మీపై క‌క్ష లేదు… కూట‌మి నేత‌ల ఒత్తిళ్ల‌తోనే!

మీపై మాకు వ్య‌క్తిగ‌త క‌క్ష‌లేమీ లేవు. ఏం చేస్తాం? కూట‌మి పెద్ద‌ల నుంచి తీవ్ర ఒత్తిళ్లు. అందుకే కేసులు పెట్ట‌క త‌ప్ప‌డం లేదు.

కూట‌మి స‌ర్కార్ ఆరు నెల‌ల పాల‌న‌లో పోలీసు శాఖ‌లో ఎందుకో కొంత మార్పు క‌నిపిస్తోంది. కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు నియ‌మించుకున్న పోలీస్ అధికారులు కూడా మ‌రీ దూకుడుగా పోతే, భ‌విష్య‌త్‌లో ఏమ‌వుతుందో అనే భ‌యాందోళ‌న‌కు గురి అవుతున్న‌ట్టు , వాళ్ల మాట‌లు వింటే అర్థ‌మ‌వుతుంది. మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్ పుణ్య‌మా అని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అలాగే సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌పై కేసుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, కొంద‌రు జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు రాంగ్ రూట్ ఎంచుకున్న సోష‌ల్ మీడియా యాక్టివిస్టులున్నారు. వీళ్ల విష‌యంలో పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డంలో ఎలాంటి త‌ప్పులేదు. వైసీపీ నాయ‌కులు కూడా అలాంటి వాళ్లు త‌మ వాళ్లైనా, ప్ర‌త్య‌ర్థులైనా బుద్ధి చెప్పాల‌ని కోరుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో వైసీపీ పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుగ్గా పాల్గొనే వారిని సైతం భ‌య‌పెట్టే ఉద్దేశంతో పోలీసుల‌తో అక్ర‌మ కేసులు న‌మోదు చేయించార‌న్న ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. అనంత‌పురం మొద‌లుకుని, శ్రీ‌కాకుళం జిల్లా వ‌ర‌కూ అటూఇటూ కేసులు బ‌దిలీ చేస్తూ, నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇదేమీ పోలీసులు త‌మ‌కు తామై చేయ‌డం లేదు. కొంద‌రు పోలీసులు అత్యుత్సాహంతో ప్ర‌భుత్వ పెద్ద‌ల మెప్పు కోసం కాస్త ప‌రిధి దాటి వ్య‌వ‌హ‌రిస్తున్న వాళ్లు లేక‌పోలేదు.

కానీ ఎక్కువ మంది పోలీసులు ప్ర‌స్తుత‌, గ‌తానుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని, జాగ్ర‌త్త‌గా మ‌స‌లుకుంటున్న‌ట్టు విచార‌ణ ఎదుర్కొంటున్న వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

“మీపై మాకు వ్య‌క్తిగ‌త క‌క్ష‌లేమీ లేవు. ఏం చేస్తాం? కూట‌మి పెద్ద‌ల నుంచి తీవ్ర ఒత్తిళ్లు. అందుకే కేసులు పెట్ట‌క త‌ప్ప‌డం లేదు. మిమ్మ‌ల్ని విచారించాల్సి వ‌స్తోంది. మిమ్మ‌ల్ని ఏమీ అన‌డం లేదు. క‌నీసం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ మిమ్మ‌ల్ని పోలీస్‌స్టేష‌న్ల‌లో కూచోపెడితే, మా పై అధికారులు, అలాగే ప్ర‌భుత్వ పెద్ద‌ల్ని సంతృప్తిప‌రిచిన వాళ్ల‌మ‌వుతాం. ద‌య‌చేసి అర్థం చేసుకోండి” అని చాలా చోట్ల విచార‌ణ‌కు వెళ్లిన వైసీపీ యాక్టివిస్టుల‌తో అంటున్నార‌ని తెలిసింది.

