దిల్ రాజు-మళ్లీ ఆరు సినిమాలు

రెండేళ్ల క్రితం ఆరు సినిమాలు ఒకే ఇయర్ లో విడుదల చేసి, హిట్ లు కొట్టి, సంచలనం సృష్టించారు నిర్మాత దిల్ రాజు. కానీ గత ఏడాది ఆ ఫీట్ సాధ్యంకాలేదు. ఇప్పుడు మళ్లీ…

రెండేళ్ల క్రితం ఆరు సినిమాలు ఒకే ఇయర్ లో విడుదల చేసి, హిట్ లు కొట్టి, సంచలనం సృష్టించారు నిర్మాత దిల్ రాజు. కానీ గత ఏడాది ఆ ఫీట్ సాధ్యంకాలేదు. ఇప్పుడు మళ్లీ 2019లో అదే ఫీట్ చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ కావడంతో వచ్చిన ఉత్సాహంతో మాంచి మీడియం సినిమాల నిర్మాణాన్ని స్పీడప్ చేయాలని దిల్ రాజు డిసైడ్ అయ్యారు.

ఈ ఏడాదికి ఇప్పటికే ఎఫ్ 2 అందించారు. తరువాత మహేష్ బాబు మహర్షి రాబోతోంది. త్వరలో శర్వానంద్-సమంతల 96 ప్రారంభించబోతున్నారు. అంటే మూడు సినిమాలు ప్రథమార్థంలోనే రెడీ అవుతున్నాయి.

ఇవికాక, తన దగ్గర పెండింగ్ లో వున్న స్క్రిప్ట్ లు ఒక్కోటీ తీసి, ఎలా మెటీరియలైజ్ చేయాలన్నది డిస్కషన్లు స్టార్ట్ చేసారు. వీటిలో ఒకటి వేణుశ్రీరామ్ డైరక్షన్ లో వుంటుంది. ఈ మేరకు చర్చలు ప్రారంభించారు. అలాగే ఆ సినిమాకు మిక్కీ జె మేయర్ ను సంగీత దర్శకుడిగా తీసుకుంటున్నారు.

ఇంకో రెండు సినిమాల గురించి కూడా ప్రయత్నాలు షురూ చేసారు. ఇందులో ఓ స్క్రిప్ట్ ను టేకప్ చేయమని ఓ పాపులర్ దర్శకుడిని దిల్ రాజు కోరినట్ల బోగట్టా. మొత్తంమీద 2019లో దిల్ రాజు బ్యానర్ నుంచి ఆరు సినిమాలు రాబోతున్నాయన్నమాట.

జగన్, కేసీఆర్ కలయిక పరిణామం ఆంధ్రాలో ఎలా ఉండబోతోంది బిగ్ స్టోరీ 

సెక్సీ కామెంట్స్ః మగాళ్లు హద్దుల్లో ఉండాలిక!