అల్లు అర్జున్ రేంజ్ ఇప్పుడు రీజినల్ కాదు.. నేషనల్. అతని మీద నేషనల్ మీడియా ఫోకస్ విపరీతంగా ఉంది.
బన్నీ అరెస్ట్, విడుదల నేపథ్యంలో అరవింద్ గోస్వామి వంటి వాళ్లు కూడా లైవ్ డిబేట్స్ పెట్టడంతో అది నిరూపితమయ్యింది.
సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన బాధాకరమే. కానీ చట్టం ఏమి చెబుతున్నా నైతికంగా మాత్రం అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదని చాలామందికి అనిపిస్తోంది. అలాగని అందరూ ఆ భావనలో లేరు. అతనిని అరెస్ట్ చేయడం, ఒక రాత్రి జైల్లో ఉంచడం సమంజసమే అని అంటున్నవాళ్లు కూడా గణనీయంగానే ఉన్నారు.
ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు అనేది పక్కనపెట్టి అసలు తాను తన గురించి ఏమనుకుంటూ ఉండవచ్చు? దీనిపై రకరకాల ఊహాగానాలు చేయవచ్చు. గమనిస్తున్న విషయాలు, వినిపిస్తున్న అంశాలనుబట్టి కొన్ని చెప్పుకోవచ్చు.
ముఖ్యమంత్రితో పుష్పకి ఈగో క్లాష్ అవడం “పుష్ప2” సినిమాలో కీలకమైన సన్నివేశం. ఆ క్లాష్ వల్ల అతను ఎంతగా ఎదిగాడు, సీఎం నే ఎలా మార్చేశాడు అనేది కథనం. బహుశా ఆ పాత్రలోంచి బయటికి రాక నిజజీవితంలో కూడా తనకు సీఎం తో గొడవ ఉండడాన్ని హీరోయిజంగా భావిస్తూ ఉండొచ్చు. ఇక్కడ నిజ జీవితంలో ముఖ్యమంత్రి గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే నూటికి తొంభై మంది రేవంత్ రెడ్డి ఈగో హర్ట్ అవ్వడం వల్లనే అల్లు అర్జున్ అరెష్ట్ అయ్యాడని సోషల్ మీడియా సాక్షిగా నమ్ముతున్నారు. నిజానిజాలు పక్కనపెడితే ఈ అరెస్ట్ జరిగిన వేళ ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక ప్రశ్నకి సమాధానంగా అల్లు అర్జున్ ని చిన్నబుచ్చే మాటలు కొన్ని అన్నారు. దాంతో ప్రజల నమ్మకానికి మరింత బలం చేకూరినట్టాయ్యింది.
ఒకానొక “పుష్ప 2” ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచులో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మరిచిపోవడం చర్చనీయాంశయమయింది. అదే రేవంత్ రెడ్డి హర్ట్ అవ్వడానికి కారణం అని పలువురి నమ్మకం. ఒక్క రేవంత్ రెడ్డి పేరే కాదు.. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేరు కూడా మరిచిపోయాడు. అసలలా ఎలా మర్చిపోతాడు? నిజంగా మర్చిపోయాడా? లేక కావాలని అలా చేసాడా? కావాలని చేయాల్సిన అవసరం ఏంటి? ప్రతివాళ్లకి మనోభావాలుంటాయి కదా…వాటిని హర్ట్ చేయడం దేనికి?
ఈ ప్రశ్నలకి రకరకాల సమాధానాలు వినిపిస్తున్నాయి.
