. అందుకే ఎన్నిక‌ల్లో పోటీ చేసి అవ‌మానాల్ని ఎదుర్కోవ‌డం ఎందుకని అనుకుంటున్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీగా ఎన్నిక‌ల్లో నిలిచి క‌ల‌బ‌డుదామ‌నే ఉత్సాహం వైసీపీలో లోపించింది. అందుకే అసెంబ్లీ స‌మావేశాలు మొద‌లుకుని, ప్ర‌తిదీ బ‌హిష్క‌ర‌ణే. హేమిటో… ఇదో కొత్త త‌ర‌హా రాజ‌కీయాన్ని చూస్తున్నాం అని జ‌నం అనుకుంటున్నారు.

6 Replies to “కేవ‌లం సార్వ‌త్రిక ఎన్నిక‌లే వైసీపీ టార్గెట్‌!”

  1. Adhikaram lo vunna ayidhellu raddhu… Prathipaksham lo vundaboye ayidhellu bhahishkarana…

    Ayidhella tharvatha yennikallo prajalu YCP prabhuthvanni raddhu chesaru…

    Vacche ayidhella tharvatha yennikallo YCP party ni bhahishkaristharu…

  2. Adhikaram lo vunna ayidhellu raddhu… Prathipaksham lo vundaboye ayidhellu bhahishkarana…

    Ayidhella tharvatha yennikallo prajalu ycp prabhuthvanni raddhu chesaru…

    Vacche ayidhella tharvatha yennikallo ycp party ni bhahishkaristharu…

  3. Adhikaram lo vunna ayidhellu raddhu… Prathipaksham lo vundaboye ayidhellu bhahishkarana…

    Ayidhella tharvatha yennikallo prajalu prabhuthvanni raddhu chesaru…

    Vacche ayidhella tharvatha yennikallo party ni bhahishkaristharu…

  4. పార్టీకి నాలుగు స్థంబాల్లాంటి ఆ నలుగురు రెడ్లు +

    మావోడు ఇంటింటికి చేసిన మంచి,

    ఊరురికీ చేసిన అభివృద్ధి,

    మావోడి అతి మంచితనం,

    మావోడి అతి నిజాయితీ

    వల్ల

    కళ్ళు మూసుకున్నా, ఏ ఎన్నిక అయినా 175/175 గెలుస్తాం.. కాకపోతే కూటమి పోటీ చెయ్యకుండా,షర్మిల and KA పాల్ పార్టీలు మాత్రమే పోటీ చెయాలి..

    దీనికి.. బాబ్బాబు ఒప్పుకోవా చెంద్రబాబు

  5. భగవత్గీత మనకు గొప్ప ఉదాహరణ రె డ్డి, దాంట్లో కృష్ణుడు ఎమ్ చేపిండు మనం ఏదైతే ఎదుటి వారికీ ఇస్తామో మనకు కూడా తిరిగి అదే వస్తది అన్నాడు 2019 to 2024 వరకు ఏ ఎలక్షన్ ఐనా మీరు ప్రతపక్షాల్ని పోటీ చేయానిచ్చారా లేదు మీరు నేర్పించిందే వాళ్ళు ఫాలో అవుతున్నారు తప్పేముంది “this is called karma”

Comments are closed.