అధికారం శాశ్వ‌తం కాద‌నే స్పృహే కొంద‌రు పోలీస్ అధికారుల‌తో ఇలా మాట్లాడిస్తోంద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది. కేవ‌లం ప్ర‌భుత్వ పెద్ద‌ల కోసం పోలీసులు కూడా త‌మ‌దైన స్టైల్‌లో న‌టిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

5 Replies to “మీపై క‌క్ష లేదు… కూట‌మి నేత‌ల ఒత్తిళ్ల‌తోనే!”

  1. ఇప్పుడు ఈ ఆర్టికల్ చదివిన కూటమి పెద్దలు.. అరెస్ట్ చేసిన వైసీపీ కుక్కలని చావ బాదాల్సిందే అని పోలీసుల మీద ఒత్తిడి తెస్తే.. పాపం.. వైసీపీ పిల్ల పిచుకలన్నీ ఏమైపోతాయో ఆలోచించావా..?

    నీ వల్ల నీ జగన్ రెడ్డి పార్టీ జనాలని పైసా ప్రయోజనం లేకపోగా.. ఇప్పుడు ప్రాణం మీదకు తెచ్చుకొన్నారు..

    ..

    ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్నా.. పోలీసులు ఇలానే చెపుతారు..

    వాళ్ళ చేతికి మట్టి అంటకుండా.. కుమ్మేసిన చేతులకు అంటిన రక్తం కడిగేసుకొంటారు..

    ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది పోలీసుల గురించి కాదు.. కోర్టుల గురించి రా ముండమోపి..

    2019-24 మధ్యలో టీడీపీ అక్టీవిస్టులను అరెస్ట్ చేస్తే.. కోర్ట్ అదే రోజు సాయంత్రం బెయిల్ మంజూరు చేసేసేది..

    కానీ.. ఇప్పుడు వైసీపీ జనాలకు మాత్రం బెయిల్ ఎందుకు రావడం లేదు.. వారాలు, నెలల తరబడి ఎందుకు జైలు లో మగ్గుతున్నారో.. అర్థం చేసుకొన్నావా..?

    ..

    ఎందుకంటే.. వైసీపీ జనాల రోత రాతలు, బూతు కూతలు చూస్తే ఏ జడ్జి కి బెయిల్ ఇవ్వాలని అనిపించదు..

    లోపలేసి కుమ్మేయండి కొడుకుల్ని.. అని డైరెక్ట్ గా చెప్పకుండా.. చెప్పి పంపించేస్తారు..

  2. ఇప్పుడు ఈ ఆర్టికల్ చదివిన కూటమి పెద్దలు.. అరెస్ట్ చేసిన వైసీపీ కుక్కలని చావ బాదాల్సిందే అని పోలీసుల మీద ఒత్తిడి తెస్తే.. పాపం.. వైసీపీ పిల్ల పిచుకలన్నీ ఏమైపోతాయో ఆలోచించావా..?

    నీ వల్ల నీ జగన్ రెడ్డి పార్టీ జనాలని పైసా ప్రయోజనం లేకపోగా.. ఇప్పుడు ప్రాణం మీదకు తెచ్చుకొన్నారు..

    ..

    ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్నా.. పోలీసులు ఇలానే చెపుతారు..

    వాళ్ళ చేతికి మట్టి అంటకుండా.. కుమ్మేసిన చేతులకు అంటిన రక్తం కడిగేసుకొంటారు..

    ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది పోలీసుల గురించి కాదు.. కోర్టుల గురించి రా ముండమోపి..

    2019-24 మధ్యలో టీడీపీ అక్టీవిస్టులను అరెస్ట్ చేస్తే.. కోర్ట్ అదే రోజు సాయంత్రం బెయిల్ మంజూరు చేసేసేది..

    కానీ.. ఇప్పుడు వైసీపీ జనాలకు మాత్రం బెయిల్ ఎందుకు రావడం లేదు.. వారాలు, నెలల తరబడి ఎందుకు జైలు లో మగ్గుతున్నారో.. అర్థం చేసుకొన్నావా..?

    ..

    ఎందుకంటే.. వైసీపీ జనాల రోత రాతలు, బూతుకూతలు చూస్తే ఏ జడ్జి కి బెయిల్ ఇవ్వాలని అనిపించదు..

    లోపలేసి కుమ్మేయండి కొడుకుల్ని.. అని డైరెక్ట్ గా చెప్పకుండా.. చెప్పి పంపించేస్తారు..

    1. VR want that only so that alliance get bqd name or as bad as YCP and they stop not intriguing the ycp beggies… So finally PAytm or common people are the scape goats.

Comments are closed.