ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ మ‌హిళా మంత్రి

రోడ్డు ప్ర‌మాదం నుంచి క‌ర్నాట‌క మ‌హిళా మంత్రి ల‌క్ష్మి హెబ్బాళ్క‌ర్ బ‌య‌ట‌ప‌డ్డారు.

రోడ్డు ప్ర‌మాదం నుంచి క‌ర్నాట‌క మ‌హిళా మంత్రి ల‌క్ష్మి హెబ్బాళ్క‌ర్ బ‌య‌ట‌ప‌డ్డారు. మంత్రి కుమారుడు మృణాళ్ హెబ్బాళ్క‌ర్ వెల్ల‌డించిన వివ‌రాలిలా ఉన్నాయి. మ‌హిళా, శిశుసంక్షేమ‌శాఖ మంత్రిగా ల‌క్ష్మి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. త‌న సోద‌రుడు, ఎమ్మెల్సీ అయిన చెన్న‌రాజ్ హ‌త్తిహోళితో క‌లిసి కారులో వెళుతుండ‌గా బెళ‌గావి వ‌ద్ద చెట్టును కారు బ‌లంగా ఢీకొంది.

ఈ ఘ‌ట‌న‌లో అదృష్ట‌త‌శాత్తు ఎవ‌రికీ ప్రాణాపాయం జ‌ర‌గ‌లేదు. మంత్రి ముఖానికి, వెన్నెముక‌కు గాయాల‌య్యాయి. అలాగే ఆమె సోద‌రుడి త‌ల‌కు గాయాల‌య్యాయి. వీధికుక్క‌ను త‌ప్పించ‌బోతుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. మంత్రితో పాటు ఆమె సోద‌రుడిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు.

పెద్ద ప్ర‌మాదం నుంచి మంత్రి, ఆమె సోద‌రుడు బ‌య‌ట‌ప‌డ‌డంతో కుటుంబ స‌భ్యుల‌తో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. బెళ‌గావి రూర‌ల్ నుంచి ల‌క్ష్మి 2018, 2023 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున గెలుపొందారు. ప్ర‌స్తుతం సిద్ధ‌రామ‌య్య కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్నారు.

One Reply to “ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ మ‌హిళా మంత్రి”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.