ఇక్కడ కేసుల్లో ఉన్న సంస్థకే అక్కడ పవన్ భజన!

గ్రీన్ కో సంస్థను పవన్ ఆకాశానికెత్తేస్తున్నారు. మరి అక్కడ తెరవెనుక ఎలాంటి వ్యవహారాలు ఉన్నాయో ప్రజలకు అర్థం కావడం లేదు.

ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం నాడు కర్నూలు జిల్లాలో పర్యటించారు. అక్కడి అతిపెద్ద గ్రీన్ కో సోలార్ పార్క్ పంప్ స్టోరేజి ప్రాజెక్టును చూశారు. ఏరియల్ వ్యూ ద్వారా అధికారులతో కలిసి చూసిన తర్వాత.. రోడ్డు మార్గంలో కూడా ప్రాజెక్టు పరిశీలించారు. మీడియాతో కూడా మాట్లాడారు. మీడియాతో ముచ్చట్లలో గ్రీన్ కో సంస్థను ఆకాశానికెత్తేస్తూ.. వారు విద్యుదుత్పత్తి రంగంలో అద్భుతాలు చేస్తున్నట్టుగా పవన్ కల్యాణ్ భజన చేయడం ఇక్కడ గమనార్హం.

నిజానికి గ్రీన్ కో సంస్థ తమ ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో కొంత విస్తీర్ణం విషయంలో ఇంకా వివాదాలు నడుస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సాక్షాత్తూ డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రాజెక్టు విజిట్ చేసి ఆ సంస్థను భజన చేయడం విశేషమే.

గ్రీన్ కో సంస్థ సారథి సునీల్ ఒకప్పట్లో పవన్ కల్యాణ్ కు సన్నిహితుడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎంపీ ఎన్నికల్లో దిగి భంగపడ్డారు కూడా. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ హఠాత్తుగా ఆ గ్రీన్ కో ప్రాజెక్టును సందర్శించి.. అంత బీభత్సంగా భజన చేయడం వెనుక పరమార్థం అర్థం కావడం లేదు. ‘ఈ ప్రాజెక్టు ఒక అద్భుతం అని.. భవిష్యత్తుల్లో ఇది పర్యాటక ప్రాంతం అవుతుందని.. దేశం రూపురేఖలే మారిపోతాయని.. యాభైవేల మందికి ఉద్యోగాలు వస్తాయని..’ ఇలా రకరకాలుగా పవన్ కల్యాణ్ కీర్తించారు.

అయితే ఇంత గొప్పగా తక్కువ ఖర్చుతో విద్యుత్తు తయారుచేసే ప్రాజెక్టు పెట్టడం వలన ప్రజలకు ఏం ఒరుగుతోంది? రాష్ట్రానికి ఆయన తక్కువ ధరకు ఏమైనా విద్యుత్తు ఇవ్వబోతున్నారా? ఆ మేరకు వారి వలన ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది.. లాంటి మాటలు మాత్రం పవన్ నోటినుంచి బయటకు రాలేదు.

వైసీపీ నాయకుడికి చెందిన ఒక ప్రాజెక్టును పవన్ కల్యాణ్ స్వయంగా విజిట్ చేసి ఈ స్థాయిలో పొగడడం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయి. సునీల్, జగన్ కోటరీలోంచి ఇప్పుడు తన మనిషిగా మారిపోయాడని సంకేతాలు ఇవ్వడానికే ఇలా చేశారా? లేదా.. ఆ సంస్థ ఇంకా భూవివాదాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పవన్ తాను స్వయంగా పొగిడితే.. అధికార యంత్రాంగాలు సంస్థకు అనుకూలంగా వ్యవహరించి.. తను చెప్పవలసిన అవసరం లేకుండానే వారికి మేలు చేయాలని కోరుకుంటున్నారా? అనేది అర్థం కావడం లేదు. పైగా .. ఈ భూవివాదాల్ని పరిష్కరించాలని ఆల్రెడీ కేంద్రానికి విన్నవించినట్టుగా కూడా పవన్ చెబుతున్నారు.

ఈ వ్యవహారంలో ఇంకో ట్విస్టు ఉంది. తెలంగాణలో కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ ఎదుర్కొంటున్న కేసులు- విచారణ గురించి అందరికీ తెలుసు. ఇక్కడ తెలంగాణలో.. క్విడ్ ప్రోకో ద్వారా.. 41 కోట్ల రూపాయల ముడుపులు భారాసకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇచ్చినట్టుగా గ్రీన్ కో సంస్థ ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటోంది. అదే గ్రీన్ కో సంస్థను పవన్ ఆకాశానికెత్తేస్తున్నారు. మరి అక్కడ తెరవెనుక ఎలాంటి వ్యవహారాలు ఉన్నాయో ప్రజలకు అర్థం కావడం లేదు.

6 Replies to “ఇక్కడ కేసుల్లో ఉన్న సంస్థకే అక్కడ పవన్ భజన!”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. Blackmail politics by Mr. Pawan Kalyan garu. This timing of the statement on Greenko and Mr. Pawan statement highlighting the project that was started during Jagan’s ruling was to blackmail TDP leaders and most importantly B.R. Naidu forcing them to come to terms. This was done as a counter to the statements made by some TDP leaders belittling Pawan Kalyan garu and his importance in the kootami government.

    Good strategy but beware Pawan garu that your strategy might not work in the long term and might project Jagan as a hero and also distance your party from alliance.

Comments are closed.