నువ్వలా.. నేనిలా: ఇద్దరు దర్శకుల తీరిది!

ఇద్దరు దర్శకులు… ఇద్దరికీ రెండో ప్రయత్నం.. గమ్మత్తుగా వాళ్ల సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. ఫలితాలు మాత్రం వేర్వేరుగా వచ్చాయి. ఆ రెండు సినిమాలు కల్కి, బ్రోచేవారెవరురా. ఆ ఇద్దరు దర్శకులు ప్రశాంత్ వర్మ,…

ఇద్దరు దర్శకులు… ఇద్దరికీ రెండో ప్రయత్నం.. గమ్మత్తుగా వాళ్ల సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. ఫలితాలు మాత్రం వేర్వేరుగా వచ్చాయి. ఆ రెండు సినిమాలు కల్కి, బ్రోచేవారెవరురా. ఆ ఇద్దరు దర్శకులు ప్రశాంత్ వర్మ, వివేక్ ఆత్రేయ.

మెంటల్ మదిలో సినిమాతో సెన్సిబుల్ డైరక్టర్ అనిపించుకున్నాడు వివేక్ ఆత్రేయ. ఆ సినిమా కుర్రాళ్లందరికీ నచ్చింది. దీంతో తన రెండో సినిమాకు కూడా అదే పంథా అనుసరించాడు. మొదటి ప్రయత్నంగా పూర్తిగా లవ్ సబ్జెక్ట్ ఎంచుకున్న ఈ దర్శకుడు.. బ్రోచేవారెవరురా సినిమాకు క్రైమ్, కామెడీ కాన్సెప్ట్ సెలక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ కూడా సక్సెస్ కొట్టాడు.

ఇక మరో దర్శకుడు ప్రశాంత్ వర్మ విషయానికొస్తే, ఇతడు తొలి సినిమాతోనే ప్రయోగాల బాటపట్టాడు. “అ!” అనే స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాతో ఆకట్టుకున్నాడు. అది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తన రెండో సినిమాను కూడా ఈ దర్శకుడు ప్రయోగాత్మకంగా తీసి ఉంటే బాగుండేదేమో.

కానీ కల్కి లాంటి సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నాడు. దానికి కమర్షియల్ హంగులద్దే ప్రయత్నం చేశాడు. టెక్నికల్ అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాడు. దీంతో ఈ సినిమా యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకుంది. ఇలా ఒకేరోజు అదృష్టాన్ని పరీక్షించుకున్న ఇద్దరు దర్శకుల్లో ఒకరు సూపర్ హిట్ కొడితే, మరొకరు మిక్స్ డ్ టాక్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

జగన్‌ ఇంత దైర్యంగా చెప్పగలుగుతున్నారేమిటి