రేవంత్‌కు కేటీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్‌!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా శ‌నివారం రైతు భ‌రోసాపై చ‌ర్చ చేప‌ట్టారు. ఇందులో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతుల‌కు రూ.40 వేల కోట్ల రుణ‌మాఫీ చేయాల్సి ఉన్న‌ట్టు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పార‌న్నారు. అది కాస్తా కేబినెట్‌కు వ‌చ్చే స‌రికి రూ.31 వేలు కోట్లు అయ్యింద‌న్నారు.

బ‌డ్జెట్ పెట్టే స‌మ‌యానికి రూ.26 వేల కోట్లు అయ్యిన‌ట్టు కేటీఆర్ చెప్పుకొచ్చారు. సంపూర్ణ రుణ‌మాఫీ కానే కాలేద‌న్నారు. కొడంగ‌ల్‌, సిరిసిల్ల లేదా పాల‌మూరు…మీ ఇష్టం ఏ ఊరికైనా పోదాం, సంపూర్ణ రుణ‌మాఫీ అయ్యిన‌ట్టు నిరూపిస్తే స్పీక‌ర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ ఇస్తాన‌ని రేవంత్‌రెడ్డికి స‌వాల్ విసిరారు. అలాగే స‌న్యాసం స్వీక‌రిస్తాన‌ని సీఎం రేవంత్‌కు స‌వాల్‌తో పాటు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు.

సంపూర్ణ రుణ‌మాఫీ చేశామ‌ని రేవంత్‌రెడ్డి స‌ర్కార్ న‌మ్ముతున్న ప‌రిస్థితిలో కేటీఆర్ స‌వాల్‌ను స్వీక‌రించాలి. కేటీఆర్‌తో రాజీనామా చేయించి, రాజ‌కీయ స‌న్యాసం స్వీక‌రించేలా చేస్తే కాంగ్రెస్‌కు అడ్డంకి తొలుగుతుంది.

బ‌ల‌మైన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు లేకుండా చేసుకునే అవ‌కాశాన్ని కాంగ్రెస్ ఏం చేస్తుందో మ‌రి! తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల మ‌ధ్య వాడివేడిగా సాగుతున్నాయి.

2 Replies to “రేవంత్‌కు కేటీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్‌!”

Comments are closed.