‘ఐకాన్’ బాల్ వేణు కోర్టులో

డైరక్టర్ వేణు శ్రీరామ్ పాలిట లాటరీలా మారింది వకీల్ సాబ్. ఈ లాటరీ కొడితే తరువాత సినిమా రెడీగా వుంది. లాటరీ తేడా వస్తే, ఇక మరి ఆ ప్రాజెక్టును అలా పక్కన పెట్టుకుని…

డైరక్టర్ వేణు శ్రీరామ్ పాలిట లాటరీలా మారింది వకీల్ సాబ్. ఈ లాటరీ కొడితే తరువాత సినిమా రెడీగా వుంది. లాటరీ తేడా వస్తే, ఇక మరి ఆ ప్రాజెక్టును అలా పక్కన పెట్టుకుని కూర్చొవాల్సిన పరిస్థితి. 2011 నుంచి 2021 వరకు వేణు శ్రీరామ్ చేసినవి మూడే సినిమాలు. అది కూడా ఒకటే బ్యానర్. ఓ మై ఫ్రెండ్, ఎంసిఎ, వకీల్ సాబ్.

ఓ మై ఫ్రెండ్ కు, వకీల్ సాబ్ కు మొత్తం రైటింగ్ వర్క్ అంతా వేణు శ్రీరామ్ నే హ్యాండిల్ చేసారు. ఎంసిఎ కు మాత్రం డైలాగ్ వెర్షన్ మాత్రం వేరే ఇద్దరు అందించారు. ఇప్పుడు తన రైటింగ్ స్కిల్స్, డైరక్షన్ స్కిల్స్ తో పింక్ రీ మేక్ ను కమర్షియల్ ఫ్లిక్ గా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వేణు మీద వుంది.

అలా చేస్తే బన్నీతో ఐకాన్ ప్రాజెక్టు రెడీగా వుంది. బన్నీకి నచ్చిన కథ. కానీ ఎప్పటికైనా చేస్తా కానీ ఇప్పుడే కాదు అని పక్కన పెట్టాడు. ఇప్పుడు వకీల్ సాబ్ తో వేణు ప్రూవ్ చేసుకుంటే ఆ ప్రాజెక్టు వెంటనే పట్టాలు ఎక్కే అవకాశం వుంది. ఓ మై ఫ్రెండ్ కు ఎంసిఎ కు మధ్య ఆరేళ్ల గ్యాప్. ఎంసిఎ హిట్ కొట్టినా వకీల్ సాబ్ చేతిలోకి రావడానికి నాలుగేళ్లు గ్యాప్. 

ఇప్పుడు అంత గ్యాప్ రావడానికి ఇక అవకాశం లేదు. ఎందుకంటే బన్నీతో ఐకాన్ ప్రాజెక్టు రెడీగా వుంది. అది స్టార్ట్ కావాలంటే కావాల్సింది ఒక్కటే. వకీల్ సాబ్ హిట్ కొట్టడం. అంతే.