మాట్లాడుతుండగా బాగా తెలిసిన పేరే గబుక్కున మరిచిపోవడమనేది చాలామందికి జరుగుతుంటుంది. అలా నిజంగానే మరిచిపోయాడేమో అని అనుకోవచ్చు. అలా అనుకుంటే అల్లు అర్జున్ ని అధిక్షేపించాల్సిన పని లేదు. కానీ అందరూ అలా అనుకోవాలని లేదు. ఏ సెలెబ్రిటీ అయినా ఒకరి పేరు గుర్తు రానట్టు బిహేవ్ చేయడం, పేరేంటని పక్కనవాళ్లని అడగడం వాళ్లని పనిగట్టుకుని ఇన్సల్ట్ చేయడానికో, ఆ వ్యక్తి కన్నా తన లెవెల్ చాలా ఎక్కువని సంకేతంగా చెప్పడానికో చేసే పని. ఈగో సెంట్రిక్ మనుషులు అలాంటి పనులు అప్పుడప్పుడు చేస్తుంటారు. ఆ రకంగా అల్లు అర్జున్ ఏమైనా చేసాడా అనే అనుమానాలు కొందరికున్నాయి.
ఇంకొందరు ఇంకో రకమైన వివరణ ఇస్తున్నారు. అల్లు అర్జున్ లో కనిపించని రాం గోపాల్ వర్మ ఉన్నాడట. మీడియా అటెన్షన్ కోసం ఏదో ఒక తుంటరిపని చేయడం అతనికి సరదా అట. కనుక ఇలాంటివి తనకి కొత్త కాదని, ప్రతి ఈవెంటులోనూ ఏదో ఒక అసంబద్ధమైన చర్య చేసి డిస్కషన్ లేవదీయడానికి ప్రయత్నిస్తాడట. తాజాగా దర్శకుడు సుకుమార్ పేరుని బండ్రెడ్డి సుకుమార్ “రెడ్డి” అని చెప్పడం వెనుక కూడా కారణం ఇదేనని అంటున్నారు కొందరు. సుకుమార్ “రెడ్డి” కాదు. కానీ ఆ తోక తగిలిచేసరికి “అలా ఎందుకన్నాడబ్బా…పొరపాటా లేక ఇంకేమైనా కారణమా..” అని డిస్కషన్స్ మొదలయ్యాయి. అల్లు అర్జున్ కి కావాల్సింది అలాంటి డిస్కషన్లే అని కొందరి భావన. సుకుమారంటే అల్లు అర్జున్ కి ఎంత దగ్గరో చెప్పక్కర్లేదు. దశాబ్దాల పరిచయం, గత కొన్నేళ్ళుగా ఏకధాటి ప్రయాణం ఉన్నాయి. సుకుమార్ పేరుని తప్పు పలికే చాన్సే ఉండదు. కానీ పలికాడు.
కానీ ఇక్కడొకటి గుర్తించాలి. కళాకారులు హంబుల్ గా ఉండాలి. పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మరిచిపోతామేమో అన్న అనుమానం ఉంటే చేతి మీద రాసుకునైనా చదవాలి. సమాజం, ప్రభుత్వాధినేతలు కళాకారులనుంచి కోరుకునేది వినయం, మర్యాద.. ఆ తర్వాతే కళాప్రదర్శన. మహామహా సూపర్ స్టార్స్ అయిన రజనీకాంత్, అమితాబ్ వంటి వాళ్లు వేదికలమీద వినయాన్ని, మర్యాదపూర్వకమైన బాడీ లాంగ్వేజ్ ని చూపిస్తారు. ఈ తరం టాప్ స్టార్ ప్రభాస్ కూడా అంతే. మితంగా మాట్లాడడం, యారగెన్స్ ఎక్కడా చూపకపోవడం చేస్తుంటాడు. పేర్లు గుర్తుపెట్టుకుంటాడు, చెప్పాల్సినవి చెబుతాడు. అలా ఉన్నవాళ్లనే నెంబర్ వన్ స్థానంలో ఉంచాలని ప్రజలు కూడా కోరుకుంటారు.
