చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం
రేటింగ్: 2.75/5
తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, సాయికుమార్, నరేష్, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి తదితరులు
కెమెరా: సమీర్ రెడ్డి
ఎడిటింగ్: తమ్మిరాజు
సంగీతం: భీంస్ సిసిరీలియో
నిర్మాత: దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం: అనీల్ రావిపూడి
విడుదల: 14 జనవరి 2025
సంక్రాంతిని టార్గెట్ చేసుకుని, పూర్తి పండగ ఎంటర్టైనర్ గా ప్రచారం చేసి, ఫ్యామిలీ ఆడియన్స్ ని తనవైపుకి తిప్పుకున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ట్రైలర్ ఆకట్టుకుంది. ఒక పాట విడుదలకి ముందే సూపర్ హిట్ అయ్యింది. వెంకటేష్-అనీల్ రావిపూడి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు ఏది ఆశిస్తారో అది ఈ చిత్రంలో ఎంత వరకు ఉందో చూద్దాం.
యాదగిరి దామోదర రాజు (వెంకటేష్) సస్పెన్షన్ కి గురైన ఒక పోలీసాఫీసర్. సస్పెండైన మూడు నెలలకే భాగ్యం (ఐశ్వర్య రాజేష్) ని పెళ్లి చేసుకుని ఆరేళ్లల్లో నలుగురు పిల్లల్ని కని ఒక పల్లెటూరిలో ఇల్లరికం అల్లుడిగా కాలం గడిపేస్తుంటాడు. ఇదిలా ఉంటే దేశం గర్వించదగ్గ ఒక గొప్ప పారిశ్రామికవేత్త ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్) హైదరాబాద్ వస్తాడు. సీఎం (నరేష్) అతనిని స్వాగతిస్తాడు. కానీ అనూహ్యంగా అతనిని ఒక ముఠా కిడ్నాప్ చేస్తుంది. విడిపించడానికి రాజు ఒక్కడే సమర్ధుడని ఐజీ (శ్రీనివాస్ వడ్లమాని) చెప్తాడు. దాంతో అతనిని తీసుకురావడానికి ఐజీతో పాటు రాజు మాజీ ప్రేయసి, మరొక పోలీసాఫీసర్ మీనాక్షి (మీనాక్షి చౌదరి) రాజుని ఈ మిషన్ కి ఒప్పించడానికి వెళ్తుంది. అలా భాగ్యం- రాజు మధ్యకి మీనాక్షి రావడంతో ఏమయ్యింది? రాజు మిషన్ కి ఒప్పుకున్నాడా? ఆ తర్వాత జరిగేదేంటి అనేది తెరపై చూడడమే.
కథగా చూస్తే దీనిని సీరియస్ యాక్షన్ ఫిల్మ్ గానూ తీయొచ్చు, సెంటిమెంటల్ గానూ తెరకెక్కించవచ్చు, లేదా కామెడీ జానర్లో సిల్లీగానూ తీయొచ్చు. దర్శకుడు మూడో పద్ధతిని ఎంచుకున్నాడు. ఇందులో ఏ పాత్రా సీరియస్ గా ప్రవర్తించదు. అన్నీ సిల్లీగానే ఉంటాయి. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఫ్యామిలీ డాక్టర్, కిడ్నాపర్లు, హీరోయిన్, హీరో.. ఇలా అందరూ లైటర్ వేన్ లోనే ప్రవర్తిస్తుంటారు. లాజిక్కులు గట్రా వెతక్కుండా ఒక జబర్దస్త్ స్కిట్ చూస్తున్న మూడ్ లో చూసేస్తే బాగానే ఉంటుంది. అయితే అనీల్-వెంకీ కాంబోలో ఎఫ్-2, ఎఫ్-3 లాంటివి చూసాక ఇది ఆ స్థాయిలో లేదని మాత్రం అనిపిస్తుంది. సినిమాలో మందహాసాలే తప్ప పగలబడి నవ్వుకునే సందర్భాలు తక్కువ.
