ఇక డెయిరీ విచారణ అటకెక్కిస్తారా?

విశాఖ డెయిరీ అక్రమాల మీద శాసనసభా కమిటీ విచారణను అటకెక్కిస్తుందా అనే అనుమానాలు కూడా పలువురిలో కలుగుతున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేయడం కోసం కూటమి నాయకుల నుంచి ఒత్తిడులు, ప్రలోభాలు, బెదిరింపులు ఉంటున్నాయా? ఇప్పటినుంచే ప్రారంభించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మూలాలనుంచి బలహీనపరచడానికి ఒక ప్రణాళిక ప్రకారం కూటమి పెద్దలు పావులు కదుపుతూ వస్తున్నారా? తాజా పరిణామాలు గమనిస్తోంటే ఇది నిజమే అనిపిస్తోంది.

విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి ఆనంద్ కుమార్, తొమ్మిది మంది డైరెక్టర్లతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అనేది ఆలోచించాల్సిన విషయమే.

విశాఖ డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయని కొన్నాళ్లు రచ్చరచ్చ అవుతూ వచ్చింది. జనసేన నాయకులు తొలుత ఈ రాద్ధాంతం ప్రారంభించారు. తర్వాత తెలుగుదేశం వాళ్లు కూడా టేకప్ చేశారు. సమస్య బాగా చర్చల్లో నలిగిన తర్వాత, ప్రభుత్వం ఒక శాసనసభా కమిటీని ఏర్పాటు చేసింది. ఆ సభా కమిటీ విచారణ ప్రారంభించిన కొన్ని రోజులకే డెయిరీ పాలకవర్గంలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేశారు.

ఈ పరిణామాన్ని గమనిస్తే అసలు తెరవెనుక ఏం జరిగిందో పసిపిల్లలు కూడా ఊహించి చెప్పగలరు. విచారణ పేరుతో డెయిరీ పాలకవర్గాన్ని బెదిరించి, ఇంకా ఏదైనా ఇతరత్రా కూడా ప్రలోభపెట్టి వారితో వైసీపీకి రాజీనామా చేయించారని తేటతెల్లంగా అవుతోంది.

డెయిరీ అభివృద్ధి మీద దృష్టి పెట్టడం కోసమే పార్టీకి రాజీనామా చేసినట్టు అడారి ఆనంద్ కుమార్ చెబుతున్న గానీ, అవన్నీ ఉత్తుత్తి మాటలేనని అందరికీ తెలుసు. వారితో పాటు ఆయన చెల్లెలు ఎలమంచిలి మునిసిపల్ ఛైర్మన్ గా ఉన్న పిళ్లా రమాకుమారి కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన కబుర్లు అబద్ధాలేనని అర్థమవుతోంది. ఇది కేవలం వైసీపీని బలహీనపరచడానికి కూటమి పెద్దలు చేస్తున్న కుట్రలో భాగంగానే పలువురు గమనిస్తున్నారు.

అడారి ఆనంద్ కుమార్ కేవలం డెయిరీ ఛైర్మన్ మాత్రమే కాదు. గత ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జి కూడా. ఇలాంటి వారిని పార్టీనుంచి బయటకు తీసుకువచ్చేస్తే ఆ పార్టీ అక్కడ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి టైం పడుతుందని, ఆ రకంగా వైసీపీని దెబ్బకొట్టవచ్చుననే వ్యూహంతోనే ఇలా చేస్తున్నారని అనిపిస్తోంది.

పనిలో పనిగా తమ ప్రయోజనం నెరవేరింది గనుక, ఇక విశాఖ డెయిరీ అక్రమాల మీద శాసనసభా కమిటీ విచారణను అటకెక్కిస్తుందా అనే అనుమానాలు కూడా పలువురిలో కలుగుతున్నాయి.

2 Replies to “ఇక డెయిరీ విచారణ అటకెక్కిస్తారా?”

  1. ఆడారి 2019 ముందు ఎక్కడ ఉన్నడో తెలుసుకో? తండ్రి దెగ్గరనుండి వారి కుటుంబం ఏ పార్టీ తెలుసుకో? 2019 లో వైసీపీ కి ఎందుకు రావాల్సివచ్చిందో తెలుసుకో…

Comments are closed.