తిరుప‌తిలో త‌ప్పెవ‌రిది? శిక్ష ఎవ‌రికి?

టీటీడీ పాల‌క మండ‌లి, ఉన్న‌తాధికారులు ప్ర‌క్షాళ‌న పేరుతో భ‌క్షాళ‌న చేశార‌నే విమ‌ర్శ‌కు బ‌లం క‌లిగించేలా దుర్ఘ‌ట‌న మ‌చ్చ‌గా మిగిలింది.

తిరుప‌తిలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం టికెట్ల కోసం జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఆరుగురు మృతి చెంద‌గా, ప‌దుల సంఖ్య‌లో గాయ‌ప‌డ్డారు. త‌ప్పు ఎవ‌రో చేస్తే, శిక్ష సామాన్యుల‌కా? అని భ‌క్తులు ఆవేద‌న‌తో ప్ర‌శ్నిస్తున్నారు. ఈ దుర్ఘ‌ట‌న‌లో అడుగ‌డుగునా టీటీడీ, పోలీసుశాఖ‌ల త‌ప్పులే క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీపై అక్క‌సుతో మంచి విధానాన్ని కాద‌నుకోవ‌డం వ‌ల్లే భ‌క్తుల‌కు తీర‌ని శోకాన్ని మిగిల్చార‌ని ప‌లువురు అంటున్నారు.

వైసీపీ హ‌యాంలో శ్రీ‌వారిని వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకోడానికి ల‌క్ష‌ల సంఖ్య‌లో సామాన్య భ‌క్తుల‌కు అవ‌కాశం క‌ల్పించింది. అయితే ప‌ది రోజుల కోసం ఒకేసారి టోకెన్ల‌ను జారీ చేసేది. దీంతో తాము కోరుకున్న తేదీలో కాక‌పోయినా, ఆ ప‌ది రోజుల్లో ఏదో ఒక స‌మ‌యంలో ద‌ర్శ‌న భాగ్యం దొరికితే భ‌క్తులు అమితానందం పొందేవాళ్లు.

అయితే టీటీడీ పాల‌క మండ‌లి, ఉన్న‌తాధికారులు ప్ర‌క్షాళ‌న పేరుతో భ‌క్షాళ‌న చేశార‌నే విమ‌ర్శ‌కు బ‌లం క‌లిగించేలా దుర్ఘ‌ట‌న మ‌చ్చ‌గా మిగిలింది. ఒక్కోసారి కేవ‌లం రెండు లేదా మూడు రోజుల‌కు మాత్ర‌మే ద‌ర్శ‌నానికి టోకెన్లు ఇస్తామ‌ని టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఉన్న‌తాధికారులు చెప్పారు. ఇక్క‌డే స‌మ‌స్యకు బీజం ప‌డింది.

దీంతో ఒక్క‌సారిగా భ‌క్తులు వెల్లువెత్తారు. ఒక‌సారి ద‌ర్శ‌నం టోకెన్లు ద‌క్క‌క‌పోతే, మ‌ళ్లీమ‌ళ్లీ క్యూలైన్ల‌లో నిల‌బ‌డాల్సిన దుస్థితిని భ‌క్తుల‌కు టీటీడీ క‌ల్పించింది. ప్ర‌క్షాళ‌న అంటే భ‌క్తుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించాల‌నే స్పృహ‌ను టీటీడీ కోల్పోయింద‌నేందుకు ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏముంటుంది? ప‌ది రోజుల్లో ఏదో ఒక‌రోజు ద‌ర్శ‌నానికి అవ‌కాశం క‌ల్పించి వుంటే, ఈ దుర్ఘ‌ట‌న సంభ‌వించేది కాదు. కానీ టీటీడీ పిచ్చి నిర్ణ‌యంతో ఎక్క‌డెక్క‌డి నుంచి వ‌చ్చినోళ్లు, ఇప్పుడు కాక‌పోతే, మ‌ళ్లీమ‌ళ్లీ రాలేమ‌న్న భ‌యం సృష్టించి, క్యూలైన్ల‌లో తోపులాడుకునే ప‌రిస్థితిని క‌ల్పించారు. చివ‌రికి సామాన్య భ‌క్తులు బ‌ల‌య్యారు.

11 Replies to “తిరుప‌తిలో త‌ప్పెవ‌రిది? శిక్ష ఎవ‌రికి?”

    1. బోటు దుర్ఘటన మర్చిపోయావా, రథం తగలబెట్టింది మర్చిపోయావా రాముడి విగ్రహం ఘటన మర్చిపోయావా డాక్టర్ సుధాకర్ మర్చిపోయావా..స్పెషల్ గా జ.గ్గు మీదకి ఎందుకు.. ఆల్రెడీ ఎవరు టచ్ చేయలేని రికార్డు ఉంది వాడికి

      1. అవునా .. ఇన్ని జరిగాయా. .మరెందుకు కేసు పెట్టలేదు.. ? అప్పుడెప్పుడో .. ట్విట్టర్ లో రెట్టేత్తారని అరెస్ట్ చేసి జైలు లో ఎంతో మందిని పెట్టారు.. మరెందుకు ఇప్పుడు అరెస్ట్ చెయ్యలేదు?

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. శవాల పార్టీ కి శవం దొరికింది వైజాగ్ లో కూటమి తెచ్చిన పెట్టుబడులు అంశం ప్రజల ద్రుష్టి మరల్చటానికి చనిపోయిన వాళ్ళను వాడుకోవటాన్ని చూస్తే అసహ్యమేస్తుంది అందులో ఏమైనా కుట్ర ఉంటే చూడాలి ఉంటే శిక్షించాలి దర్యాప్తు తక్షణం వేగం గ జరగాలి వివేకా గారి హత్య కేసు లాగా జరగకూడదు

  3. ఈ దుర్ఘటన జరగటం మన గ్రేట్ ఆంధ్రాకి చాల ఆనందం గ ఉన్నట్టు వుంది రాష్ట్రానికి మేలి మలుపు లాంటి విశాఖలో మోడీ గారి సభ గురించి ఒక్క ముక్క కూడా రాయలేదు కానీ అనుకోని దుర్ఘటన చంద్రబాబు గారు పవన్ గారు చేయించినట్టు రాస్తున్నావు ఆనంద పడుతున్నావు ఇలాంటి దుర్ఘటనలు ఇది మొదటిది కాదు చివరిది కాదు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న కొన్ని సార్లు అవాంతరాలు వస్తాయి

Comments are closed.