మోహ‌న్‌బాబుకు జైలు త‌ప్ప‌దా?

సినీ న‌టుడు మోహ‌న్‌బాబు ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ఈ మేర‌కు సోమ‌వారం తీర్పు వెలువ‌రించింది.

సినీ న‌టుడు మోహ‌న్‌బాబు ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ఈ మేర‌కు సోమ‌వారం తీర్పు వెలువ‌రించింది. జ‌ర్న‌లిస్టుల‌పై దాడి ఘ‌ట‌న‌లో మోహ‌న్‌బాబుపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదైంది. అయితే అనారోగ్య కార‌ణంతో మోహ‌న్‌బాబు కూడా ఆస్ప‌త్రిపాలైన సంగ‌తి తెలిసిందే. విచార‌ణ‌కు రావాల‌ని ప‌హాడీ ష‌రీఫ్ పోలీసులు మోహ‌న్‌బాబు, ఆయ‌న ఇద్ద‌రు త‌న‌యుల‌కు నోటీసులు ఇచ్చారు.

మోహ‌న్‌బాబు చిన్న కుమారుడు మ‌నోజ్ పోలీస్ విచార‌ణ‌కు వెళ్లారు. మోహ‌న్‌బాబు ఆస్ప‌త్రిలో ఉండ‌డంతో విచార‌ణ‌తో పాటు అరెస్ట్ నుంచి ఈ నెల 24వ తేదీ వ‌ర‌కూ తెలంగాణ హైకోర్టు మిన‌హాయింపు ఇచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన గ‌డువు ముగుస్తుండ‌డంతో ముంద‌స్తు బెయిల్ కోసం ఆయ‌న న్యాయ‌స్థానాన్ని మ‌రోసారి ఆశ్ర‌యించారు.

న్యాయ స్థానంలో ఇరుప‌క్షాల వాద‌న‌లు ఇటీవ‌ల పూర్త‌య్యాయి. ఇవాళ్టికి తీర్పు వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టులో మోహ‌న్‌బాబుకు చుక్కెదురైంది. ఆయ‌న ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను న్యాయ స్థానం కొట్టేసింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు జైలు త‌ప్ప‌దా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం మోహ‌న్‌బాబు హైద‌రాబాద్‌లో లేన‌ట్టు స‌మాచారం.

హైకోర్టు ఆదేశానుసారం మోహ‌న్‌బాబుపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని గ‌తంలోనే పోలీస్ ఉన్న‌తాధికారులు చెప్పిన సంగ‌తి తెలిసిందే. అందుకే మోహ‌న్‌బాబుపై చ‌ర్య‌ల‌కు సంబంధించి స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

4 Replies to “మోహ‌న్‌బాబుకు జైలు త‌ప్ప‌దా?”

Comments are closed.