ఏడు కోట్లు కావాలంటున్న విలన్!

కాస్త క్రేజ్ వస్తే చాలు రెమ్యూనిరేషన్లు ఎక్కడికో వెళ్లిపోతాయి. అది హీరో అయినా, విలన్ అయినా. ఇదే తీరు. లేటెస్ట్ గా ఓ తమిళ విలన్ గారిని తెలుగులో చేయమని ఓ నిర్మాత అడిగితే…

కాస్త క్రేజ్ వస్తే చాలు రెమ్యూనిరేషన్లు ఎక్కడికో వెళ్లిపోతాయి. అది హీరో అయినా, విలన్ అయినా. ఇదే తీరు. లేటెస్ట్ గా ఓ తమిళ విలన్ గారిని తెలుగులో చేయమని ఓ నిర్మాత అడిగితే చెప్పిన రేటుకు నక్షత్రాలు కనిపించాయట. 

తెలుగులో మురుగదాస్-మహేష్ కాంబో సినిమాలో విలన్ గా చేసాడు దర్శకుడు ఎస్ జె సూర్య. అలాగే పవన్ కు భయంకరమైన ఫ్లాప్ ఇచ్చాడు.

ఆ తరువాత మరి ఇటు జాడలేదు. ఇటీవల తమిళంలో ఎస్ జె సూర్య పేరు కాస్త వినిపించడం ప్రారంభమైంది. దాంతో ఓ తెలుగు నిర్మాత ఎవరో తమ సినిమా కోసం అడిగారని తెలుస్తోంది. ఏడు కోట్లు రెమ్యూనిరేషన్ వుంటుంది అని అట్నుంచి సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది.

దాంతో ఇక ఆ నిర్మాత అటు ఆలోచించలేదట. పాండమిక్ తరువాత సినిమాల జోరు పెరిగింది. దాంతో రెమ్యూనిరేషన్లు అన్నీ పెరిగిపోతున్నాయి. సినిమాకు నాన్ థియేటర్ ఆదాయం పెరిగింది అనుకుంటే, అంతకు అంతా ఖర్చులు పెరిగిపోతున్నాయి.