క‌డ‌ప వైసీపీకి పెద్ద దిక్కెవ‌రు?

కంచుకోట లాంటి క‌డ‌ప జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం కలిగిస్తోంది. అందుకే వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో నిరుత్సాహం.

కంచుకోట లాంటి క‌డ‌ప జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం కలిగిస్తోంది. అందుకే వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో నిరుత్సాహం. క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అధికారంలో ఉన్న‌ప్పుడు ఏదో అలా పార్టీని న‌డిపించారు. వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా, ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధుల్ని కాపాడుకోవ‌డం స‌వాల్‌గా మారింది. దీనంత‌టికి వైసీపీకి క‌డ‌ప‌లో వైసీపీకి స‌రైన నాయ‌క‌త్వం లేక‌పోవ‌డ‌మే కార‌ణం.

తాజాగా క‌డ‌ప కార్పొరేష‌న్‌లో కార్పొరేట‌ర్లు గోడ దూక‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ 8 మంది కార్పొరేట‌ర్లు టీడీపీలో చేర‌డానికి విజ‌య‌వాడ‌కు వెళ్లారు. ఇంకెంత మంది ఉన్నారో అని వైసీపీ భ‌య‌ప‌డుతోంది. క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి పార్టీపై ప‌ట్టులేదు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న్ను క‌ల‌వాలంటే తెల్ల‌వారుజామున 4-5 గంట‌ల మ‌ధ్య పులివెందుల‌లో వుండాల్సిన ప‌రిస్థితి. ఆ త‌ర్వాత ఆయ‌న దొర‌క‌ర‌నే పేరు సంపాదించుకున్నారు. ఇదేమైనా రాజ‌కీయమా? లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్య‌వ‌హార‌మా? అనే విమ‌ర్శ చాలా కాలంగా వైసీపీలో వుంది.

అధికారంలో ఉన్న‌న్నాళ్లు ఎవ‌రినీ ప‌ట్టించుకోలేదు. దీంతో అసంతృప్తి అంత‌కంత‌కూ పెరుగుతూ వ‌చ్చింది. ఇప్పుడు అధికారంలో లేక‌పోవ‌డంతో పార్టీతో మ‌న‌కు ప‌నేం వుందిలే అనే నిర్ల‌క్ష్య భావ‌న ఏర్ప‌డింది. గ‌తంలో వైఎస్సార్ సీఎంగా ఉన్న‌ప్పుడు జిల్లా వ్య‌వ‌హారాల్ని వివేకానంద‌రెడ్డి ఒంటిచేత్తో చ‌క్క‌దిద్దేవారు. ఎవ‌రికైనా ఏదైనా ప‌ని ప‌డితే నేరుగా ఆయ‌నే వెళ్లేవారు. అలాంటి రాజ‌కీయాల్ని చూసిన జ‌నానికి, ప్ర‌స్తుతం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితుత్ని ఎదుర్కోవాల్సి రావ‌డం క‌ష్టంగా వుంది.

ఇక వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. సొంత జిల్లా క‌దా, త‌న‌ను కాద‌ని ఎక్క‌డికి పోతార్లే అనే ఆలోచ‌న‌లో ఉన్నారు. త‌మ్ముడు అవినాష్‌రెడ్డి అన్నీ చూసుకుంటార్లే అని ఆయ‌న న‌మ్మ‌కంగా ఉన్నారు. క్షేత్ర‌స్థాయిలో అంత సీన్ లేదు. జ‌గ‌న్ మాత్రం క్షేత్ర‌స్థాయిలో నెగిటివిటీనీ తీసుకోడానికి సిద్ధంగా లేరు. అధికారంలో లేక‌పోవ‌డం వ‌ల్లే పార్టీని వీడుతున్నార‌నో, మ‌రొక‌టో అనుకుంటున్నారు.

కానీ సొంత జిల్లాలో, కంచుకోట లాంటి ప్రాంతంలో ప‌ట్టు ఎందుకు జారుతున్నదో ఆయ‌న ఆలోచించ‌డం లేదు. ఇప్ప‌టికైనా సొంత జిల్లాలో లోపాల్ని స‌రిదిద్దుకుని, పార్టీని ప‌టిష్టం చేసుకోవాల్సిన బాధ్య‌త జ‌గ‌న్‌పై వుంది. త‌మ్ముడు, మామ‌, చిన్నాయ‌న‌గార్లు ఉన్నారులే అనుకుంటే, కొంప మునిగిపోతుంది. చేతులు కాల‌క ముందే ఆకులు ప‌ట్టుకోవ‌డం ఉత్త‌మం.

8 Replies to “క‌డ‌ప వైసీపీకి పెద్ద దిక్కెవ‌రు?”

  1. మావోడి తమ్ముడు రోజూ తెల్లవారుజామున 4 గంటలకి మరదల్ “రతి”తో గుసగుస అంట కదా?? మరి కార్యకర్తలకి దొరికేది ఎప్పుడు??

  2. Viveka garu undi vunte, paristhithi verugaa vundaedhi. Cader chellachedurayuevaaru kaadu. Andhuke long term thinking vundaa Li. Short term benefits kosam Viveka nu dhooram chesukonnaaru

  3. ఇలా అయిపోవడానికి కారణం ఎవరు ? అవినాష్ రెడ్డి లేక జగన . ఇంత పెద్ద సోది చెప్పావు కదా దీనికి కారణం కూడా నువ్వే చెప్పాలి మరి

Comments are closed.