పల్లెటూరు, చీరకట్టు హీరోయిన్, కుటుంబం-పిల్లలు, భార్యాభర్తల రొమాన్స్, మధ్యలో ఒక సవతిలాంటి పాత్ర రావడం, భార్య ఉడుక్కోవడం, భర్త ఆ ఇద్దరి మధ్య నలగడం.. ఇవన్నీ సగటు మధ్యతరగతి ఫ్యామిలీ లేడీస్ కి నచ్చే సదరు టీవీ సీరియల్ బాపతు సరంజామా. అవన్నీ ఉండడం సంక్రాంతి సినిమాకి అవసరం. అప్పుడే ఫ్యామిలీస్ హాలుకొచ్చి పండగ సినిమా చూసేది.. అనే ఫార్ములాని పట్టుకుని తీసిన చిత్రమిది. దాంతో పాటూ ఒక కిడ్నాప్ కథ, యాక్షన్ కూడా జతచేసి.. ఎక్కడా సీరియస్నెస్ లేకుండా మొత్తం కామెడీ స్కిట్ లాగ నడిపించేయడం జరిగింది.
టెక్నికల్ గా చూస్తే నిర్మాణవిలువలు ఎంతవరకు అవసరమో అంతవరకు ఉన్నాయి. తెరమీద ఎక్కడా వృధా ఖర్చు కనిపించలేదు. భీంస్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం, పాటలు రెండూ రక్తి కట్టించాయి. “గోదారి గట్టుమీద..” ఒక్కటే బాగా గుర్తుంటుంది. “బ్లాక్ బస్టర్ పొంగల్” ఓకే. కెమెరా, ఎడిటింగ్ అన్నీ సమర్ధవంతంగా పనిచేసాయి.
అయితే రైటింగులోనే అవకతవకలు చాలా ఉన్నాయి. కథంతా అయ్యాక గురువుగారి ట్రాక్ పెట్టి సాగతీయడం అక్కర్లేని అతుకు పెట్టినట్టుంది. ఆ బిట్టు ఈ తానులో ముక్క కాదు అన్నట్టు అనిపిస్తుంది. నిజానికి ఆ క్యారెక్టర్ పెట్టకపోయినా పెద్ద తేడా ఏమీ పడదు. హీరో అనాధ అని చెప్పి, అతని బాల్యానికి ఒక రూపమిచ్చి, అక్కడొక పాత్ర పెట్టి, దానికొక పర్పస్ ఇచ్చి, చివరికి దానిని క్లోజ్ చేయాల్సినంత పని పెట్టుకోవడం అనవసరం. ఈ అర్ధంపర్ధం లేని లైటర్ వీన్ కామెడీ తియ్యాలని డిసైడయ్యాక ఈ బరువైన ట్రాక్ ఎందుకు పెట్టాలనిపించిందో. అలాగే డైలాగ్స్, సన్నివేశాలు కూడా కడుపుబ్బ నవ్వించేవి లేవు.
బుల్లిరాజు పాత్ర నవ్వించింది. “ఓటీటీ వెబ్ సిరీస్ చూసి బాబు బాగా పాడైపోయాడు” అని వెంకటేష్ చెప్పడం తన “రానానాయుడు” సిరీస్ మీద తానే సెటైర్ వేసుకున్నట్టయ్యింది.
– బుల్లిరాజు పాత్రకి స్ఫూర్తి జంధ్యాల తీసిన “హైహై నాయకా” అయ్యుండొచ్చు. కాకపోయినా, చూసేవాళ్లకి ఆ క్యారెక్టర్ గుర్తురావడం సహజం.
– అలాగే ఆకెళ్లకి బాడీ డబుల్ ని పెట్టే సీన్ చూడగానే హాలీవుడ్ చిత్రం “డిక్టేటర్” ని ఫాలో అయినట్టు అనిపిస్తుంది. అవసరాల శ్రీనివాస్ లాంటి నటుడిని అ పాత్రకు పెట్టుకుని కాసేపైనా మంచి కామెడీ వండలేకపోవడం బాధాకరం.
– శవాన్ని మోసుకెళ్లే ట్రాక్ “పట్టుకోండి చూద్దాం” నుంచి ఎత్తినట్టుంది.
