తిరుమ‌ల‌లో త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ

తిరుప‌తిలో తొక్కిస‌లాట ఎఫెక్టో, లేక మ‌రే కార‌ణ‌మో తెలియ‌దు కానీ, భ‌క్తుల ర‌ద్దీ బాగా త‌గ్గింది

తిరుప‌తిలో తొక్కిస‌లాట ఎఫెక్టో, లేక మ‌రే కార‌ణ‌మో తెలియ‌దు కానీ, భ‌క్తుల ర‌ద్దీ బాగా త‌గ్గింది. ప్ర‌స్తుతం వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల స‌మ‌యం. స‌హ‌జంగా భ‌క్తులు ఈ స‌మ‌యంలో క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకోవాల‌ని కోరుకుంటారు. అందుకే ద‌ర్శ‌న టోకెన్ల కోసం పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లిరావ‌డం, ఏర్పాట్ల‌లో త‌ప్పులు దొర్ల‌డంతో కొంద‌రు ప్రాణాలు కోల్పోవాల్సి వ‌చ్చింది. మ‌రికొంద‌రు గాయాల‌బారిన ప‌డ్డారు.

ఈ నేప‌థ్యంలో శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తిరుమ‌ల‌లో భ‌క్తులు పెరిగితే వార్త కాదు, ఎందుకంటే, తిరుమ‌ల‌లో నిత్యం భ‌క్తుల ర‌ద్దీ వుంటుంది. త‌గ్గితేనే వార్త‌. ప్ర‌స్తుతం భ‌క్తుల ర‌ద్దీ త‌గ్గ‌డంతో ద‌ర్శ‌నం త్వ‌ర‌గా అవుతున్న‌ట్టు తెలిసింది.

తిరుమ‌ల ద‌ర్శ‌నానికి పోయి ప్రాణాలు పోగొట్టుకుంటామ‌నే భ‌యాన్ని సృష్టించార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే తిరుమ‌ల‌కు గ‌తంలో మాదిరిగా భ‌క్తులు వెళ్ల‌డం త‌గ్గిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వైకుంఠ ద్వార ద‌ర్శ‌న స‌మ‌యంలో తిరుమ‌ల‌లో భ‌క్తులు పోటెత్తుతుంటారు. ఎప్పుడూ లేని విధంగా, ప్ర‌స్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా భ‌క్తుల సంఖ్య త‌గ్గ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

6 Replies to “తిరుమ‌ల‌లో త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ”

  1. A1అదిదంపతులు తాడేపల్లి

    “ప్యాలెస్ లో తిరుమల సెట్టింగ్” వేసి సంక్రాతి పండగ చేస్తూ

    “పందికొవ్వు కలిపిన ప్రసాదం పంచుతుంటే జనాలందరూ తిరుమలకి కాకుండా అటు వైపు పోయారట..

  2. నీ మొఖం… ఇది సంక్రాంతి సీజన్ అందుకే జనాలు తగ్గారు దర్శనం రద్దీ తగ్గింది… ఇది ప్రతి ఇయర్ ఉండేదే…

  3. కలియుగ ప్రత్యక్ష దైవం స్వామీ వారి వైభవం ముందు ఎన్ని ప్రచారాలు చేసినా కోటాను కోట్ల భక్తులు ఎల్లవేళలా తరలి వస్తూనే ఉంటారు…. ఈ సంఘటనలు టీ కప్పులో తుఫాను మాదిరి

  4. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.