నాకు దాదాపు హార్ట్ ఎటాక్ వచ్చింది

సాహో ప్రమోషన్స్ లో భాగంగా తన బలహీనతల్ని బయటపెట్టాడు ప్రభాస్. తనకు మొహమాటం, బద్ధకం ఎక్కువని.. వాటితో పాటు జనాల్లో కలవడానికి కూడా చాలా ఇబ్బంది పడతానని ఒప్పుకున్నాడు. వీటి నుంచి బయటపడ్డానికి చాలా…

సాహో ప్రమోషన్స్ లో భాగంగా తన బలహీనతల్ని బయటపెట్టాడు ప్రభాస్. తనకు మొహమాటం, బద్ధకం ఎక్కువని.. వాటితో పాటు జనాల్లో కలవడానికి కూడా చాలా ఇబ్బంది పడతానని ఒప్పుకున్నాడు. వీటి నుంచి బయటపడ్డానికి చాలా ప్రయత్నించానని, కానీ తనవల్ల కావడం లేదని చెప్పుకొచ్చాడు. వీటికితోడు విడుదల రోజు ఒత్తిడిని తట్టుకోవడం కూడా తనవల్ల కాదని స్పష్టంచేశాడు ప్రభాస్.

“రిలీజ్ రోజు నేను ఎవ్వర్నీ కలవను. పూర్తిగా నా ఫ్రెండ్స్ తోనే ఉండిపోతాను. ఈ ప్లాన్ లో ఎలాంటి మార్పులేదు. రిలీజ్ రోజు దాదాపు చచ్చిపోయినంత స్టేజ్ కు వచ్చేస్తాను. అయితే కాస్త మారదామని బాహుబలికి ముందు ఓసారి ట్రై చేశాను. రిలీజ్ రోజు జనాల్లోకి రావాలనుకున్నాను. రెబల్ సినిమాను ఎలాగైనా ప్రేక్షకులతో కలిసి చూడాలనుకున్నాను. మార్నింగ్ షోకు బయల్దేరాను కూడా. కానీ దారిలోనే డ్రాప్ అయిపోయాను. హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది.”

తన సినిమా రిలీజ్ రోజున పడుకుంటానంటున్నాడు ప్రభాస్. అయితే పూర్తిగా నిద్రపోనని, తనను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో పడుకుంటానని కలరింగ్ ఇస్తానని చెప్పుకొచ్చాడు. సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పుడు మాత్రమే లేపమని తన స్నేహితులకు చెబుతానని, బాహుబలి-1కు మాత్రం తనను ఎవ్వరూ లేపలేదంటున్నాడు.

“రిలీజ్ రోజు నేను పడుకుంటాను. సినిమాకు హిట్ టాక్ వస్తేనే లేపమన్నాను. లేదంటే లేపొద్దని చెబుతాను. బాహుబలి-1కు నన్ను ఎవ్వరూ నిద్రలేపలేదు. నార్త్ నుంచి మంచి టాక్ వచ్చింది. తెలుగులో మాత్రం ఆడియన్స్ కు పెద్దగా నచ్చలేదు. దీంతో నన్ను ఎవ్వరూ నిద్రలేపలేదు. నేనే లేచి ఏమైందని అడిగాను. జనాలకు నచ్చలేదన్నారు. కట్టప్ప, బాహుబలిని పొడిచి చంపడం ఎక్కలేదన్నారు. మరుసటి రోజు నుంచి మాత్రం సినిమా క్లిక్ అయింది.”

ఇలా తన బలహీనతల్ని ఒక్కొక్కటిగా బయటపెట్టాడు ప్రభాస్. ప్రమోషన్స్ కూడా తనకు ఇష్టముండదని, తప్పనిసరి పరిస్థితుల మధ్య ప్రచారానికి వస్తున్నానని చెప్పుకొచ్చాడు ప్రభాస్. ఇతడు నటించిన సాహో సినిమా 30న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి వస్తోంది.

అలాంటి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కోటలు కూలిపోయాయి

అడవిశేష్ తో రెజీనా స్పెషల్ చిట్ చాట్