రూ.235 కోట్లు.. లాక్ డౌన్ తర్వాత రికార్డ్ ఇది

కరోనా/లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ లో పెను మార్పులు వస్తాయని భావించాం. మరీ ముఖ్యంగా హీరోల రెమ్యూనరేషన్లు, డిస్ట్రిబ్యూషన్ రేట్లు తగ్గుతాయని అంతా అనుకున్నారు. కానీ టాలీవుడ్ లో రేట్లు అస్సలు తగ్గలేదనే విషయం…

కరోనా/లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ లో పెను మార్పులు వస్తాయని భావించాం. మరీ ముఖ్యంగా హీరోల రెమ్యూనరేషన్లు, డిస్ట్రిబ్యూషన్ రేట్లు తగ్గుతాయని అంతా అనుకున్నారు. కానీ టాలీవుడ్ లో రేట్లు అస్సలు తగ్గలేదనే విషయం తెలిసొస్తూనే ఉంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా దాదాపు అవే ట్రెండ్స్ కనిపిస్తున్నాయి.

హీరోల రెమ్యూనరేషన్స్ సంగతి పక్కనపెడితే.. నార్త్ లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తో పాటు శాటిలైట్, డిజిటల్ రేట్లు తగ్గుతాయని ట్రేడ్ భావించింది. కానీ వాళ్ల అంచనాలకు రివర్స్ లో బిజినెస్ జరుగుతోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది సల్మాన్ ఖాన్ రాధే మూవీ.

ఈ సినిమాకు చెందిన కొన్ని హక్కుల్ని జీ గ్రూప్ సంస్థ ఏకంగా 235 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. లాక్ డౌన్ తర్వాత బాలీవుడ్ లో జరిగిన అతిపెద్ద డీల్ ఇది. 

రాధే సినిమాకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్, మ్యూజిక్, జీ5 స్ట్రీమింగ్ హక్కుల్ని ఇంత మొత్తానికి దక్కించుకుంది సదరు సంస్థ. రాధే సినిమా థియేటర్లలోకి వచ్చిన 2 వారాలకే జీ5లో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టాలనేది తాజా ఒప్పంద సారాంశం.

ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా దిశాపటానీ హీరోయిన్ గా వస్తున్న ఈ యాక్షన్ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను మే 13న రిలీజ్ చేయబోతున్నారు.

త‌ప్పు క‌దా..?

మీరు  మారిపోయారు సార్‌