– జైలర్ పక్కన జూనియర్ పోలీస్ (ఉపేంద్ర లిమాయే-సాయికుమార్) ట్రాక్, “హలో బ్రదర్” లో కోట-మల్లికార్జున రావు ట్రాక్ ని గుర్తుకుతెస్తుంది.
ఇలా పలు సినిమాల ఆనవాళ్లు ఈ కామెడీ వంటకంలో కనిపించాయి. అది దోషమైతే కాదు.
నటీనటుల విషయానికొస్తే వెంకటేష్ ఎప్పటిలాగానే తన కామెడీ టైమింగుతో అలరించాడు. అయితే ఇంకాస్త ఎక్కువగా అలరించి ఉంటే బాగుండేది.
ఐశ్వర్య రాజేష్ హైలైట్ గా నిలిచింది. నేటివ్ టచ్ తో చాలా ఈజ్ తొ చేసింది. పాత్రలో ఒదిగిపోయింది.
మీనాక్షి చౌదరి కూడా పాత్రకి తగ్గట్టుగా ఉంటూ, సభ్యత దాటకుండా కనిపించింది.
ఉపేంద్ర లిమాయే- సాయికుమార్ “పీల గొంతు” ట్రాక్ సరదాగానే ఉంది. బాలనటుడు బుల్లిరాజు పాత్రలో మెప్పించాడు.
అనంత్ శ్రీరాం మాత్రం ఇలాంటి పాత్రలు ఎందుకు చేస్తున్నాడో అర్ధం కాదు. మరీ ఇలా ఊరు పేరు లేని విలన్ గ్యాంగులో ఒకడిగా కనిపించడం తన స్థాయికి చాలా అవమానం. నరేష్ ఓకే. వీటీవీ గణేష్ ఉన్నంతలో కాస్త నవ్వించాడు. శ్రీనివాస్ వడ్లమాని, శ్రీనివాస్ రెడ్డి తమ పని తాము చేసుకుపోయారు. లాస్ట్ సీన్లో దర్శకుడు అనీల్ రావిపూడి కూడా వచ్చి ఒక డైలాగ్ చెప్పాడు.
మొత్తమ్మీద, ఈ పండక్కి ఫ్యామిలీ ఆడియన్స్ ని హాలుకి రప్పించుకోదగ్గ సినిమా ఇదే. ట్రైలర్ ని బట్టి సినిమా కథ ఊహించేయొచ్చు. ఆ ఊహకి భిన్నంగా అయితే లేదు. సినిమా మొదలయ్యాక పావుగంట వరకు మరీ ఇంత సిల్లీగా ఉందేంటి అనిపిస్తుంది. కానీ కాసేపటికి ఆ సిల్లీ ప్రపంచంలోకి వెళ్లిపోయాక బాగానే ఉంటుంది. ఎక్కువ ఆశించకుండా, లాజిక్కులు వెతక్కుండా, రెండున్నర గంటల పాటు ఒక సుదీర్ఘ జబర్దస్త్ స్కిట్ లాంటి సినిమా చూడాలనుకుంటే చూడొచ్చు. కొన్ని పిండివంటల్ని మామూలు రోజుల్లో కోరుకోకపోయినా పండగలప్పుడు మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది కూడా అలాంటిదే. సంక్రాంతి పిండివంటల మధ్యన ఇదొక కమెడీ పిండివంట.
బాటం లైన్: కామెడీ పిండివంట
Movie super
నువు రాసిన రివ్యూ కి 2.75 రేటింగ్ ఎలా ఇస్తావు. నీ మైండ్ దొబ్బి నట్టుంది. ముందే 2.75 ఇవ్వాలి అని ఫిక్స్ అయినపుడు ఆ రేంజ్ లో మూవీ ని పొగడాలి కానీ లోపాలు అన్ని చెప్తూ 2.75 రేటింగ్ ఎలా ఇస్తావు.
నీకు రాం చరణ్, బాలకృష్ణ మీద కోపం ఇలా తీర్చుకుంటున్నావు అన్నట్లు ఉంది…
Daaku maharaj movie violence revenge drama thapaa yemmi ledhu
ఐతే ఓటిటిలో చూస్తాం
OTT lo choosina second half choodakkaraledu
One more OTT movie
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
One time watch, ishwarya Rajesh ni antha sepu screen meeda chudaleka poyanu.
