సినిమాకు ప్రచారం అన్నది కీలకం. అందుకోసం మీడియాతో సమావేశాలు, ప్రెస్ మీట్లు, ఇంటర్వూలు ఇలాంటివి అన్నీ వుంటాయి. తెలుగునాట బోలెడు దినపత్రికలు, ఛానెళ్లు, లేటెస్ట్ గా అరడజనకు పైగానే పాపులర్ వెబ్ సైట్లు వున్నాయి. కానీ ఎన్టీఆర్ బయోపిక్ ప్రచారానికి మాత్రం ఇవన్నీ అక్కరలేదట.
జస్ట్ నాలుగు పత్రికలు తప్ప మరేవీ అక్కరలేదని బాలయ్య చెప్పేసారట. అసలు కేవలం ఈనాడు, జ్యోతి, సాక్షి చాలన్నారని తెలుస్తోంది. అయితే నమస్తే తెలంగాణను కూడా చేర్చకపోతే లేనిపోని ఇబ్బందులు అని చెప్పడంతో సరే అన్నారని తెలుస్తోంది. ఇక మిగిలిన అనేకానేక దినపత్రికలు ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, వామపక్షాల పత్రికలు ఇంకా చాలా వున్నాయి. కానీ ఇవేవీ అవసరం లేదంట.
అలాగే ఛానెళ్లకు ప్రత్యేకంగా మీట్ లు అవసరంలేదు. తామే రానాతో రకరకాల వీడియో కార్యక్రమాలు చేయించి, రెడీ మేడ్ గా చానెళ్లకు ఇచ్చేస్తారట. ఇక మిగిలిన వెబ్ సైట్లు అంటారా? అవి తెరవెనుక నిజాలు సేకరించి, గ్యాసిప్ లు రాస్తే ఎందుకు రాసారని గోలపెట్టడం తప్ప, మామూలుగా వాటిని పట్టించుకోవడం వుండదుగా? ఇండస్ట్రీ జనాలకు.
ఆఫ్ కోర్స్ సినిమా తేడా వస్తే మాత్రం, విడుదల తరువాత ప్రచారానికి ఏ సినిమాకైనా మళ్లీ వెబ్ సైట్లు, చానెళ్లు కావాల్సిందే. బయోపిక్ యూనిట్ వెబ్ సైట్లను దూరం పెట్టడానికి వేరే కారణం కూడా వుందని వినిపిస్తోంది.
ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలు, బాలయ్య ప్రచారం, తెలుగుదేశం దారుణ ఓటమి, అలాగే బయోపిక్ లో రాజకీయాల వైనాలు ఇలాంటివి ఎవరో ఒకరు కెలుకుతారు. దానితో అనవసరమైన తలకాయనొప్పి. నాలుగుపత్రికలు అయితే ముందగానే ఇవి అడగాలి.. అవి వద్దు అని రూల్స్ పెట్టేసి పని కానిచ్చేయవచ్చు అన్నది పాయింట్ అని తెలుస్తోంది.
జగన్ కి అవగాహన లేకే అలా మాట్లాడాడు.. ముద్రగడ సంచలన వ్యాఖ్యలు