కిమ్ కర్దాషియాన్… రోజుకో విధంగా నగ్న రూపాన్ని ప్రదర్శిస్తున్న సెలబ్రిటీ. ఈ అమెరికన్ రియాలిటీ టెలివిజన్ పర్సనాలిటీ… బహిరంగంగానో, బాత్ రూమ్ లోనో ఇస్తున్న నగ్న పోజుల ద్వారా.. అనునిత్యం వార్తల్లోకి వస్తోంది. ఈ తరహాలో దూసుకుపోతున్న ఈమెను ప్రపంచం హాటెస్ట్ సెలబ్రిటీగా గుర్తించింది. అయితే అతి సర్వత్రా వర్జయేత్..అన్నట్టుగా మారుతోందిప్పుడు పరిస్థితి.
ట్రాన్స్ పరెంట్ డ్రస్సుల్లో బహిరంగ వేదికల మీద అందాలను ఆరబోయడం.. తనకు మాత్రమే ప్రత్యేకంగా జఘన సంపద ఉందని ఫీలవుతూ.. వాటితో వికారమైన పొజులు ఇవ్వడం, నిర్లజ్జ గా నగ్న సెల్ఫీలను తీసుకుని… సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం.. ఇవన్నీ ఈమె దిన చర్యలు అయిపోయాయి!
అనుదినం ఆమె వీటిల్లో ఏదో ఒక పని చేయడం.. వాటిని పబ్లిష్ చేయడం, పోస్టు చేయడం కన్నా భాగ్యం లేదన్నట్టుగా అమెరికన్, కెనడియన్, యూరోపియన్ మీడియా వర్గాలు ఆమె అందాల ప్రదర్శనను హైలెట్ చేయడం! వార్తల్లో ఉండటానికి కిమ్ కి ఇంత కన్నా మార్గం లేదు. మీడియాకూ అర్ధనగ్న బొమ్మలు ఎన్నుంటే అంత ఆనందం.. వీక్షకులకూ ఇదో ఆహ్లాదం..ఇలా సాగుతోంది!