ఎందుకు కలిశారు.. బయటకొచ్చి ఏం మాట్లాడుతున్నారు?

సీఎం రేవంత్ రెడ్డి, టాలీవుడ్ కు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారట, దాన్ని ఛేజ్ చేస్తారట. అదీ సంగతి.

టికెట్ రేట్లు.. బెనిఫిట్ షోలు ఇంపార్టెంట్ కాదు..
సంక్రాంతి సినిమాలు, అనుమతులు చాలా చిన్న విషయం..
సీఎంతో మీటింగ్ తర్వాత బయటకొచ్చి దిల్ రాజు మాట్లాడిన మాటలివి..

ఓ రాష్ట్ర నాయకుడు ఢిల్లీకి వెళ్తాడు. పెద్దపెద్ద నేతల్ని కలుస్తాడు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, రావాల్సిన నిధులపై సుదీర్ఘంగా చర్చించానని చెబుతాడు. తర్వాత వాటి ప్రస్తావనే ఉండదు. నిజానికి లోపలు వాళ్లు మాట్లాడుకునేవి వేరు, బయటకొచ్చి మీడియాకు చెప్పేవి వేరు. ఇంకా చెప్పాలంటే, లోపల మాట్లాడిన మాటలకు, బయట ఇచ్చే స్టేట్ మెంట్స్ తో 90 శాతం సంబంధమే ఉండదు.

ఇప్పుడిదంతా ఎందుకంటే, ఈరోజ పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రిని కలిశారు. ఇంత హడావుడిగా, పనులన్నీ మానుకొని సీఎంను కలిసేందుకు వీళ్లు క్యూ కట్టారు. ఎందుకంటే, పరిస్థితి తీవ్రత అలాంటిది. ఓవైపు బన్నీ కేసు, మరోవైపు బెనిఫిట్ షోల వ్యవహారం, ఇంకోవైపు టికెట్ రేట్ల పెంపు.. ఇవి చాలా కీలకమైన అంశాలు.

మరి బయటకొచ్చిన తర్వాత మీడియాతో ఏం మాట్లాడారు. టికెట్ రేట్ల గురించి బెనిఫిట్ షోల గురించి, బన్నీ ఇష్యూ గురించి ఒక్క మాట లేదు. పైపెచ్చు టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు అస్సలు ఇంపార్టెంట్ మేటర్ కాదు, చిన్న పార్ట్ అంటూ తేల్చిపడేశారు తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు.

మరి ఇవి ఇంపార్టెంట్ కానప్పుడు లోపల ఏం మాట్లాడుకున్నారు? ఇండస్ట్రీని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై చర్చించారంట. ఈ విషయంలో ప్రభుత్వం-పరిశ్రమ కలిసి పనిచేస్తాయంట. హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు, హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా జరిగేలా సూచనలు ఇవ్వమని ముఖ్యమంత్రి కోరారంట. హైదరాబాద్ ను సినిమాల షూటింగ్స్ కు ఇంటర్నేషనల్ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం కలిసి పరిశ్రమ అడుగులు వేస్తుందంట. ప్రభుత్వం కోసం సమాజానికి ఉపయోగపడేవి, యువతకు పనికొచ్చేలా సహకారం కావాలని అడిగారు. మాదక ద్రవ్యాల నిరోధానికి హీరోలు ముందుకొచ్చి ప్రచారం చేస్తారు.

కొన్ని అనుకోని ఘటనల వల్ల ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చిందనే అపోహ బయట ఉందంట. దాన్ని తొలిగించేందుకు మాత్రమే ఎఫ్ డీ సీ ఛైర్మన్ హోదాలో దిల్ రాజు, ఈ మీటింగ్ పెట్టారంట. అంతకుమించి మరేం లేదనేది ఆయన మాట. సీఎం రేవంత్ రెడ్డి, టాలీవుడ్ కు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారట, దాన్ని ఛేజ్ చేస్తారట. అదీ సంగతి.

10 Replies to “ఎందుకు కలిశారు.. బయటకొచ్చి ఏం మాట్లాడుతున్నారు?”

  1. ఇప్పుడు కాపు కుల పెద్ద వచ్చి మీరు మీరు రెడ్లు కదా? మీరైనా చెప్పండి రాజు గారు అంటాడు… ఆ రెడ్డి వీళ్ళ యజమాని బ్యాగ్ మోసేటప్పుడు దొరికింది మర్చిపోయి.