అదలా ఉంచితే ఇంతకీ అల్లు అర్జున్ అరెస్ట్ పర్వంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు చర్చలో ఉన్నాయి. ఉదయాన్నే పోలీసులొచ్చి అర్జున్ ని తీసుకెళ్లిన తర్వాత చిరంజీవి, నాగబాబు అతని ఇంటికి వచ్చారు. ఆ సమయంలో అలు అరవింద్ కూడా అల్లు అర్జున్ వెంటే ఉన్నారు. కనుక ఇంట్లో ఉన్న అల్లు అర్జున్ తల్లితోనూ, భార్య స్నేహా రెడ్డితోనూ మాట్లాడి వెళ్లిపోయి ఉండొచ్చు మెగా సోదరులు.
మర్నాడు ఉదయం బన్నీ రిలీజయ్యి వచ్చాక అక్కడ ఇతర కుటుంబసభ్యులతో పాటు నాగబాబు, చిరులే కాదు, రాం చరణ్, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లాంటి ఏ మెగా హీరో లేడు. పవన్ కళ్యాణ్ జాడైతే లేనేలేదు. చిరంజీవి సతీమణి సురేఖ మాత్రం వచ్చారు. ఆమె అల్లు అర్జున్ కి మేనత్త.. రక్తసంబంధం. ఆమె ప్రేమగా మాట్లాడడం కనిపించింది.ఆ మర్నాడు ఆశ్చర్యకరంగా అల్లు అర్జున్ దంపతులు చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఇది కచ్చితంగా వార్తయ్యింది.
ఎందుకంటే, గత కొంత కాలంగా “మెగా” “అల్లు” క్యాంపుల మధ్య కోల్డ్ వార్ ఉందన్నది ఒక బహిరంగ రహస్యం. బహుశా మేనత్త సురేఖ గారు అల్లు అర్జున్ ని ఇంటికి రమ్మని పంతం పట్టి పిలిచి ఉండొచ్చు. ఆ పిలుపుతో వెళ్లి ఉండవచ్చు అని అనుకోవాలి. అయితే వెళ్లి ఎంత సేపు ఉన్నాడు? గంటంటే గంట! షూటింగ్ హడావిడి ఏదైనా ఉందా అంటే లేదు. చిరంజీవి ఇంట్లోకి కేటరింగ్ వ్యాన్లు కూడా వెళ్లాయి. అంటే కాస్త నిండైన గెట్ టుగెదర్ ఏర్పటయ్యింది. కానీ అల్లు అర్జున్ ముళ్లమీద కూర్చున్నట్టు కూర్చుని అంత త్వరగా వెనుతిరిగి వచ్చేయడం కూడా కొన్ని అనుమానాలకి తావిస్తోంది.
తనకు ఎక్కడో ఏదో వెలితి ఉంది. అదంత ఈజీగా ప్యాచ్ అయ్యేది కాకపోవచ్చు. చిరంజీవితో అల్లు అర్జున్ కి ఎప్పుడూ సమస్యలేదు. ఆయనంటే తనకి ఎంత గౌరవమో చాలా వేదికలమీద చెప్పాడు. కనుక చిరంజీవితో ఇబ్బంది లేకపోయినా పవన్ కళ్యాన్ తో ఉందా? ఉంటే ఎందుకు, ఎలా, ఎప్పటి నుంచి? ఎందుకంటే అసలాయన సీన్లోనే లేరు. అలాగని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బిజీగా ఉండి రాలేకపోయారా ఆంటే, మొన్న రాత్రి హైదరాబాద్ వచ్చి ఉదయం వెళ్లిపోయారని వార్త. కానీ బన్నీకి పలకరింపులు వంటివేం లేవు.