GC goes to shed, Dil Raju will be Nil Raju, paapam
Targeted family audience and festival mood…. succeeded.
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
F2 అంత కామెడీ లేదు, F3 లాంటి వికారం వెకిలి అతి లేదు, గొప్పగా లేదు కానీ స్పీడ్ గా పోయింది సినిమా… గోదావరి యాస తెలంగాణ యాస అతికినట్టు ఉన్నాయి.. డ్యాన్సులు రీల్స్ లో చూస్తున్న స్టెప్స్.. ఫ్యామిలీ టైంపాస్… ఒకే
బాగుంది
2.75 ఇచ్చావ్..
రివ్యూ అంతా ఏడుస్తూనే ఉన్నావ్..
ఏందిరా నీ బాధ?..
F1,F2& F3 సినిమాల దర్శకుడే ఈ సినిమాకు కూడా తెలిసిన తరువాత కూడా ఈ సినిమాకు వచ్చినందుకు నిజంగా నన్ను నేనే చెప్పుతీసుకుని కొట్టుకోవాలి. వెకిలి హాస్యం ,జుగుప్సాకరమైన భాష ను ఆనందించగలిగే తెగింపు మీకుంటే ఈ సినిమా నిజంగానే మిమ్మల్ని మీ ఆనందపు అంచులకు తీసుకెళ్తుంది. 5 సంవత్సరాల బాలుడితో అంత నీచ ,నికృష్టమైన భాష మాట్లాడించడం బట్టే ఈ దర్శక నిర్మాతల అభిరుచి సంస్కారం గురించి తెలిసిపోతుంది. అన్నట్టు ఈ నిర్మాత Telangana film development corporation chairman అనుకుంటా కదా. ఇంకొక దరిద్రం ఏమిటంటే సంక్రాంతి+వెంకటేష్+ దిల్ రాజు = క్లాస్ పిక్చర్ అని జనం ఫిక్సయి పోయి ధియేటర్ కు వచ్చేస్తున్నారు. కాబట్టి ఎంత ఎబ్బెట్టుగా అనిపించినా కూడా నోరు మెదపడం లేదు. ఇంతా చేసి ఆఖరులో గురువుల గురించి చిన్న ఉపదేశం కూడానూ…దాని వలన హీరో ఔన్నత్యాన్నేదో elevate చేద్దామనేమో తెలియదు. అసలు IPS service నుండి బయటకు వచ్చిన హీరో, ఏ ప్రాంతపు యాసో తెలియని తెలుగులో మాట్లాడే హీరోయిన్ తొలిసారి కలుసుకున్న సన్నివేశం ఒక్కటి మచ్చుకి చాలు ఈ సినిమా మొత్తం ఎంత అప్రాచ్యపు సన్నివేశాల సమాహారమో తెలియజెప్పడానికి. ప్రేక్షకులలో బహుశా వీరి ప్రేక్షకులు వేరేమో మరి. నిజానికి ప్రేక్షకుల విఙ్ఞత మీద వీరికి కాస్తంత గౌరవం ఉన్నా ఈ సినిమాలో ఇన్ని అపభ్రంసపు సన్నివేశాలుండవు. కనెక్షన్ల ప్రకారం చూస్తే వీరి అంచనాలే నిజమనిపిస్తున్నాయ్.
పాచిపోయి కుళ్ళుకంపు కంపు కొట్టిన ఇద్దరి హీరోయిన్ల ఫార్ములా నేపధ్యంతో ఇంతటి కళాఖండాన్ని సృష్టించి ఆంధ్రుల పర్వదినాన ప్రేక్షకుల మీదకు గురిపెట్టి వదిలినందుకు దర్శక,నిర్మాతలకు శతసహస్ర కోటి వందనాలు. మీ గురి తప్పలేదయ్యా…
F1 మూవీ ఉందార అయ్య.
Just watched in OTT, you are 100% right. If this collected 300crs, i dont know what level ppl have fallen down. God only save them.
first half konchem bharincha vachu kani, second half daarunam. ee director ki comedy ante ento teleedu, logic anna word eppudu vini vundadu.