  2. FDC కాబట్టి డెవలప్మెంట్ గురించే మాట్లాడారు..

    ఇతర సమస్యలు

    MAA అధ్యక్షుడు లేకుండా మాట్లాడుకోవడాలు ఉంటాయని ఎలా ఎలా అనుకుంటివి ‘ఎర్రి ఎంకిటి??

  3. ఏమి రా బాలరాజు. ఈ తెలుగు ఆక్టర్స్ వల్ల ఏమి రా ప్రయోజనం. జనాల డబ్బులు దొబ్బేయ్యటం,.. వాళ్ళని చంపెయ్యటం లేదా వాళ్ళని వికలాంగులని చెయ్యటం.

    ఈ OTT జమానాలో.. తెలుగు సినిమాలు కాకపోతే వేరే అంతర్జాతీయ భాషల్లో వున్నా సినిమాలో చూసి రిఫ్రెష్ అవుతాము.

  4. అయ్యా గ్యాస్ ఆంధ్ర

    వాళ్లు లోపల ఏం మాట్లాడుకున్నారు బయట ఏం మాట్లాడినారు అన్న సంగతి అది ప్రభుత్వానికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సినీ పరిశ్రమకు సంబంధించిన విషయం. మధ్యలో నీ పెదవి ఇరుపులు పుల్ల ఎరుపులు ఏంటట . అది నీకు సంబంధించిన విషయం అసలే కాదు. మరి ఏది కానప్పుడు మధ్యలో నీకెందుకు వచ్చిన ఈ గుద్ధ నొప్పి.? వాళ్లు వాళ్లు సవా లక్ష మాట్లాడుకుంటారు సవాలక్ష చేస్తారు. మధ్యలో నీ సొమ్మేం పోయేది ఏమీ లేదు వచ్చేది ఏమీ లేదు రెండు మూసుకొని ఉంటే మంచిది .

  5. Eeroju Eenadu paperlo Entho anubhavam unna Murlimohan cheppina maata chusthe aayanapi okarakamina jaali, alage ehyabhavam kaligindi. Telugu cinema antharjatiya sthayiki vellindi ani, videsi chitralaku poteega manam thiyyalante ticket dharalu ishta rajyamga penchukonenduku, adanapu showlaku anumathivvalani annaru. Vinema budget 500 kotlalo, hero parithoshikam 300 kotlu mariyu laabhallo vaata. Ippudu deenni gamanisthe ticket dharalu, adanapu showlu hero paarithoshikam kosam mariyu labhallo vata kosam. Idi avasarama Muralimohan garu. Ippati varaku meemeda unna gauravam kashtha potyindi. Chee.

  6. Eeroju Eenadu paperlo Entho anubhavam unna Murlimohan cheppina maata chusthe aayanapi okarakamina jaali, alage ehyabhavam kaligindi. Telugu cinema antharjatiya sthayiki vellindi ani, videsi chitralaku poteega manam thiyyalante ticket dharalu ishta rajyamga penchukonenduku, adanapu showlaku anumathivvalani annaru. Vinema budget 500 kotlalo, hero parithoshikam 300 kotlu mariyu laabhallo vaata. Ippudu deenni gamanisthe ticket dharalu, adanapu showlu hero paarithoshikam kosam mariyu labhallo vata kosam. Idi avasarama Muralimohan garu. Ippati varaku meemeda unna gauravam kashtha potyindi.

  7. Eeroju Eenadu paperlo Entho anubhavam unna Murli gaaru cheppina maata chusthe aayanapi okarakamina jaali, alage ehyabhavam kaligindi. Telugu cinema antharjatiya sthayiki vellindi ani, videsi chitralaku poteega manam thiyyalante ticket dharalu ishta rajyamga penchukonenduku, adanapu showlaku anumathivvalani annaru. Vinema budget 500 kotlalo, hero parithoshikam 300 kotlu mariyu laabhallo vaata. Ippudu deenni gamanisthe ticket dharalu, adanapu showlu hero paarithoshikam kosam mariyu labhallo vata kosam. Idi avasarama Murali garu. Ippati varaku meemeda unna gauravam kashtha potyindi.

Comments are closed.