ఇక్కడ ఒక్కటే లెక్క. చిరంజీవి వల్లనే ఆ ఫ్యామిలీ మెంబర్ గా అవకాశాలు పొంది ఇంత ఎదిగావు, కనుక ఆయనకే కాకుండా మెగా క్యాంపు మొత్తానికి అణిగి ఉండాలి అన్నది “మెగా క్యాంప్” వైపు నుంచి డిమాండయ్యుండొచ్చు. అదే నిజమైతే అల్లు రామలింగయ్య అల్లుడిగా చిరంజీవి అవకాశాలు పొంది ఈ స్థాయికి వచ్చింది కూడా నిజమేనా అనేది అల్లు అర్జున్ పాయింటయ్యి ఉండొచ్చు. చిరు కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన అందరూ ఆ స్థాయికి ఎదగలేదు. అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ కూడా అన్న స్థాయికి దరిదాపుల్లో కూడా లేడు. ఇక్కడ ఎవరి సత్తా వాళ్లది, ఎవరి అదృష్టం వాళ్లది. సర్దుకుపోవాలి తప్ప కడుపు చించుకుంటే కాలి మీదే పడుతుంది.
ఆలాగని అల్లు అర్జున్‌ని పూర్తిగా సమర్ధించే పరిస్థితి లేదు. ఎందుకంటే పుష్ప2 లో ఎన్నో డైలాగులు చిరంజీవిని ఎత్తి చూపుతున్నట్టు ఉన్నాయని సోషల్ మీడియా అరుస్తూనే ఉంది. కనీసం ఒక ట్వీట్ చేసైనా “నా మామయ్యను నేనెందుకు అలా అవమానిస్తాను. ఆ డైలాగులకి, మీరనుకునేదానికి సంబంధంలేదు..” అని రాసి ఉండొచ్చు కదా. నిర్మాతలు ఖండించారు కానీ అల్లు అర్జున్ ఖండించకపోవడం టెంపరితనమే అనిపించుకుంటుంది. అంతే కాదు, అల్లు అర్జున్ తన మామయ్య చిరంజీవిని కలిసినప్పుడు ఆయన కనీసం శాలువా కప్పి ఆశీర్వదించారా? ఎలా ఆశీర్వదిస్తారు? ఆ డైలాగుల గురించి క్లారిటీ లేకుండా? మెగా హీరో అయిన రాం చరణ్ సీన్లో ఎలా ఉంటాడు ఇదంతా తేలకుండా?
అదొక్కటే కాదు, జైల్లోంచి ఇంటికొచ్చాక లైవ్ టెలీకాస్ట్ పెట్టడం, ఆ సమయంలో “ఐకాన్ స్టార్” అనే షర్ట్ వేసుకోవడం మరీ హాస్యాస్పదంగా ఉంది. హుందాగా అస్సలు లేదు. ఒక పక్క చావుబతుకుల్లో శ్రీతేజ్ అనే పిల్లవాడు ఉంటే ఈ వేడుకలేంటని జాతీయ మీడియా తిట్టిపోసింది కూడా. ఆ తిట్లకి బెదిరి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామార్శించడానికి వెళ్లలేదు. లీగల్ గా వెళ్లి కలవాల్సిన అవసరంలేదు. మోరల్ గా అయితే కలవాలి అని సమాజమనుకుంటుంది. దానికి లీగల్ కారణాలున్నాయని, బాధిత కుటుంబాన్ని కలవడానికి లేదని, తర్వాత కచ్చితంగా కలుస్తానని, సాయం అందిస్తూనే ఉంటానని ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు అల్లు అర్జున్. మరి మోహన్ బాబు తాను కొట్టిన టీవీ9 విలేకరిని ఎలా కలిసాడు? అతనిని ఆపని చట్టం అల్లు అర్జున్ ని ఎలా ఆపుతోంది? దానికి సమాధానం ఇంకా లేదు.
– శ్రీనివాసమూర్తి
Pushpa 3rd week ki velatadu. Appudu konchem publicity taggakunda . Only his idea pushpa movie should be in lime light as much as possible
I am a staunch fan of Chiru, and the next Mega star I hold in that high regard is Allu Arjun. But AA’s behavior is deplorable in this whole saga. Although I think arresting him is silly, but his behavior/reaction to the arrest is equally silly. Grow up Allu Arjun. You are now a national STAR, behave like one.
