రేవంత్ వైపు నిలిచిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

హైద‌రాబాద్ సంధ్య థియేట‌ర్ వ‌ద్ద దుర్ఘ‌ట‌న‌కు సంబంధించి డిప్యూటీ సీఎం, టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌న‌సులో బ‌య‌ట ప‌డింది.

హైద‌రాబాద్ సంధ్య థియేట‌ర్ వ‌ద్ద దుర్ఘ‌ట‌న‌కు సంబంధించి డిప్యూటీ సీఎం, టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌న‌సులో బ‌య‌ట ప‌డింది. ఈ విష‌యంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వైపే ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిలిచారు. మీడియాతో సోమ‌వారం నిర్వ‌హించిన చిట్‌చాట్‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ రేవంత్‌ను గొప్ప నాయ‌కుడిగా అభివ‌ర్ణించారు. గోటితో పోయే దానికి గొడ్డ‌లి వ‌ర‌కు తెచ్చార‌ని ప‌రోక్షంగా అల్లు అర్జున్‌ను త‌ప్పు ప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా సినిమా రంగాన్ని ప్రోత్స‌హించ‌డంలో ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వానితో రేవంత్‌రెడ్డి స‌ర్కార్‌ను పోల్చారు. వైసీపీ ప్ర‌భుత్వం మాదిరిగా సినిమా వాళ్ల విష‌యంలో రేవంత్ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని వెన‌కేసుకొచ్చారు. తెలంగాణ‌లో బెనిఫిట్ షోలు, టికెట్ల ధ‌ర‌ల పెంపున‌కు అవ‌కాశం ఇచ్చార‌ని ప్ర‌శంసించారు. సంధ్య థియేట‌ర్ దుర్ఘ‌ట‌న‌తో బెనిఫిట్ షోలకు అనుమ‌తి ఇచ్చేది లేద‌ని అసెంబ్లీ వేదిక‌గా రేవంత్ తేల్చి చెప్ప‌డంపై మాత్రం ప‌వ‌న్ నోరు మెద‌ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అల్లు అర్జున్ విషయంలో ముందూ, వెనుక ఏం జరిగిందో తనకు తెలియదని ప‌వ‌న్ అన‌డం గ‌మ‌నార్హం. మ‌రి గోటితో పోయే దానికి గొడ్డ‌లి వ‌ర‌కు తెచ్చుకున్నార‌ని ఎందుకు అన్నారో ఆయ‌న‌కే తెలియాలి. సినిమాల‌కు చిరంజీవి త‌న‌ను ఎవ‌రూ గుర్తించ‌కుండా ముసుగు వేసుకుని వెళ్లేవార‌ని, తాను కూడా అదే అనుస‌రించిన‌ట్టు ప‌వ‌న్ తెలిపారు. చ‌ట్టం అంద‌రికీ స‌మాన‌మ‌న్నారు. బ‌న్నీ స్థానంలో రేవంత్‌రెడ్డి ఉన్నా పోలీసులు అరెస్ట్ చేసేవార‌న్నారు. పోలీసుల‌ను తాను త‌ప్పు ప‌ట్ట‌లేనన్నారు.

అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ప‌రామ‌ర్శించి వుంటే బాగుండేద‌న్నారు. మాన‌వీయ కోణం లోపించిన‌ట్టు క‌నిపిస్తోంద‌న్నారు. సినిమా చూడ‌డానికి వెళ్లి తొక్కిస‌లాట‌లో రేవతి చనిపోవడం త‌న‌ను కలచి వేసిన‌ట్టు ప‌వ‌న్ తెలిపారు. సినిమా అంటే టీం వ‌ర్క్ అని, అందరూ బాధ్య‌త వ‌హించాల‌న్నారు. కానీ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారన్నారు.

మృతురాలి కుటుంబంపై పుష్ప టీమ్ నుంచి స‌రైన భ‌రోసా లేక‌పోవ‌డంపై ప్ర‌జ‌ల్లో కోపం వ‌చ్చింద‌న్నారు. త‌న‌పై ప్ర‌జ‌లు విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం వుంద‌నే కార‌ణంతో రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో రియాక్ట్ అయ్యార‌న్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పేరు బ‌న్నీ చెప్ప‌క‌పోవ‌డం వ‌ల్లే క‌క్ష క‌ట్టి చేశార‌ని తాను భావించ‌డం లేద‌ని ప‌వ‌న్ అన్నారు. రేవంత్‌రెడ్డి వీట‌న్నింటిని అధిగ‌మించిన బ‌ల‌మైన నాయ‌కుడ‌ని వెన‌కేసుకొచ్చారు.

16 Replies to “రేవంత్ వైపు నిలిచిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌”

  1. పవన్ ఎవరి పైపూ నిల్చొలెదు! నువ్వు English ఎడిషన్ లొ ఒకలా, తెలుగు లొ మరొలా రాస్తావు ఎమిటిరా బాబు!

    జగన్ అన్న English మీడియం షూక్ లొ చదువుకున్నవా?

  2. GA డిదా గాడిద లాగే రాస్తుంది అనీ మరొకసారి నిరూపించావ్. GAడిదా…..

  3. ఒక మనిషి చనిపోయిన భాద అర్జున్ మాట్లలో, హావ భావాలు లో ఎక్కడ కూడా సామాన్య జనాలకి కనిపించలేదు.అందుకే తటస్థ గా వుండే వారుంకుడ అతనికి వ్యతిరేకం అయ్యారు.

    ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ఎలా బిహేవ్ చేస్తునన్ముననేదే చాలా ముఖ్యం

    అందుకే అందరూ అంట డబ్బు పెట్టీ PR team ను పెట్టుకునేదు.

  4. వీడి ఆర్మీ, వీడి ఫ్యాన్ లు, వీడి ని, మడిచి సిఎం రేవంత్ రెడ్డి గారు, మూల కూర్చో బెట్టడు .

Comments are closed.