బన్నీ డిజె సినిమా అన్నినాన్ బాహుబలి రికార్డులను అధిగమించేసినట్లు హడావుడి చేస్తున్నారు. అంటే ఇక్కడే ఓ అనుమానం వస్తోంది. ఇప్పటి దాకా మెగాస్టార్ చిరంజీవి ఖైదీ 150 సినిమాదే నాన్ బాహుబలి రికార్డు అంటూ వచ్చారు. ఇప్పుడు బన్నీ అన్నింటిని బద్దలు కొట్టేసాడు అంటే మెగాస్టార్ రికార్డు కూడా మటాష్ అయిపోయిందని అనుకోవాలా?
ఖైదీ నెం 150 మొదటి అయిదు రోజులకు వరల్డ్ వైడ్ గా 66కోట్లకు పైగా వచ్చిందన్నది అనధికారపు లెక్క. ఏపి తెలంగాణలో 46కోట్లకు పైగా వచ్చింది. డిజె సినిమా నాలుగు రోజులకు ఎపి తెలంగాణలో 42.38 కోట్లు వచ్చిందని యూనిట్ చెబుతోంది. దీనికి అయిదో రోజు ఎలా లేదన్నా మరో నాలుగో అయిదో కలుపుతారు. అంటే 46కోట్ల దాటేస్తుంది.
అంటే ఖైదీ నెం 150తో మెగాస్టార్ నెలకొల్పిన రికార్డును బన్నీ బద్దలు కొట్టేసినట్లే అనుకోవాలి. ఖైదీకి అయిదు రోజులకు 11కోట్ల పై చిలుకు వస్తే, బన్నీ డిజెకు 14.60 కోట్లు నాలుగు రోజులకే వచ్చిందంటున్నారు. అంటే ఇక్కడా మెగా రికార్డు మటాష్ నే అనుకోవాలి.
అయితే చిన్న పాయింట్ ఏమిటంటే, ఆంధ్ర, సీడెడ్ ఎక్కడా ఖైదీ అయిదు రోజుల రికార్డు బద్దలు కాలేదు. కేవలం నైజాంలోనే బద్దలయింది. ఆ లెక్కతోనే టోటల్ రికార్డు బద్దలయింది. అన్నట్లు నైజాం డిజె సినిమా ఓన్ రిలీజ్. అందువల్ల ఎంత చెబితే అంతే అనుకోవాలి.