Chivariga mana payment kukkalu ALLU babu DP vunchala ,vere hero DP ki maripovala ani thelcha kundane aapesaru…😂😂 confusion lo vunnara….asalu mimmalni SM lo free ga vaadu kovadame valla strategy yemo GA…😂😂
final ga, mana payment kukkalu ALLU babu DP vunchala , vere hero ki maripovala ani thelcha kundane aapesaru….😂😂 confusion lo vunnara…inaa asalu mimmalni SM lo free ga vaadu kovadame valla asalina strategy yemo GA…..😂😂…FOOD FOR THOUGHT
Mee payment kukkalanu free ga SM lo vaadu kovadame valla asaliana strategy GA…..😂😂😂 inka ardam kaaleda…..
Mee vallani free ga SM lo vaadu kovadame valla asaina strategy GA……
deeni meeda mana REDLA reaction yemiti reddy?
Aravind goswami kaadu raa babu arnab goswami
he is good
Not sure about the CM’s intentions here, but AA is an attention seeker. He would have been silently enjoying that whole media attention all this while.
saaluvaa kappaledhaa? mamayya, menalludu kalisthe saaluvaalu kapputharaa….
పునాకలోడికి వైల్డ్ ఫైర్ లోడింగ్ ఆ ? లేక వైల్డ్ ఫైర్ వాడికి పూనకాలు లోడింగ్ ఆ ??
వైల్డ్ ఫైర్ లేదు బొంగు లేదు వైన్ ఎక్కువ అయితే ఇలాంటివన్నీ వస్తాయి
allu Arjun over confident I d I o t ..
Kukka simhasanam ekkithey simham kaadu,kukka eppatki kunna ne.ee chinna logic miss ayadu,edo heart surgery ayi discharge ayinattu ooo immatute buildups,growup man
allu Arjun over confident I d I o t .smuggling role ki .National award only modi rule lo matrame sadhyam .. andariki publicity ekkuva vishayam thakkuva.. revanth veedi thimmiri thagginchi manchi pani chesadu
allu Arjun over confident I d I o t .smuggling role ki .National award only modi rule lo matrame sadhyam .. andariki publicity ekkuva vishayam thakkuva.. revanth veedi thimmiri thagginchadu
allu Arjun over confident I d I o t .smuggling role ki .National award only modi rule lo matrame sadhyam .. andariki publicity ekkuva vishayam thakkuva
Allu’s behaviour is always chillar…..kanakapu simhasanamuna sunkamu koorchundabettina adi venkati tana gunamela maanu sumathi!
AA might be a good actor/dancer and hard working person. Because of him one was killed. another boy is in hospital. All this happened because he went to Sandhya theater. So he should pay for all this.
As Revanth Reddi said, Many people are worried about AA’s arrest? How many are really worried about that mom and boy? We need to think about it.
Why the ticket price is 1200Rs? I am sure that family spent 5000Rs for watching this movie. If they go now they would have saved 3.5K+ their lives.
Please think…
Gr8 Andhra emina bagupade news ivvandi ra babu..ivi oka articles meeru marara mari..Naku ardam ayindi enti ante sharmila laga mega family lo kuda ravali..ne badha adi but evaru ala vundaru..niku malli jaggu Bhai ravali ni last aim adi
H
Pushpa kakunda vere edaina strait cinema cheyyamanu..Bolta
నేను ఏ కామెంట్ పెట్టిన under moderation అని పెడుతున్నావు అంతా భయపడే వాడివి నీకు ఎందుకురా ప్రెస్ . మూసేసి పకోడీలు అమ్ముకో
Orey Nayana Allu arjun peru marichipoyadu ani jail lo pettadamenti nuvvu nee raatalu. Revanth useless ga alochincharu and also he told that he is relative(from his wife side). According to case he is the reason behind stamped and he got arrested nothing wrong in that. Social media lo edo sodi rasaru ani nuvvu intha pedda article rasav antene nee telivi ardam avutundi
ఫాఫం మనం ఎంత చలి మంట కాచుకుందాం అనుకున్నా కూడా, టైం వచ్చినపుడు వాళ్ళు అందరూ కలిసి పోతున్నారు.
