జగన్ జిల్లాల యాత్ర వాయిదా పడుతుందా?

ప్రస్తుతానికి 8వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది. అయితే.. ఆయనకు అనుమతి వచ్చే అవకాశమే ఎక్కువ అని నిపుణులు అంటున్నారు.

ప్రభుత్వం ఎక్కడ విఫలమవుతున్నదో ప్రతి సందర్భంలోనూ తనకు తోచిన రీతిలో ఆ పాయింట్‌ను లేవనెత్తి, ప్రభుత్వాన్ని విమర్శించడానికి వైఎస్ జగన్మోహనరెడ్డి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రజల మధ్యలో ఉండి చేయవలసిన పోరాటాలకు ఇంకా ఆయన సన్నద్ధంగా లేరు. మెజారిటీ ఆయన విమర్శలన్నీ ఎక్స్ వేదికమీదే వ్యక్తమవుతున్నాయి. కొన్నిసార్లు ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు.

కాకపోతే.. సంక్రాంతి నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని.. ప్రతి వారంలో రెండు రోజుల పాటు ఒక్కో జిల్లాలో ఉంటూ అక్కడ కార్యకర్తలను కలుస్తూ, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రభుత్వం మీద పోరాడతానని జగన్ ప్రకటించారు. ఇప్పుడు చూడబోతే.. జగన్ జిల్లాల యాత్ర మరికొంత కాలం వాయిదా పడేలా కనిపిస్తోంది.

ఈ నెల 11 నుంచి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా విదేశీ యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. రెండు వారాల పాటు విదేశాల్లో పర్యటించేందుకు ఆయన సీబీఐ కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. అంతా ఆయన అనుకున్నట్టుగా జరిగితే.. అనుమతులు వస్తే.. ఈనెల 25వ తేదీ వరకు జగన్ భారత్‌లో ఉండే అవకాశమే లేదు. ఆ తర్వాత విదేశాల నుంచి తిరిగి వచ్చినప్పటికీ.. వచ్చిన వెంటనే జిల్లాలకు వెళ్లడం కుదరకపోవచ్చు. ఎటు చూసినా సరే.. జగన్ జిల్లాల యాత్ర ఈ నెలలో జరిగే వ్యవహారం కాదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

జగన్ జిల్లాల యాత్ర పట్ల పార్టీలో చాలా ఆశలున్నాయి. సంక్రాంతి తర్వాత ప్రభుత్వం మీద పోరాటం చేయడంలో పార్టీకి కొత్త జోష్ వస్తుందని కూడా కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. జగన్ పట్ల వ్యతిరేకతతో ఉన్న నాయకులు కొందరు.. జిల్లా యాత్రలు మొదలయ్యాక అందులో యాక్టివ్ రోల్ తీసుకోవడం ఇష్టం లేక ముందుగానే పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడం కూడా జరిగింది. జగన్ సంక్రాంతి నుంచి జిల్లాలకు వస్తారని ఎదురుచూస్తుండగా.. ఆయన విదేశీ యాత్ర సంగతి తెరపైకి వచ్చింది.

జగన్ కుమార్తె గ్రాడ్యుయేషన్ వేడుక ఈనెల 16న లండన్‌లో జరగనుందని, అందుకు వెళ్లేందుకు అనుమతించాలని జగన్ సీబీఐ కోర్టును కోరారు. రెండు వారాల పర్యటనకు అనుమతి అడిగారు. అయితే అనుమతి ఇవ్వవద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది. జగన్ కేసుల విచారణ ఆలస్యం అవుతున్నదని చెప్పింది. అయితే ఆలస్యం కావడానికి జగన్ ఎన్నడూ కారణం కాదని ఆయన న్యాయవాదులు అంటున్నారు.

ప్రస్తుతానికి 8వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది. అయితే.. ఆయనకు అనుమతి వచ్చే అవకాశమే ఎక్కువ అని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితులను బట్టి చూస్తే.. జగన్ జిల్లాల యాత్ర ఫిబ్రవరికి వాయిదా పడవచ్చునని అనుకుంటున్నారు.

16 Replies to “జగన్ జిల్లాల యాత్ర వాయిదా పడుతుందా?”

  1. ఒక వైపు కూటమి మీద వ్యతిరేకత ఎక్కువ అయిపోయింది అంటారు….ఇంకో వైపు అన్నేమో యాత్ర రేపు అంటున్నారు….అవును అప్పుడెప్పుడో కార్యకర్తలను జనవరి లో కలుస్తాను అని చెప్పిఅంట్టు గుర్తు…జనవరి వచ్చింది ఇప్పటికి ఒక దీక్ష ఇంకో యాత్ర వాయిదా పడ్డాయి ….

    1. కార్యకర్తలకే జగన్ రెడ్డి ని కలవడం ఇంటరెస్ట్ లేదు ఇప్పుడు.. జగన్ రెడ్డి అప్పోయింట్మెంట్ అడిగాడు .. కానీ వాళ్ళు ఇంకా డిసైడ్ చేసుకోలేదు..

      ఈ మధ్య పులివెందుల లో ఇలానే కలిసి తాట వలిచేబోయారు.. దెబ్బకు బెంగుళూరు పారిపోయాడు సన్నాసి..

  2. ఈ లోపు ఆంధ్ర లో ఒక శవం దొరికితే.. లండన్ ట్రిప్ కాన్సల్ చేసుకుని.. శవ రాజకీయం చేస్తాడు..

    పాపం… శవాలు దొరక్క రాజకీయానికి రెస్ట్ ఇచ్చి.. కూతురు డ్రామా అంటూ దేశం వదిలి పారిపోతున్నాడు..

    1. Bro nee peru chala kalam yadikuntadi. Asalu greatandhra article veyyadam late nee comment untundi.ee article lo ayina Jagan tittadamena nee pani. Nee patience ki hatts off bro

  3. ఇది కూడా మావోడిలా దొంగ లా “కొట్టుకొచ్చిన question పేపర్స్ తో” గ్రాడ్యుయేషన్ చేసినట్టుంది..

    అయినా ఎన్నిసార్లు ఈ గ్రాడ్యుయేషన్ డ్రామాలు ఆడుతార్రా??

  4. ఇది కూడా మావోడి మాదిరి దొ0గ లా “కొట్టుకొచ్చిన question పేపర్స్ తో” గ్రాడ్యుయేషన్ చేసినట్టుంది..

    అయినా ఎన్నిసార్లు ఈ గ్రాడ్యుయేషన్ డ్రామాలు ఆడుతార్రా??

  5. areay pacha prathivrathalara , how many times u r china babu went US . Elections ki before ekadi ki velladu , evri evari ni kalisadu , evm ela tampering jarigindhi , entha cost iendhi. eay lekhalu telchada ni ki ra jagan london veltundhi . get ready for beat the music on face . Lafots TDP .

  6. “లండన్ ప్యాలెస్ లో కులకాలని అనిపించినప్పుడేల్లా” కూతురు గ్రాడ్యుయేషన్ అంటూ కోర్టు లో బొంకి Passport తెచ్చుకుంటాడు..

Comments are closed.