అల్లు అర్జున్ విషయంలో టీడీపీ ఆచితూచి మాట్లాడుతోంది. అల్లు అర్జున్‌పై కూటమిలో భిన్నాభిప్రాయాలున్నాయి. అల్లు అర్జున్‌కు టీడీపీ, జనసేన శ్రేణులు వ్యరేకంగా, బీజేపీ అనుకూలంగానూ వ్యవహరిస్తున్నాయి. అయితే పైకి మాత్రమే తాము అనుకూలమే అనే కలరింగ్ ఇవ్వడానికి టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు.
అల్లు అర్జున్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ కామెంట్స్ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ రాజకీయ రంగు పులుముకుంది. అనుకూల, వ్యతిరేక శిబిరాలుగా ఏర్పడి… అల్లు అభిమానులను , అలాగే ఆయన సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునే వ్యూహానికి కొందరు నాయకులు పదును పెట్టారు.
ఈ కోణంలోనే ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అభిప్రాయాన్ని చూడాల్సి వుంటుంది. అల్లు అర్జున్‌కు మొదటి నుంచి వైసీపీ మద్దతుగా నిలిచింది. దీంతో టీడీపీ కూడా తాము వ్యతిరేక ముద్ర ఎందుకు వేయించుకోవాలనే ఆలోచనతో వ్యవహరిస్తోంది. ఇవాళ పల్లా శ్రీనివాసరావు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ బెన్‌ఫిట్ షోలు వేయకూడదనే నిర్ణయానికి తాను వ్యతిరేకమన్నారు. ఒకవేళ బెన్‌ఫిట్ షోలు వేయకపోతే సినిమా ఫైరసీ పెరుగుతుందని ఆయన అన్నారు. సినిమా థియేటర్ల వద్ద ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత సినిమా వాళ్లతో పాటు ప్రభుత్వంపై కూడా వుందన్నారు.
తెలంగాణలో పరస్పరం ఆరోపణలు చేసుకోకుండా , భవిష్యత్‌లో దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల న్నారు. తెలంగాణలో సంధ్య థియేటర్ వద్ద దుర్ఘటనకు సంబంధించి నిఘా వర్గాలు వైఫల్యం చెందాయని ఆయన ఆరోపించి, అల్లు అర్జున్, ఆయన అభిమానుల మెప్పు పొందేందుకు ప్రయత్నించారు. సినిమా విడుదల సందర్భంలో హీరోలు థియేటర్లకు వెళ్లకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సొల్లు ఎందుకు? ముందు Rs 5 రూపాయల టికెట్ పెడతా మన జగన్ అన్న ఇప్పుదు ఎమంటున్నదొ చెప్పు!
మావోడు అయితే Tkt rate 11/- చేస్తడు
ee tdp pig, benefit show veyakapothe, mega hero’s and nuts family hero’s muta Mullu sardukovalisinde….
elagu age tho packup ayipoyaaru…
verri veshalu enduku…