“మెగా ఫైర్” చాలా వైల్డ్ గురూ..!
అరే గూట్లే .. జైలు కెళ్ళి వచ్చి నందుకు శాలువా కప్పాలా .. ఏమి చెపుతున్నావ్ రా ..
ee విధం గ జనసందోహం వచ్చే అవకాశం ప్రాంతాలలోకి పిల్లల తో వున్నా మహిళలను వృద్ధులను చిన్న పిల్లలను వెళ్లనీయరాదు
Media ki full news dhorikindhi inkka 3 months idhe news full trp ratings
అల్లు అర్జున్ రె డ్డి ఏమైనా తెలంగాణా స్టేట్ కి స్పెషల్ స్టాటస్ కోసం ఫైట్ చేసి జై ల్ కి వెళ్లి వచ్చాడా..వాడి అ రె స్ట్ కి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వటమే గొప్ప మళ్లి ఈ నక్క కి సంఘీభావం తెలపాల..నీకు భావప్రాప్తి లేక ఈ ఆర్టికల్ రాసి వుంటావ్.. అంతే
ఎ ర్రిపూ క వెబ్సైట్ లో పని చేస్తే ఏది పడితే అది రాయడమేనా. జైల్ కి వెళ్లి బెయిల్ మీద నెల రోజులు బయటికి వస్తే శాలువా కప్పడం ఏంటి రా పు కా, నేషనల్ అవార్డ్ వచ్చినపుడు చిరు దంపతులు అభినందించారు. చిరు అంటే వాళ్ళ అత్త మొగుడు కాబట్టి ఇంటికి రమ్మంది. మరి నాగబాబు ఇంటికి ఎందుకు వెళ్ళాడు. అది కూడా సురేఖ నే చెప్పిందా. అసలు ఆ విషయం ఈ ఆర్టికల్ లో చెప్పలేదు అంటే నీ ఇంటెన్షన్ అర్థం చేసుకోవచ్చు ఎంత ఆయున వెంకులు దగ్గర పని చేస్తున్నావ్ కదా కనీసం విశ్వాసం ఉంటుంది లే.
hi
pushpa 2 hit tharvaatha, team director & producers velli chiru ni kalisaaru except AA.
Mega camp ki anigi manigi vundaalani evaroo anukoru. kaakapothe athi cheyakunda, negative gaa lekundaa vunte chaalu ani expect chesthaaru. But veedu thuntari and temparithanam vaanni vundanivvadhu. edhi chesinaa athi. jail nunchi vachi ICON STAR t-shirt vesukovatam ento. prapamcham lo yevadoo vaadi ki vunna TAG ni T-shirt vesukuni thiragadu.
AA lo vunna only negative point PUBLICITY DURADHA . kaakapothe ICON START ani t-shirt vesukovatam , ekkada padithe akkada AA ani boards pettukovatam ento?
nenu observe chesina reason: allu ramalingaiah centenary function lo stage meedha photos theesukunetappudu allu arjun chiranjeevini ignore chesaadu. please watch that video. appudu charan chiranjeevini thanaprakkaku kopamga laakkuni photo digaaru. i think it hurted charan and so charan might have asked chiru to not to entertain allu family. So, chirranjeevi is in a fix but as a elderly person he visited arvind house when allu arjun is not present.
this is not allu ki thagilina mega gaayam, it is charan ki thagilina allu gaayam.
Era eppudu Chiranjeevi Family meda padi edavadamena nee pani.Rajini kanth,Amitha bacchhan lu Super star lu Ani cheppavu,Telugu lo Chiranjeevi Super star kaada.Ore Great Andhra nee Kullu entira