సోషల్ మీడియాలో ఫాలోయర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వడం ద్వారా వారిని అలరించాలని అనుకునే సినీతారలకు పలు సార్లు ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది.
ఈ తరహా ఇంటర్వ్యూలకు స్పందిస్తూ ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ ద్వారా.. అభిమానించే వారిని పలకరించడం, మరింతగా ఫాలోయింగ్ ను పెంచుకోవడం తారల ఉద్దేశం కావొచ్చు. వారి ఉద్దేశం ఏదైనా.. వారిని ఫాలో అవుతూనే నెగిటివ్ కామెంట్లతో ఇబ్బంది పెట్టే వారు, ఇలాంటి సమయాల్లో రచ్చ చేస్తూ ఉంటారు.
దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదురైంది నటి దిశా పాట్నీకి. తాజాగా తన ఇన్ స్టాగ్రమ్ అకౌంట్ ద్వారా ఫాలోయర్లతో చాట్ చేసిన దిశాను ఒక తుంటరి ప్రశ్న ఎదురైంది. వివిధ అంశాల గురించి ఫాలోయర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన దిశ ను *ఫిగర్ సైజ్* అంటూ ఒక ఫాలోయర్ అడిగాడు.
ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఈ ఫీచర్ లో బోల్డ్ ప్రశ్నను అడిగాడు ఆ ఫాలోయర్. ఆస్క్ మీ ఎనీథింగ్ అని దిశనే చెప్పింది కాబట్టి, ఈ ప్రశ్న ఎందుకు అడిగారని ఎదురుప్రశ్నించడం దాదాపు సాధ్యం కాదు.
అందుకే ఎలాంటి ప్రశ్న ఎదురైనా దానికి లైటర్ వెయిన్ లో సమాధానంన ఇవ్వడం, లేదా హ్యూమరస్ గా స్పందించడం తప్పకపోవచ్చు. ఇదే రకంగా స్పందించింది దిశ కూడా. ఫిగర్ సైజ్ ఎంత..? అనే ప్రశ్నకు ఎబ్బెట్టుగా స్పందించడం కానీ, ఆ ఫాలోయర్ కు క్లాస్ పీకే పని కానీ పెట్టుకోలేదు. జస్ట్ ఒక హ్యాపీ పాండా యానిమేషన్ ను తన స్పందనగా పోస్టు చేసింది.
గడ్డిలో పొర్లాడే ఒక ఫ్యాటీ పాండా యానిమేషన్ ను ఆ ప్రశ్నకు సమాధానంగా ఇచ్చింది. ఆ బోల్డ్ కొశ్చన్ కు హ్యూమర్ ను సమాధానంగా ఇచ్చింది దిశ. ఇక నీ జీవిత లక్ష్యం ఏమిటంటే.. ఆనందంగా గడపడం అని సమాధానం ఇచ్చింది దిశ. ఒక అభిమాని కోరిక మేరకు తన నో మేకప్ ఫొటోను కూడా షేర్ చేసింది.