ఎక్కడ తగ్గాలో తెలిసిన రాజకీయ నాయకులే ఆ రంగంలో రాణిస్తారు. ఒక్కోసారి తగ్గడం కూడా నెగ్గడమే. ఆ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని తప్పక అభినందించాలి. చిత్రపరిశ్రమతో ఎందుకంత తీవ్రస్థాయిలో రేవంత్‌రెడ్డి సర్కార్ వైరం పెట్టుకుందన్న భావన, బాధ కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపించింది. ఇదంతా టాలీవుడ్ టీ కప్పులో తుపానే అని చిత్ర పరిశ్రమ ప్రముఖులతో నేటి సీఎం భేటీ తేల్చి చెప్పడం విశేషం.
ఇటీవల తెలంగాణలో టాలీవుడ్, కాంగ్రెస్ సర్కార్ మధ్య చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయంగా అవాంఛనీయమన్న అభిప్రాయం అందరిలో వుంది. సినీ ప్రముఖుడు అక్కినేని నాగార్జున కుటుంబం, అలాగే హీరోయిన్ సమంతలపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర కామెంట్స్ చేసిన మొదలు, ఏదో ఒక ఘటన జరుగుతూనే వుంది. సంధ్య ధియేటర్ వద్ద పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాటలో ఒక తల్లి ప్రాణాలు కోల్పోవడం, ఆమె కుమారుడు మృత్యువుతో పోరాడుతున్న సంగతి తెలిసిందే.
ఈ ఘటన చినికిచినికి టాలీవుడ్ వర్సెస్ రేవంత్ సర్కార్ అనేలా తయారైంది. అసెంబ్లీ సమావేశాల్లో చిత్రపరిశ్రమ ప్రముఖులు, అలాగే అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదం మరింత ముదిరింది. అల్లు అర్జున్‌పై కేసు, అనంతరం బెయిల్ తదితర పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ సీఎంతో చిత్ర పరిశ్రమ ప్రముఖులు భేటీ కావడం ఆసక్తికర పరిణామం. ఇరుపక్షాలు కాస్త తగ్గి, నెగ్గాలనే భావన కనిపించడం శుభపరిణామం. టాలీవుడ్ మెప్పు పొందేలా సమావేశంలో రేవంత్‌రెడ్డి కీలక కామెంట్స్ చేసినట్టు తెలిసింది.
ఇటీవల వివాదానికి కేంద్ర బిందువైన అల్లు అర్జున్‌పై రేవంత్‌రెడ్డి పాజిటివ్‌గా మాట్లాడారు. అల్లు అర్జున్‌పై తనకు కోపం ఎందుకు వుంటుందని సీఎం ప్రశ్నించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కుమారుడైన హీరో రామ్‌చరణ్, అల్లు అర్జున్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, తనతో వాళ్లు తిరిగిన వాళ్లే అని చెప్పడంతో ఇరుపక్షాల మధ్య వాతావరణ చల్లబడినట్టైంది.
హాలీవుడ్, బాలీవుడ్ కూడా హైదరాబాద్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ అన్నారు. కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ అని సీఎం అన్నారు. చిత్రపరిశ్రమను మరోస్థాయికి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పి, అందరి మనసుల్ని ఆయన చూరగొన్నారు. సినీ పరిశ్రమకు ఏది చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయని, ఆ వారసత్వాన్ని తాము కొనసాగిస్తామని చిత్రపరిశ్రమ పెద్దలకు పెద్ద ఊరట ఇచ్చారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయించామని రేవంత్ అనడంతో ఆ పరిశ్రమ పెద్దల్లో సంతోషం కనిపించింది.
ఐటీ, ఫార్మా పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమ కూడా తమ ప్రభుత్వానికి ముఖ్యమే అన్నారు. ఇలా ప్రతి మాట తన ప్రభుత్వంపై అపోహలను తొలగించుకునేలా రేవంత్‌రెడ్డి మాట్లాడ్డం విశేషం.
తగ్గకపోతే 2028 లో తెలంగాణ ప్రజలే తగ్గిస్తారు.
CM overreacted in the matter. When the case is under investigation, such over reaction will influence the Police. In such a case free and fair investigation may not take place.
రేవంత రెడ్డి ని కాదు రెస్పెక్ట్ ఇవ్వక పోతే రేవు పెట్టే రెడ్ది ని అని నిరూపించు కున్న మొట్ట మొదటి ముఖ్యమంత్రి గా చరిత్ర లో నిలిచి పోతాడు. ఆనాడు అన్న ఎన్టీఆర్ తర్వాత ఆత్మభిమానం కోసం ఇంతలా తెగించే సీఎం మధ్యలో ఎవరూ రాలేదు.
Boke bokka