ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ పై భారత్ ఘన విజయాన్నందుకుంది. దాదాపు ఇండియా అంతా నిన్న ఈ మ్యాచే చూసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కామెంట్స్, క్రికెట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్సే కనిపించాయి.
కొన్నేళ్లుగా పాకిస్థాన్ పై వరుసగా నెగ్గుకొస్తున్న ఇండియా, ఈసారి కూడా దాయాది దేశాన్ని సునాయాసంగా ఓడించింది. దీంతో ఇండియాలో పండగ వాతావరణం కనిపించింది. అయితే ఈ వేడుకల్లో భాగంగా నటుడు సోనూసూద్ మాత్రం పొరపాటున ఇండియా జెండాకు కాకుండా మరో దేశానికి సెల్యూట్ చేశాడు.
ఇండియా గెలిచిన వెంటనే సోషల్ మీడియాలో రియాక్ట్ అయిన సోనూసూద్, భారత్ గెలిచిందోచ్ అంటూ తన ఆనందాన్ని వ్యక్తంచేశాడు. పనిలో పనిగా మొబైల్ లో అందుబాటులో ఉన్న స్టిక్కర్లలోంచి జాతీయ జెండా ఫొటోల్ని చకచకా పోస్ట్ చేశాడు. అయితే అవి ఇండియాకు చెందిన జాతీయ జెండాలు కావు. నైగర్ దేశానికి చెందినవి.
పోస్ట్ పెట్టిన పావుగంటకు సోనూసూద్ కు ఎవరో విషయం చెప్పినట్టున్నారు. వెంటనే పెట్టిన పోస్ట్ కు కొనసాగింపుగా.. ఈసారి అసలైన భారతీయ జెండాల్ని పోస్ట్ చేశాడు సోనూసూద్. చూడ్డానికి నైగర్, ఇండియా జెండాలు ఒకేలా ఉంటాయి. అందుకే సోనూసూద్ పొరపాటుపడ్డాడు.