జార్జ్ రెడ్డి, ప్రెజర్ కుక్కర్ లాంటి సినిమాలతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న నిర్మాత అప్పి రెడ్డి తన మూడవ చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాకు హీరోగా బిగ్ బాస్ ఫేం సోహైల్ ను తీసుకున్నారు.
కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ సినిమాతో పరిచయమవుతున్నాడు.ఈ సినిమా పూజా కార్యక్రమాలతో బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా మైక్ మూవీ నుండి ‘‘జార్జి రెడ్డి’’ , ‘‘ప్రెషర్ కుక్కర్’’ వంటి మూవీస్ తీశాం అవి ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు మూడవ సినిమాను కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి తో కలసి బిగ్ బాస్ ఫేం సోహైల్ హీరోగా చేస్తున్నాం..ఇప్పటివరకు భారతదేశ చిత్ర చరిత్రలో రాని ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు చాలా మంది టాలెంటెడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాం.’’ అన్నారు