గేమ్ ఛేంజర్.. సమస్య ఏమిటి?

దాదాపు మూడు నాలుగు వందల కోట్ల బడ్జెట్. కానీ ఎందుకు ఇంకా గేమ్ ఛేంజర్ సినిమాకు రావాల్సిన హైప్ రావడం లేదు

రామ్ చరణ్ హీరో, శంకర్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. దాదాపు మూడు నాలుగు వందల కోట్ల బడ్జెట్. కానీ ఎందుకు ఇంకా గేమ్ ఛేంజర్ సినిమాకు రావాల్సిన హైప్ రావడం లేదు. సినిమా విడుదల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు వస్తుందా? నిజానికి ఏ సినిమా హైప్‌కు అయినా ఇవ్వాళ, రేపు కొలమానం సోషల్ మీడియానే. దాన్ని పరిశీలనగా చూస్తే అర్థం అయిపోతుంది ఏ సినిమా క్రేజ్ నడుస్తోంది. ఏ సినిమాకు హైప్ వుంది. క్లారిటీ వచ్చేస్తుంది. ఆ విధంగా చూసుకుంటే గేమ్ ఛేంజర్ సినిమాకు రావాల్సిన హైప్ ఇంకా డ్యూ వుందనే అనిపిస్తోంది.

కల్కి, దేవర, పుష్ప 2 వీటితో సమానమైన సినిమానే గేమ్ ఛేంజర్ కూడా. కానీ ఎందుకో వాటితో సమానమైన కలర్ రావడం లేదు. ఎంత రేటు పెట్టినా కొని చూసారు ఆ మూడు సినిమాలను. గేమ్ ఛేంజర్ సంక్రాంతికి వస్తోంది. మరి దీనికి కూడా 800 లేదా వెయ్యి రూపాయల ప్రీమియర్లు ఎన్ని పడతాయి. తొలి రోజు రేట్లు ఎంత మేరకు పెంచుకుంటారు. డే వన్ కలెక్షన్ ఎంత వుంటుంది?

గేమ్ ఛేంజర్ కు ప్రధాన లోపం సరైన పాట పడకపోవడమే అన్న టాక్ ఒకటి వుంది. మచ్చ మచ్చ రా..పాట బాగా పాపులర్ అయింది కానీ, అది హీరో ఇంట్రడక్షన్ గ్రూప్ సాంగ్ లాంటిది. మరో పాట రొమాంటిక్ డ్యూయట్ వదిలారు. విజువల్స్ బాగున్నాయి. కానీ పాట ఎక్కడా వినిపించడం లేదు. దేవర డ్యూయట్, పుష్ప పాటలకు, ఆఖరికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పాటలకు చేసినట్లు రీల్స్ చేయడం కనిపించడం లేదు గేమ్ ఛేంజర్ పాటలకు. సాధారణంగా బాగున్న పాటలు మందుగా విడుదల చేస్తారు. ఈ లెక్కన రెండు పాటలు విడుదల చేసేసారు. అంటే మిగిలిన పాటల పరిస్థితి ఏమిటో తెలియాల్సి వుంది.

హీరో చేత అన్ ప్రిడిక్టబుల్ అని చెప్పించడం వరకు బాగానే వుంది. సినిమా కూడా అన్ ప్రిడిక్టబుల్ గా వుండాలి. లేదంటే టాప్ హీరోల రేస్ లో రామ్ చరణ్ వెనుకబడి పోతారు. డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం అన్నది ఫ్యాన్స్ వరకు పరిచయం అవుతుంది తప్ప కామన్ ఆడియన్స్ వరకు వెళ్లదు. సరైన మంచి ఫంక్షన్ ఇక్కడే జరగాల్సి వుంది. రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ అతిధిగా ఫంక్షన్ జరిగిన తరువాత ఏమైనా హైప్ పెరుగుతుందేమో చూడాలి.

ప్రస్తుతానికి అయితే సినిమా పరంగా, వదిలిన కంటెంట్ పరంగా, సోషల్ మీడియా హడావుడి రకంగా చూసుకుంటే గేమ్ ఛేంజర్ వెనుకబడే వుంది. దానికన్నా అదే సంక్రాంతికి వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు హడావుడి ఎక్కువ వుంది.

23 Replies to “గేమ్ ఛేంజర్.. సమస్య ఏమిటి?”

  1. ఇంకా ఏ ప్రమోషన్స్ మొదలు కాకముందే ఓవర్సీస్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి కదా

  2. 800 రూపాయలు రేటు పెట్టడం వల్లే కదా పుష్ప 2 ప్రీమియర్ లు ఖాళీ గా ఉన్నాయి.. చాలా చోట్ల షోలు కేన్సిల్ అయ్యాయి

  3. ఇంకేం సమస్య లేదు, ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడమే పెద్ద సమస్య

  4. cinema sankar tho cheyadam , Oka young hero outdated director tho ….it looks like the movie is to woo tamil tambi for something else. May not be the making movie is the motive here..

  5. Don’t worry it will be a blockbuster no doubt. Inner reports were superb. It collects more than devara and story ,screenplay and action wise more than pushpam no doubt. Shankar is class. Class is always class.He is intelectual

    1. చీము నెత్తురు లేవా…అయ్య….ప్ప మాలలో ద….ర్గాకు వెళ్లిన బొ…..కుల్ని support చేస్తావా…. ద్రో….హి

  6. హైప్ రాకపోడానికి శంకర్ లాస్ట్ మూవీ భారతీయుడు ప్లాప్ అవడం ఒక కారణం కావొచ్చు….

    రెండోది పుష్ప.. 2 మీద మెగా అభిమానుల ఏడుపులు….

  7. Whenever it comes, it is going to a big failure, added to that Sambar director and Producer are do not have any strategy and left the hopes. At least they should learn from Allu Arjun

Comments are closed.